Tata Punch EV : కేవలం 26 నిమిషాల్లో ఛార్జింగ్..కొత్త పంచ్ ఈవీ టాప్ మోడల్ ఈఎంఐ ఎంతో తెలుసా ?

కొత్త పంచ్ ఈవీ టాప్ మోడల్ ఈఎంఐ ఎంతో తెలుసా ?

Update: 2026-02-24 07:27 GMT

Tata Punch EV : భారతదేశ ఎలక్ట్రిక్ కార్ల మార్కెట్లో తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తున్న టాటా మోటార్స్, తన పాపులర్ ఎలక్ట్రిక్ మైక్రో ఎస్‌యూవీని సరికొత్త హంగులతో రంగంలోకి దించింది. అదే 2026 టాటా పంచ్ ఈవీ ఫేస్‌లిఫ్ట్. ఇది కేవలం బయటి రూపం మారిన కారు మాత్రమే కాదు, లోపల ఇంజన్ (పవర్‌ట్రెయిన్) సామర్థ్యాన్ని కూడా భారీగా పెంచేసింది. ప్రస్తుతం ఎలక్ట్రిక్ కార్ల వైపు మొగ్గు చూపుతున్న మధ్యతరగతి ప్రజలకు ఇది ఒక వరంలా మారింది. స్మార్ట్, అడ్వెంచర్, ఎంపవర్డ్ వంటి 5 వేరియంట్లలో లభించే ఈ కారు ధర రూ.9.69 లక్షల నుంచి రూ.12.59 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్యలో ఉంది.

ఈ కారులో ప్రవేశపెట్టిన బ్యాటరీ సబ్‌స్క్రిప్షన్ ప్లాన్ ఒక సంచలనమనే చెప్పాలి. ఈ ప్లాన్ కింద కారును కేవలం రూ.6.49 లక్షలకే ఇంటికి తీసుకెళ్లవచ్చు. కాకపోతే బ్యాటరీ వినియోగానికి కిలోమీటరుకు రూ.2.60 చొప్పున అద్దె చెల్లించాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు ఈ కారులో అన్ని ఫీచర్లు ఉన్న టాప్ మోడల్ Empowered+ S కొనాలని అనుకుంటే, మీరు నెలవారీ ఈఎంఐ ఎంత కట్టాలో ఇక్కడ వివరంగా చూడండి. ఎక్స్-షోరూమ్ ధర రూ.12.59 లక్షల మీద 8.5% వడ్డీతో 5 ఏళ్ల కాలానికి నెలకు సుమారు రూ.25,830 ఈఎంఐ పడుతుంది. అదే 9.5% వడ్డీ అయితే రూ.26,441 వరకు ఉంటుంది. 3 ఏళ్ల లోన్ అయితే నెలకు దాదాపు రూ.40 వేల వరకు కట్టాల్సి రావచ్చు.

సాంకేతికపరంగా ఈ కొత్త పంచ్ ఈవీ మునుపటి కంటే చాలా వేగవంతమైనది. ఇందులో కొత్తగా 40 kWh బ్యాటరీ ప్యాక్ ఆప్షన్‌ను ఇచ్చారు. ఇది ఒక్కసారి ఛార్జ్ చేస్తే ఏకంగా 468 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుందని కంపెనీ చెబుతోంది. చిన్న బ్యాటరీ (30 kWh) అయితే 365 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుంది. పవర్‌ఫుల్ బ్యాటరీ ఉన్న మోడల్ 129 hp శక్తిని ఉత్పత్తి చేస్తుంది, దీనివల్ల కారు కేవలం 9 సెకన్లలోనే 0 నుంచి 100 కి.మీ వేగాన్ని అందుకోగలదు. ఇక ఛార్జింగ్ టెన్షన్ కూడా అక్కర్లేదు, ఫాస్ట్ ఛార్జర్ వాడితే కేవలం 26 నిమిషాల్లోనే 20% నుండి 80% వరకు ఛార్జింగ్ అయిపోతుంది.

డిజైన్ విషయానికి వస్తే టాటా సఫారి, హారియర్ ఫేస్‌లిఫ్ట్ ప్రేరణతో దీని ముందు భాగాన్ని తీర్చిదిద్దారు. ఎల్ఈడీ లైట్ బార్, రీడిజైన్ చేసిన బంపర్ కారుకు ఒక ప్రీమియం లుక్‌ని ఇచ్చాయి. లోపల 10.25 ఇంచుల టచ్ స్క్రీన్, డిజిటల్ క్లస్టర్, వెంటిలేటెడ్ సీట్లు, సన్ రూఫ్ వంటి లగ్జరీ ఫీచర్లు కస్టమర్లను ఆకట్టుకుంటున్నాయి. మొత్తానికి తక్కువ బడ్జెట్‌లో అదిరిపోయే రేంజ్, స్పీడ్, ఫీచర్లు కోరుకునే వారికి ఈ 2026 టాటా పంచ్ ఈవీ ఒక పర్ఫెక్ట్ ఛాయిస్.

Tags:    

Similar News