CM Chandrababu: డేటా ఆధారిత పాలనను మరింత బలోపేతం చేయాలని అధికారులను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారు. సోమవారం రాజధాని అమరావతిలోని సచివాలయంలో ఆయన అధ్యక్షతన రియల్ టైమ్ గవర్నెన్స్ (ఆర్టీజీఎస్)పై ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. అలాగే డేటా డ్రైవెన్ డెసిషన్ మేకింగ్‌పై మంత్రులు, అధికారులతో సమీక్ష నిర్వహించారు.

డేటా లేక్ పురోగతిపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఏఐ లివింగ్ ల్యాబ్స్, ఏఐ స్టాక్ అమలుపై సమీక్షించారు. వాట్సాప్ గవర్నెన్స్ ‘మన మిత్ర’ సేవలపై చర్చించారు. అవేర్ ప్లాట్‌ఫామ్ పని తీరును కూడా సమీక్షించారు. పీజీఆర్‌ఎస్ ద్వారా ప్రజా ఫిర్యాదుల పరిష్కారంపై, ఆస్పత్రుల డేటా విశ్లేషణపై ఆ శాఖ అధికారులతో చర్చించారు. ఎంఈపీఎంఏ సేవల పనితీరు, ఆర్‌ఓఆర్ మ్యుటేషన్ ప్రక్రియ పురోగతిపై సీఎం ఆరా తీశారు.

ఈ సందర్భంగా రిజిస్ట్రేషన్లు, రీ-సర్వే అంశాలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఎఫ్-లైన్ సర్వే పురోగతిని సమీక్షించారు. రేషన్ పంపిణీ డేటా విశ్లేషణపై అధికారులతో చర్చించారు. ఈ సమీక్షకు ఆర్టీజీఎస్, ఐటీఈఅండ్‌సీ, రెవెన్యూ, విద్య, వ్యవసాయ శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు.

Tags: