Car Discounts : కారు కొనేవారికి పండుగే.. మారుతి నుంచి ఎంజీ వరకు రూ.6లక్షల వరకు ఆదా
మారుతి నుంచి ఎంజీ వరకు రూ.6లక్షల వరకు ఆదా;
Car Discounts : గణేష్ చతుర్థితో పండుగల సీజన్ స్టార్ట్ అయింది. భారతదేశంలోని వాహన తయారీదారులు వారి సేల్స్ పెంచడానికి ఆకర్షణీయమైన డిస్కౌంట్లను అందిస్తున్నారు. మారుతి సుజుకి, హ్యుందాయ్, హోండా, టాటా, ఎంజి మోటార్స్ వంటి బ్రాండ్‌లు తమ ప్రముఖ మోడళ్లపై ప్రత్యేక ఆఫర్లను ప్రకటించాయి. ఇందులో సెలెక్టెడ్ వెహికల్స్ మీద రూ.6 లక్షల వరకు ఆదా చేసుకోవచ్చు.
రూ.6 లక్షల వరకు డిస్కౌంట్
ఎంజి మోటార్స్ కామెట్ ఈవీ, జెడ్ఎస్ ఈవీ, ఆస్టర్, హెక్టర్, గ్లోస్టర్ వంటి అనేక మోడళ్లపై డిస్కౌంట్‌లను అందిస్తోంది. కామెట్ ఈవీపై దాదాపు రూ.56,000 ఆదా చేయవచ్చు. జెడ్ఎస్ ఈవీ, ఆస్టర్‌పై రూ.1.10 లక్షల వరకు డిస్కౌంట్ లభిస్తుంది. హెక్టర్ కొనుగోలుదారులకు రూ.1.15 లక్షల క్యాష్ బోనస్ లభిస్తుంది. ప్రీమియం ఎస్‌యూవీ అయిన గ్లోస్టర్‌పై అత్యధికంగా రూ.6 లక్షల వరకు డిస్కౌంట్ లభిస్తుంది.
హోండా కార్లపై రూ.1.22 లక్షల వరకు డిస్కౌంట్
హోండా కార్స్ ఇండియా ది గ్రేట్ హోండా ఫెస్ట్ పేరుతో ఒక పండుగ క్యాంపెయిన్‌ను ప్రారంభించింది. ఇందులో సిటీ, అమేజ్, ఎలివేట్ వంటి మోడళ్లపై డిస్కౌంట్లు ఇస్తున్నారు. సిటీ పెట్రోల్ మోడల్‌పై రూ.1.07 లక్షల వరకు, హైబ్రిడ్ సిటీ ఈహెచ్ఈవీపై రూ.96,000 వరకు డిస్కౌంట్ లభిస్తుంది. ఎలివేట్ జెడ్‌ఎక్స్ టాప్ వేరియంట్‌పై రూ.1.22 లక్షల డిస్కౌంట్, సెకండ్ జనరేషన్ అమేజ్‌పై రూ.77,200 డిస్కౌంట్ లభిస్తుంది.
మారుతి సుజుకి ఆఫర్లు
మారుతి సుజుకి కూడా పండుగ సందర్భంగా ప్రత్యేక ఆఫర్లను ప్రవేశపెట్టింది. జిమ్నీ ఆల్ఫా వేరియంట్‌పై రూ.లక్ష డిస్కౌంట్ లభిస్తుంది. స్విఫ్ట్ ఏఎమ్‌టీ, వ్యాగన్‌ఆర్ ఎల్‌ఎక్స్‌ఐపై రూ.1.1 లక్షలు, రూ.1.15 లక్షల వరకు ఆదా చేసుకోవచ్చు. ఎంపీవీ అయిన ఇన్విక్టోపై రూ.1.25 లక్షల డిస్కౌంట్ మరియు ఎస్‌యూవీ గ్రాండ్ విటారాపై రూ.2 లక్షల వరకు ప్రయోజనాలు లభిస్తున్నాయి.
హ్యుందాయ్ కార్లపై డిస్కౌంట్లు
హ్యుందాయ్ తన అన్ని కార్లపై అద్భుతమైన డీల్స్‌ను అందిస్తోంది. ఇందులో గ్రాండ్ ఐ10 నియోస్, ఎక్సెంట్, టక్సన్, అల్కజార్, క్రెటా, వెర్నా మరియు ఐయోనిక్ 2024 మోడళ్లు ఉన్నాయి. గ్రాండ్ ఐ10 నియోస్ మరియు ఎక్సెంట్‌పై రూ.30,000 ఎక్స్ఛేంజ్ బోనస్, అదనంగా రూ.25,000 డిస్కౌంట్ లభిస్తుంది. ఐయోనిక్ 2024 మోడల్‌పై రూ.4 లక్షల క్యాష్ డిస్కౌంట్ లభిస్తుంది.