Skoda Kushaq Facelift : క్రెటా, సెల్టోస్‌కు పెరగనున్న టెన్షన్.. మరింత ఆకర్షణీయంగా రాబోతున్న స్కోడా కుషాక్

మరింత ఆకర్షణీయంగా రాబోతున్న స్కోడా కుషాక్

Update: 2025-12-08 06:16 GMT

Skoda Kushaq Facelift : స్కోడా కుషాక్ భారతదేశంలో 2021లో మొదటిసారిగా లాంచ్ అయింది. ఇది వోక్స్‌వ్యాగన్ MQB ప్లాట్‌ఫామ్‌పై నిర్మించిన మొదటి మోడల్, దీనిని ప్రత్యేకంగా భారతీయ మార్కెట్ కోసం ఇండియా 2.0 ప్రోగ్రామ్ కింద తీసుకువచ్చారు. లాంచ్ అయినప్పటి నుంచి ఈ కారు మంచి ప్రజాదరణ పొందింది. మిడ్-సైజ్ ఎస్‌యూవీ విభాగంలో స్కోడా తన స్థానాన్ని పటిష్టం చేసుకోవడానికి సహాయపడింది. అయితే మార్కెట్లో పోటీ పెరుగుతున్న నేపథ్యంలో, స్కోడా ఇప్పుడు కుషాక్‌కు సుమారు 2026 ప్రారంభంలో ఒక మిడ్‌లైఫ్ అప్‌డేట్ ఇవ్వడానికి సిద్ధమవుతోంది. జనవరి 2026 నాటికి ఈ కొత్త మోడల్ రోడ్లపైకి వచ్చే అవకాశం ఉంది.

కొత్త 2026 స్కోడా కుషాక్ ఫేస్‌లిఫ్ట్ టెస్టింగ్ సమయంలో కనిపించిన ఫోటోల ప్రకారం, దీని డిజైన్‌లో కొన్ని ముఖ్యమైన మార్పులు ఉండబోతున్నాయి. కొద్దిగా మార్పులు చేసిన ఫ్రంట్ గ్రిల్, సన్నని నిలువు స్లాట్‌లు, కొత్తగా డిజైన్ చేసిన హెడ్‌ల్యాంప్‌లు, కొత్త కోడియాక్-ప్రేరేపిత కనెక్టెడ్ డీఆర్‌ఎల్‌లు ఉంటాయి. అలాగే, పెద్ద ఫాగ్ ల్యాంప్స్ కూడా అమర్చారు.

కొత్త మ్యాట్-బ్లాక్ అల్లాయ్ వీల్స్‌తో పాటు, పక్క భాగంలో పెద్దగా మార్పులు ఉండకపోవచ్చు. వెనుక వైపున కూడా కొన్ని మార్పులు చేశారు. LED బార్‌తో అనుసంధానించబడిన సన్నని టెయిల్ ల్యాంప్‌లు, కొద్దిగా మార్పు చేసిన బంపర్‌ను ఇందులో చూడొచ్చు. కుషాక్ ఫేస్‌లిఫ్ట్‌లో ఇంటీరియర్‌ను రెండు ముఖ్యమైన ఫీచర్లతో అప్‌గ్రేడ్ చేయబోతున్నారు. ఈ ఫీచర్లు కారుకు సరికొత్త అనుభూతిని ఇస్తాయి.

పనోరమిక్ సన్‌రూఫ్, లెవల్-2 ADAS (అటానమస్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్) వంటి అప్‌గ్రేడ్‌లు రాబోతున్నాయి. ADAS రావడం వలన సేఫ్టీ మరింత పెరుగుతుంది. కొత్త ట్రిమ్స్, కొత్త అప్‌హోల్‌స్ట్రీతో పాటు, 360 డిగ్రీ కెమెరా కూడా ఈ ఎస్‌యూవీలో లభించే అవకాశం ఉంది. కొత్త 2026 స్కోడా కుషాక్ మోడల్‌లో ఇంజిన్ ఆప్షన్స్‌లో పెద్దగా మార్పు లేదు.

ప్రస్తుతం ఉన్న 1.0 లీటర్ టర్బో పెట్రోల్, 1.5 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్‌లు కొనసాగుతాయి. ఇది 115 bhp పవర్, 178 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 6-స్పీడ్ మాన్యువల్ లేదా 6-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో జత చేయబడుతుంది. ఈ ఇంజిన్ 150 bhp పవర్, 250 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 7-స్పీడ్ డ్యూయల్-క్లచ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో వస్తుంది. 1.0 లీటర్ TSI పెట్రోల్ ఇంజిన్‌తో ప్రస్తుతం ఉన్న 6-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌ను కొత్త 8-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో స్కోడా ఇండియా భర్తీ చేసే అవకాశం ఉంది. అయితే ఈ మెకానికల్ అప్‌గ్రేడ్ కొంచెం ఆలస్యంగా రావచ్చు.

Tags:    

Similar News