Supreme Court Collegium: ఏపీ హైకోర్టుకు ముగ్గురు న్యాయమూర్తుల నియామకం సిఫారసు.. సుప్రీం కొలీజియం కీలక నిర్ణయం

సుప్రీం కొలీజియం కీలక నిర్ణయం

Update: 2026-05-05 12:37 GMT

Supreme Court Collegium: ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు ముగ్గురు న్యాయమూర్తులను సుప్రీం కోర్టు కొలీజియం సిఫారసు చేసింది. దేశవ్యాప్తంగా వివిధ హైకోర్టులకు న్యాయమూర్తుల నియామకాల ప్రక్రియలో భాగంగా కొలీజియం నిన్న సమావేశమై పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ సమావేశంలో ఏపీ హైకోర్టు ఖాళీలను భర్తీ చేయడానికి మూడు పేర్లను కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేసింది.

రాష్ట్రంలోని వివిధ న్యాయస్థానాల్లో న్యాయాధికారులుగా పనిచేస్తున్న గంధం సునీత, ఆలపాటి గిరిధర్, చింతపూడి పురుషోత్తమ్ కుమార్లను హైకోర్టు న్యాయమూర్తులుగా పదోన్నతి ఇవ్వాలని కొలీజియం సిఫారసు చేసింది. రాష్ట్రపతి ఆమోదం తర్వాత ఈ నియామకాలపై అధికారిక ఉత్తర్వులు వెలువడనున్నాయి.

ఈ నియామకాలతో ఏపీ హైకోర్టులో ఖాళీలు భర్తీ అయి, న్యాయపరమైన వ్యవహారాలు మరింత సమర్థవంతంగా, వేగంగా నడిచే అవకాశం ఉంది. కొలీజియం సిఫారసులు సాధారణంగా రాష్ట్రపతి ఆమోదంతో అమలవుతాయి.

Tags:    

Similar News