Visakhapatnam Investment Festival: విశాఖలో పెట్టుబడుల పండుగకు ఘనంగా శ్రీకారం.. డోలు వాయించి సీఐఐ సదస్సును ప్రారంభించిన చంద్రబాబు, పవన్, పీయూష్ గోయల్!
చంద్రబాబు, పవన్, పీయూష్ గోయల్!
Visakhapatnam Investment Festival: విశాఖపట్నంలో 31వ సీఐఐ భాగస్వామ్య సదస్సు (CII Partnership Summit) గురువారం ప్రారంభమైంది. ఏయూ ఇంజినీరింగ్ కళాశాల మైదానంలో జరుగుతున్న ఈ రెండు రోజుల సదస్సుకు కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేశ్‌తో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, పారిశ్రామికవేత్తలు పాల్గొన్నారు.
సదస్సు ప్రాంగణంలో కళాకారులు థింసా, తప్పెటగుళ్లు, గరగ నృత్యాలతో నేతలకు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పీయూష్ గోయల్, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కాసేపు సాంప్రదాయ డోలు వాయించి కళాకారులను ఉత్సాహపరిచారు. ఈ దృశ్యం అందరినీ ఆకట్టుకుంది. అనంతరం ఏపీ పెవిలియన్, ఎంఎస్ఎంఈ పెవిలియన్లను నేతలు ప్రారంభించారు.
సదస్సులో వివిధ సంస్థలు ప్రభుత్వంతో 141 ఎంఓయూలు కుదుర్చుకోనున్నాయి. వీటి ద్వారా రూ.12.14 లక్షల కోట్ల పెట్టుబడులు, 2.46 లక్షల మందికి ఉపాధి లభిస్తుందని అంచనా. గత ఏడాది సదస్సులో కుదిరిన ఒప్పందాల అమలు ఫలితాలను సమీక్షిస్తూ ఈసారి లక్ష్యాలను నిర్దేశించారు. పవన్ కళ్యాణ్‌తో లోకేశ్ భేటీ అయ్యి పెట్టుబడుల వివరాలు వివరించారు.
ఈ సదస్సు రాష్ట్రానికి పెద్ద ఎత్తున పెట్టుబడులు రాబట్టే కీలక వేదికగా మారింది.