Liquor Scam: లిక్కర్ స్కాంలో నారాయణ స్వామికి ఉచ్చు.. మొబైల్‌ను ఎఫ్‌ఎస్‌ఎల్‌కు పంపిన ఏసీబీ కోర్టు
మొబైల్‌ను ఎఫ్‌ఎస్‌ఎల్‌కు పంపిన ఏసీబీ కోర్టు
By : PolitEnt Media
Update: 2025-09-12 10:09 GMT
Liquor Scam: ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కాం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. మాజీ డిప్యూటీ సీఎం, వైసీపీ నాయకుడు నారాయణ స్వామి మొబైల్‌ను ఫోరెన్సిక్ లాబొరేటరీ (ఎఫ్‌ఎస్‌ఎల్)కు పంపేందుకు ఏసీబీ కోర్టు అనుమతి ఇచ్చింది. ఈ కేసులో నారాయణ స్వామి కాల్ డేటా, బ్యాంక్ లావాదేవీలపై సిట్ అధికారులు దృష్టి సారించారు.
గతంలో జగన్ ప్రభుత్వ హయాంలో ఎక్సైజ్ శాఖ మంత్రిగా వ్యవహరించిన నారాయణ స్వామిని సిట్ అధికారులు ఇప్పటికే విచారించారు. ఆయన మొబైల్‌లో కీలక ఆధారాలు లభించే అవకాశం ఉందని భావిస్తూ, ఎఫ్‌ఎస్‌ఎల్ రిపోర్ట్ కోసం సిట్ అధికారులు ఎదురుచూస్తున్నారు.