Mahindra Scorpio N : 2026లో రాబోతున్న స్కార్పియో N ఫేస్‌లిఫ్ట్.. టెస్టింగ్ మొదలు.. డిజైన్, ఫీచర్లలో భారీ మార్పులు
టెస్టింగ్ మొదలు.. డిజైన్, ఫీచర్లలో భారీ మార్పులు
Mahindra Scorpio N : భారత మార్కెట్లో విపరీతమైన ప్రజాదరణ పొందిన మహీంద్రా స్కార్పియో ఎన్ లవర్స్‌కు గుడ్‌న్యూస్. ఈ అత్యంత పాపులర్ మోడల్‌కు దాని మొదటి మిడ్‌లైఫ్ అప్‌డేట్ 2026 ప్రారంభంలో రాబోతోంది. అధికారికంగా విడుదల కావడానికి ముందే 2026 మహీంద్రా స్కార్పియో ఎన్ ఫేస్‌లిఫ్ట్ టెస్టింగ్ సమయంలో తొలిసారిగా కెమెరా కంట పడింది. ముఖ్యంగా డిజైన్‌లో, ఫీచర్లలో భారీ మార్పులు ఉంటాయని అంచనా వేస్తున్న ఈ కొత్త మోడల్ గురించి, రాబోయే అప్‌డేట్‌లు, ఇంజిన్ స్పెసిఫికేషన్స్ గురించి పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.
భారత మార్కెట్‌లో అత్యంత విజయవంతమైన ఎస్‌యూవీలలో ఒకటైన మహీంద్రా స్కార్పియో ఎన్ తన మొదటి మిడ్‌లైఫ్ ఫేస్‌లిఫ్ట్ అప్‌డేట్‌ను 2026 ప్రారంభంలో అందుకోబోతోంది. తాజాగా, పూర్తిగా కవర్ చేయబడిన టెస్ట్ మోడల్ రోడ్లపై తొలిసారిగా టెస్టింగ్ చేస్తూ కనిపించింది. టెస్ట్ మోడల్ పూర్తిగా కవర్ చేయబడి ఉన్నప్పటికీ, ప్రస్తుత మోడల్ స్ట్రాంగుగా నిటారుగా ఉండే స్టాన్స్, బోల్డ్ సిల్హౌట్‌ను ఇది కొనసాగిస్తుందని స్పష్టమవుతోంది. వెనుక వైపున పాత టెయిల్ ల్యాంప్ అసెంబ్లీ, రూఫ్ రైల్స్, అండర్-బాడీ స్పేర్ వీల్ కనిపిస్తున్నాయి.
కొత్త 2026 స్కార్పియో ఎన్ ఫేస్‌లిఫ్ట్‌లో డిజైన్ మార్పులు ఎక్కువగా ముందు భాగంలో ఉండే అవకాశం ఉంది. ఈ ఎస్‌యూవీలో కొత్తగా డిజైన్ చేయబడిన గ్రిల్, కొద్దిగా మార్చిన బంపర్, సరికొత్త ఎల్‌ఈడీ డీఆర్‌ఎల్ సిగ్నేచర్‌తో కూడిన హెడ్‌ల్యాంప్‌లు ఉండే అవకాశం ఉంది. డైమెన్షన్ల పరంగా, అంటే కారు కొలతల్లో పెద్దగా మార్పులు ఉండకపోవచ్చు. క్యాబిన్ లోపల కూడా చిన్నపాటి మార్పులు ఆశించవచ్చు. 2026 స్కార్పియో ఎన్ ఫేస్‌లిఫ్ట్‌లో మరింత పెద్ద టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, కంప్లీట్ డిజిటల్ టీఎఫ్‌టీ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ లభించే అవకాశం ఉంది.
రాబోయే మహీంద్రా ఎక్స్‌యూవీ 700 ఫేస్‌లిఫ్ట్ నుండి కొన్ని ప్రీమియం ఫీచర్లను ఈ స్కార్పియో ఎన్‌కు తీసుకునే అవకాశం ఉంది. వీటిలో పనోరమిక్ సన్‌రూఫ్, ప్రీమియం హర్మాన్ కార్డాన్ ఆడియో సిస్టమ్ వంటివి ఉండొచ్చు. సాధారణంగా ఫేస్‌లిఫ్ట్ అప్‌డేట్‌లో ఇంజిన్లలో పెద్దగా మార్పులు ఉండవు. స్కార్పియో ఎన్ విషయంలో కూడా అదే జరగనుంది. కొత్త స్కార్పియో ఎన్ ఫేస్‌లిఫ్ట్‌లో ప్రస్తుతం ఉన్న ఇంజిన్ ఆప్షన్లు కొనసాగుతాయి. ప్రస్తుతం ఉన్న స్కార్పియో ఎన్ మోడల్ ధరలు రూ.13.20 లక్షల నుంచి రూ.24.17 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్య ఉన్నాయి. డిజైన్, ఫీచర్లలో అప్‌గ్రేడ్‌లు ఉన్నందున, 2026 మహీంద్రా స్కార్పియో ఎన్ ఫేస్‌లిఫ్ట్ ధరలో కొద్దిపాటి పెరుగుదల ఉండే అవకాశం ఉంది.