Pemmasani Chandrashekhar : డిజిటల్ అరెస్ట్ పేరుతో జరుగుతున్న సైబర్ మోసాలపై ప్రజలు జాగ్రత్తగా ఉండాలని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ హెచ్చరించారు. ఇటీవలి కాలంలో సైబర్ నేరగాళ్లు పోలీసు అధికారులుగా నటిస్తూ వీడియో కాల్స్ ద్వారా ప్రజలను భయపెట్టి డబ్బులు వసూలు చేస్తున్నట్లు ఆయన తెలిపారు.

ఇలాంటి మోసాలకు గురి కాకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పద కాల్స్ లేదా సందేశాలు వచ్చినప్పుడు వెంటనే స్పందించకుండా అధికారిక మార్గాల ద్వారా నిర్ధారించుకోవాలని సూచించారు. సైబర్ నేరాలపై ఫిర్యాదు చేయడానికి 1930 హెల్ప్‌లైన్‌ను వినియోగించాలని ఆయన తెలిపారు.

ప్రజల్లో అవగాహన పెంచేందుకు ఈ అంశంపై ప్రత్యేకంగా ఒక వీడియోను రూపొందించి సోషల్ మీడియా వేదిక ‘ఎక్స్’లో షేర్ చేసినట్లు మంత్రి పేర్కొన్నారు. డిజిటల్ ప్రపంచంలో భద్రత కోసం ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా వ్యవహరించాలని ఆయన సూచించారు.

Tags: