Home Minister Anitha Issues a Strong Warning: విషప్రచారాలు కట్టడి చేస్తాం.. ప్రతీది బహిర్గతం చేస్తాం: హోం మంత్రి అనిత

హోం మంత్రి అనిత

Update: 2026-06-03 10:03 GMT

Home Minister Anitha Issues a Strong Warning: మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. డీఎస్సీలో అక్రమాలు జరిగాయని ఏ ఆత్మ చెప్పిందని, ఎనిమిది నెలల తర్వాత జగన్ విషప్రచారం మొదలుపెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

"గుడ్డ కాల్చి ముఖానికి వేస్తే తుడుచుకునే పరిస్థితిలో మేము లేము. ఎవరు కాల్చారు, ఏ ఉద్దేశ్యంతో కాల్చారో ప్రజల ముందు ప్రతీ విషయం బహిర్గతం చేసేందుకు సిద్ధంగా ఉన్నాం" అని స్పష్టం చేశారు. ప్రజలు అర్థం చేసుకునేలా సమాధానం ఇస్తామని, విషప్రచారాలను కట్టడి చేస్తామని హెచ్చరించారు. తప్పుడు ప్రచారాలు చేసేవారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయవలసి వస్తుందని హెచ్చరిక జారీ చేశారు.

రాష్ట్రంలో ప్రస్తుతం ఉపాధ్యాయులుగా పని చేస్తున్న వారిలో అత్యధిక శాతం టీడీపీ ప్రభుత్వంలోనే నియమితులైన వారేనని మంత్రి అనిత తెలిపారు. డీఎస్సీ పోస్టింగ్ అనేది ఎన్నో కుటుంబాలకు భావోద్వేగపరమైన అనుబంధం అని చెప్పారు. ఎలాంటి కోర్టు కేసులు అడ్డంకి రాకుండా అన్ని సమస్యలను పరిష్కరించి, గౌరవప్రదంగా ప్రతి ఒక్కరికీ నియామక పత్రాలు అందజేశామన్నారు.

లీకేజీకి స్కోప్ లేకపోవడంతో స్పోర్ట్స్ కోటా వైపు దృష్టి సారించారని మండిపడ్డారు. బీకాం చదివి కెమిస్ట్రీలో డిగ్రీ పొందిన వారంతా గొడ్డలి పార్టీలో ఉండి ఏది పడితే అది మాట్లాడుతున్నారని వ్యాఖ్యానించారు. సమాధానం ఇవ్వాల్సిన అవసరం లేదు, సమస్యలు సృష్టించాలన్నదే వారి లక్ష్యమని విమర్శించారు.

2022లో గొడ్డలి పార్టీ అధికారంలో ఉన్నప్పుడు తెచ్చిన హారిజాంటల్ రిజర్వేషన్ ఆధారంగానే డీఎస్సీ నియామకాలు జరిగాయని హోం మంత్రి వివరించారు. ఉపాధ్యాయులను మద్యం దుకాణాల ముందు పెట్టిన వారు బ్రిడ్జి స్పోర్ట్స్ గురించి అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. బ్రిడ్జి స్పోర్ట్స్ అంటే గొడ్డలి నేతలు నడిపిన పేకాట క్లబ్‌లు కాదని స్పష్టం చేశారు.

గత ప్రభుత్వం నిర్వహించిన గ్రూప్-1 నియామకాల పరిస్థితి ఎలా ఉందో అందరికీ తెలుసని హోం మంత్రి అనిత గుర్తు చేశారు.

Tags:    

Similar News