Trending News

New Car Launches : టాటా సియెర్రా నుంచి మారుతీ ఈ-విటారా వరకు..భారత రోడ్లపైకి రానున్న 30కి పైగా సరికొత్త కార్లు

భారత రోడ్లపైకి రానున్న 30కి పైగా సరికొత్త కార్లు

Update: 2026-01-27 13:02 GMT

New Car Launches : భారతదేశంలో 2026 సంవత్సరం ఆటోమొబైల్ రంగానికి ఒక స్వర్ణయుగం కానుంది. రిపోర్టుల ప్రకారం.. ఈ ఏడాది దాదాపు 30కి పైగా కొత్త ప్యాసింజర్ వాహనాలు మార్కెట్లోకి అడుగుపెట్టనున్నాయి. గతంలో ఏటా సగటున 10 నుంచి 11 కొత్త మోడళ్లు మాత్రమే వచ్చేవి, కానీ ఇప్పుడు ఆ వేగం మూడింతలు పెరిగింది. సెప్టెంబర్ 2025లో జీఎస్‌టీ తగ్గింపు ప్రకటన తర్వాత కార్ల అమ్మకాల్లో విపరీతమైన వృద్ధి కనిపించింది. ఇప్పుడు ఆ ఉత్సాహాన్ని కొనసాగిస్తూ కంపెనీలు తమ బెస్ట్ ప్రొడక్టులను రంగంలోకి దించుతున్నాయి.

దేశీయ దిగ్గజం టాటా మోటార్స్ ఈ ఏడాది తన ఐకానిక్ బ్రాండ్ టాటా సియెర్రా EVని ఫిబ్రవరిలో తీసుకురానుంది. దీంతో పాటు పంచ్ ఫేస్‌లిఫ్ట్, లగ్జరీ విభాగంలో అవిన్యా సిరీస్‌ను కూడా లాంచ్ చేయాలని ప్లాన్ చేస్తోంది. మరోవైపు, మారుతీ సుజుకి తన మొదటి ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ ఈ-విటారాని జనవరి నెలాఖరులోనే విడుదల చేస్తోంది. అలాగే వ్యాగన్-ఆర్ ఎలక్ట్రిక్, బ్రెజ్జా ఫేస్‌లిఫ్ట్ వంటి మోడళ్లు కూడా క్యూలో ఉన్నాయి.

ఎస్‌యూవీ క్రేజ్ ఏమాత్రం తగ్గడం లేదు, 2026లో లాంచ్ కానున్న కార్లలో 60% కంటే ఎక్కువ ఎస్‌యూవీలే ఉన్నాయి. రెనాల్ట్ డస్టర్ తన పాత వైభవాన్ని తిరిగి పొందడానికి జనవరి 26న మళ్ళీ ఎంట్రీ ఇచ్చింది. హ్యుందాయ్ తన భారీ ఎస్‌యూవీ పాలిసేడ్, క్రెటా హైబ్రిడ్ వెర్షన్లను తీసుకురావడానికి సిద్ధంగా ఉంది. కియా మోటార్స్ తన గ్లోబల్ మోడల్ సోరెంటోని భారత మార్కెట్లోకి దించనుంది. వియత్నాం కంపెనీ విన్‌ఫాస్ట్ కూడా తన మూడు ఎలక్ట్రిక్ మోడళ్లతో భారత్‌లో తన అదృష్టాన్ని పరీక్షించుకోనుంది.

బడ్జెట్ మరియు మధ్యతరగతి కార్లు: లగ్జరీ కార్లే కాదు, సామాన్యుల కోసం కూడా అనేక ఆప్షన్లు వస్తున్నాయి. మారుతీ బాలెనో 2026 వెర్షన్, నిస్సాన్ నుంచి కొత్త ఎంయూవీ, స్కోడా నుంచి కుషాక్ ఫేస్‌లిఫ్ట్ వంటి కార్లు రూ.10 లక్షల నుంచి రూ.15 లక్షల బడ్జెట్‌లో అందుబాటులోకి రానున్నాయి. మొత్తంమీద.. 2026లో కారు కొనాలనుకునే వారికి ఏమాత్రం కన్ఫ్యూజన్ లేకుండా, అన్ని ధరల శ్రేణుల్లో విభిన్నమైన మోడళ్లు అందుబాటులో ఉండబోతున్నాయి. డిజైన్, టెక్నాలజీ, పర్ఫార్మెన్స్‌లో ఈ కార్లు సరికొత్త ప్రమాణాలను నెలకొల్పడం ఖాయం.

Tags:    

Similar News