Deputy CM Pawan Kalyan: 2.5 కోట్ల సీడ్ బాల్స్ తయారీ లక్ష్యం: ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్
ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్
Deputy CM Pawan Kalyan: ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 15వ తేదీ వరకు 2.5 కోట్ల సీడ్ బాల్స్ తయారు చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ప్రకటించారు. ప్రతి సీడ్ బాల్ ఒక చెట్టును సృష్టించే శక్తిని కలిగి ఉంటుందని ఆయన వివరించారు.
ఎన్టీఆర్ జిల్లా మూలపాడు బటర్‌ఫ్లై పార్క్‌లో ఏర్పాటు చేసిన ప్రపంచ పర్యావరణ దినోత్సవం కార్యక్రమంలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులతో కలిసి సీడ్ బాల్స్ తయారు చేశారు.
ప్రసంగించిన పవన్ కల్యాణ్, “ప్రతి చెట్టు వాతావరణ మార్పుల ప్రభావం నుంచి భూమిని కాపాడుతుంది. సీడ్ బాల్స్‌ను అడవులు, కొండ ప్రాంతాలు, నదీ తీరాల్లో వెదజల్లే ఏర్పాట్లు చేస్తున్నాం. మనుషులు వెళ్లలేని ప్రాంతాల్లో డ్రోన్‌ల సాయంతో సీడ్ బాల్స్ వేస్తాం. మొక్కల సంరక్షణ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి. చెట్లు నాటడం అలవాటుగా చేసుకోవాలి. నాటడమే కాదు, వాటిని సంరక్షించడం కూడా చాలా ముఖ్యం” అని పిలుపునిచ్చారు.
కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్, పలువురు ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.
ఈ కార్యక్రమం ద్వారా రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో భారీ స్థాయిలో పచ్చదనం పెంపొందించడం లక్ష్యం.