CM Chandrababu: డీలిమిటేషన్‌తోపాటు మహిళా రిజర్వేషన్ బిల్లు తీసుకురావాలి: సీఎం చంద్రబాబు
సీఎం చంద్రబాబు
CM Chandrababu: డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ బిల్లులపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. మహిళలకు 33 శాతం రిజర్వేషన్‌ను టీడీపీ ప్రకటించడం దేశ రాజకీయాల్లో ప్రస్తుతం చర్చనీయాంశమవుతోందని అన్నారు.
మహిళా రిజర్వేషన్ బిల్లును అన్ని రాజకీయ పార్టీలు స్వాగతించాల్సిన సమయం ఆసన్నమైందని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. మొదటి నుంచి మహిళల సాధికారతకు టీడీపీ అండగా నిలుస్తోందని గుర్తు చేశారు.
డీలిమిటేషన్ విషయంలో 2011 జనాభా లెక్కలు లేదా తాజా లెక్కలు ఏవైనా ఆంధ్రప్రదేశ్‌కు నష్టం కలుగుతుందని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు. అందువల్ల ప్రస్తుతం ఉన్న స్థానాల సంఖ్యను 50 శాతం పెంచితే అందరికీ న్యాయం జరుగుతుందని సూచించారు. పెంచిన స్థానాలను మహిళలకు కేటాయించవచ్చని ఆయన అన్నారు. ఈ విధంగా చేస్తే గతంలో ఈ బిల్లును వ్యతిరేకించిన వారి ఆలోచన కూడా మారవచ్చని వ్యాఖ్యానించారు.
పార్లమెంట్ నియోజకవర్గాల పునర్విభజన, మహిళా రిజర్వేషన్ బిల్లుల విషయంలో కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా పట్టుదల చూపుతోందని చంద్రబాబు తెలిపారు. రెండు బిల్లులను కలిపి తీసుకురావడానికి కేంద్రం సిద్ధంగా ఉందని, వాటిని విడదీసి చూడాల్సిన అవసరం లేదని ప్రశ్నించారు. రెండు బిల్లులు కలిపి వస్తేనే మహిళలకు న్యాయం జరుగుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.
మహిళా రిజర్వేషన్ మరియు డీలిమిటేషన్ బిల్లులు తప్పనిసరిగా తీసుకురావాలని, ఇవి దేశ రాజకీయాల్లో భారీ మార్పులను తీసుకువస్తాయని సీఎం చంద్రబాబు నాయుడు విశ్వాసం వ్యక్తం చేశారు.