Capital Amaravati : మూడేళ్ళలో అమరావతిని వంద శాతం పూర్తి చేస్తాం
రాజధాని ప్రాంతంలో నిర్మాణ పనులను పరిశీలించిన మంత్రి నారాయణ;
వందకి వంద శాతం మూడేళ్ళలో రాజధాని నిర్మాణం పూర్తి చేస్తామని మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ ప్రకటించారు. శుక్రవారం రాజధాని అమరావతి ప్రాంతంలో ప్రభుత్వ భవనాల నిర్మాణ పనులను మంత్రి నారాయణ పరిశీలించారు. నేలపాడులో నిర్మాణం అవుతున్న ఎన్జీఓ, గెజిటెడ్ అధికారులు, క్లాస్ 4 ఉద్యోగుల క్వార్లర్ల నిర్మాణ పనులను మంత్రి పర్యవేక్షించారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ అమరావతి నిర్మాణం జరగడం లేదని కొంత మంది దుష్ప్రచారం చేస్తున్నారని అటువంటి వాళ్ళ మాటలు నమ్మద్దని మంత్రి చెప్పారు. వచ్చే సంవత్సరం మార్చి నాటికి మొత్తం నాలుగు వేల ప్లాట్ల నిర్మాణం పూర్తవుతుందని మంత్రి నారాయణ తెలిపారు. ఈ ప్లాట్లలో నివాసం ఉండే అధికారులు, ఉత్యోగుల కోసం ఎస్‌ఆర్‌ఎమ్, వీఐటీ యూనివర్శిటీలతో పాటు సీబీఎస్‌ఈ పాఠశాలలు, సుపర్ స్పెషాలిటీ ఆసుపత్రులను కూడా వచ్చే మార్చి నాటికి ఏర్పాటు చేస్తామని నారాయణ అన్నారు. ఉద్యోగస్తుల నివాస సముదాయాలు పూర్తయ్యేనాటికి ఈ ప్రాంతంలో అన్ని వసతులు కల్పిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. అలాగే రైతుల రిటర్నబుల్ ఫ్లాట్లలో కూడా వర్షాలు తగ్గిన వెంటనే మౌలిక వసతుల ఏర్పాట్లు ప్రారంభింస్తామని నారాయణ పేర్కొన్నారు. ఇప్పటికే ఎల్పీఎస్ లలో మౌలిక వసతుల కల్పన కోసం టెండర్లు పూర్తయ్యాయని చెప్పారు. గత ప్రభుత్వం సింగపూర్ అధికారులపై కేసులు పెట్టి వేధించారని, ఆ ప్రభుత్వానికి ఒక నగరం ఎలా నిర్మించాలో అవగాహన లేదన్నారు. గత ప్రభుత్వ నిర్వాకంతో ఏపీకి సింగపూర్ కి మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయని తెలిపారు. 2014-19 మధ్య టీడీ ప్రభుత్వంలో 1450 ఎకరాల భూమిని 42.58 నిష్పత్తిలో స్విస్ ఛాలెంజ్ విధానంలో కేటాయించామని దాన్ని వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వం కొనసాగించలేదని, కొనసాగించి ఉంటే పెద్ద పెద్ద కంపెనీలు, బ్యాంకులు అమరావతికి వచ్చేవని మంత్రి నారాయణ చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలో మంత్రులు, అధికారుల బృందం రేపు శనివారం నుంచి ఐదు రోజుల పాటు సింగ్‌పూర్ పర్యటనకు వెళుతున్నామని, ఈ పర్యటనలో సింగపూర్ ప్రభుత్వానికి ఏపీపై ఉన్న ముద్ర పోయేలా అక్కడి ప్రభుత్వం, అధికారులుచర్చిస్తామని మంత్రి నారాయణ వెల్లడించారు.