BSA Scrambler 650 vs RE Bear 650 : BSA స్క్రాంబ్లర్ 650 vs రాయల్ ఎన్‌ఫీల్డ్ బేర్ 650.. రోడ్డుపై అసలైన మొనగాడు ఎవరు?
రోడ్డుపై అసలైన మొనగాడు ఎవరు?
BSA Scrambler 650 vs RE Bear 650 :భారతీయ రోడ్లపై పవర్‌ఫుల్ బైక్‌ల మధ్య పోరు మొదలైంది. క్లాసిక్ లెజెండ్స్ తాజాగా మార్కెట్లోకి వదిలిన BSA స్క్రాంబ్లర్ 650 ఇప్పుడు రాయల్ ఎన్‌ఫీల్డ్ గజరాజు బేర్ 650కు గట్టి సవాలు విసురుతోంది. 650 సీసీ విభాగంలో కింగ్ అనిపించుకోవడానికి ఈ రెండు బైక్‌లు నువ్వా-నేనా అన్నట్లు తలపడుతున్నాయి.
ధరల మధ్య వ్యత్యాసం
బడ్జెట్ విషయానికి వస్తే BSA స్క్రాంబ్లర్ 650 కాస్త ఊరటనిస్తుంది. దీని ప్రారంభ ధర రూ.3,24,950 నుంచి ప్రారంభమై టాప్ మోడల్ రూ.3,40,950 (ఎక్స్-షోరూమ్) వరకు ఉంటుంది. ఇక రాయల్ ఎన్‌ఫీల్డ్ బేర్ 650 విషయానికి వస్తే, దీని ధర కొంచెం ఎక్కువగా ఉంది. ఇది రూ.3,75,393 నుంచి రూ.3,97,538 మధ్యలో లభిస్తుంది. దాదాపు 50 వేల రూపాయల తేడా ఉండటం BSA కు పెద్ద ప్లస్ పాయింట్.
ఇంజిన్, పవర్
BSA స్క్రాంబ్లర్ 650 లో 652 సీసీ లీక్విడ్-కూల్డ్, సింగిల్ సిలిండర్ ఇంజిన్ ఉంది. ఇది 44.5 bhp పవర్, 5 Nm టార్క్‌ను ఇస్తుంది. దీనికి 5-స్పీడ్ గేర్‌బాక్స్ ఉంది. మరోవైపు, రాయల్ ఎన్‌ఫీల్డ్ బేర్ 650 లో 648 సీసీ ఇన్‌లైన్ ట్విన్-సిలిండర్ ఇంజిన్ ఉంది. ఇది 46.75 bhp పవర్ మరియు 56.5 Nm టార్క్‌ను అందిస్తుంది. దీనికి 6-స్పీడ్ ట్రాన్స్‌మిషన్ ఉంది.
గమనిక: పేపర్ మీద చూస్తే రాయల్ ఎన్‌ఫీల్డ్ పవర్, టార్క్ విషయంలో BSA కంటే కాస్త ముందుంది. అలాగే 6-స్పీడ్ గేర్‌బాక్స్ హైవే డ్రైవింగ్‌లో రాయల్ ఎన్ ఫీల్డ్ అడ్వాంటేజ్ ఇస్తుంది.
ఫీచర్లు, డిజైన్:
BSA స్క్రాంబ్లర్ 650 పక్కా రెట్రో లుక్ తో వస్తుంది. ఇందులో ఆఫ్‌సెట్ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, ముందు 320 మిమీ, వెనుక 255 మిమీ డిస్క్ బ్రేక్స్‌తో పాటు డ్యూయల్ ఛానల్ ఏబీఎస్ (ABS) ఉన్నాయి. ఆఫ్‌రోడింగ్ కోసం సస్పెన్షన్ ట్రావెల్‌ను పెంచారు.
రాయల్ ఎన్‌ఫీల్డ్ బేర్ 650 లో మోడ్రన్ టెక్నాలజీ ఉంది. దీనిలో ట్రిప్పర్ డ్యాష్ (గూగుల్ మ్యాప్స్ సపోర్ట్‌తో), రౌండ్ ఎల్‌ఈడీ హెడ్‌లైట్, అప్‌సైడ్ డౌన్ (USD) ఫోర్కులు ఉన్నాయి. డిజైన్ పరంగా RE బేర్ చూడటానికి చాలా అగ్రెసివ్‌గా, ఎత్తుగా కనిపిస్తుంది.
ఏది కొనాలి?
మీరు తక్కువ ధరలో మంచి లుక్ ఉన్న 650 సీసీ బైక్ కావాలనుకుంటే BSA స్క్రాంబ్లర్ 650 బెస్ట్ ఛాయిస్. కానీ, మీకు ఎక్కువ పవర్, ట్విన్ సిలిండర్ సౌండ్, అడ్వాన్సుడ్ టెక్నాలజీ, 6-స్పీడ్ గేర్‌బాక్స్ కావాలంటే మాత్రం రాయల్ ఎన్‌ఫీల్డ్ బేర్ 650 వైపు మొగ్గు చూపవచ్చు. ఆఫ్-రోడింగ్‌లో రెండు బైక్‌లు కూడా మంచి సామర్థ్యాన్ని కలిగి ఉన్నప్పటికీ, రాయల్ ఎన్ ఫీల్డ్కి ఉన్న నెట్‌వర్క్, బ్రాండ్ ఇమేజ్ కూడా కస్టమర్ల నిర్ణయంపై ప్రభావం చూపుతుంది.