Hyundai : హ్యుందాయ్ జోరు.. మారుతి, టాటా బేజారు.. ఈ కార్లు వస్తే పోటీ మామూలుగా ఉండదు

ఈ కార్లు వస్తే పోటీ మామూలుగా ఉండదు

Update: 2026-02-20 12:09 GMT

Hyundai : ప్రస్తుతం భారత ఆటోమొబైల్ మార్కెట్లో మారుతి సుజుకి, టాటా మోటార్స్ మధ్య తీవ్ర పోటీ నెలకొంది. ఈ పోటీని మరింత రంజుగా మారుస్తూ, దక్షిణ కొరియా దిగ్గజం హ్యుందాయ్ 2026లో మూడు సరికొత్త వాహనాలను భారత మార్కెట్లోకి విడుదల చేసేందుకు సిద్ధమైంది. ఇందులో ఎక్స్‌టర్, వెర్నా వంటి పాపులర్ మోడళ్ల ఫేస్‌లిఫ్ట్ వెర్షన్లతో పాటు, మారుతి ఫ్రాంక్స్‌కు గట్టి పోటీ ఇచ్చేలా ఒక సరికొత్త కాంపాక్ట్ క్రాస్ఓవర్‌ను కూడా తీసుకువస్తోంది.

1. హ్యుందాయ్ ఎక్స్‌టర్ 2026 ఫేస్‌లిఫ్ట్

టాటా పంచ్‌కు గట్టి పోటీగా నిలిచిన ఎక్స్‌టర్, ఇప్పుడు సరికొత్త హంగులతో మన ముందుకు రానుంది. ముందు భాగంలో కొత్త డిజైన్ గ్రిల్, రీడిజైన్ చేసిన బంపర్, హెచ్-షేప్ ఎల్ఈడీ డీఆర్ఎల్స్ వస్తున్నాయి. ఇది కారుకు మరింత అగ్రెసివ్ లుక్‌ను ఇస్తుంది. లోపల 12.9 అంగుళాల పెద్ద టచ్‌స్క్రీన్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, లెవల్-1 ADAS వంటి ప్రీమియం ఫీచర్లు రాబోతున్నాయి. ఇందులో 1.2 లీటర్ పెట్రోల్ ఇంజిన్ (82 bhp) కొనసాగుతుంది. పెట్రోల్, సిఎన్‌జి ఆప్షన్లలో ఇది లభిస్తుంది. దీని ప్రారంభ ధర సుమారు రూ.6.20 లక్షల నుంచి ఉండవచ్చు.

2. హ్యుందాయ్ వెర్నా 2026 ఫేస్‌లిఫ్ట్

సెడాన్ కార్ల విభాగంలో తన ఆధిపత్యాన్ని నిరూపించుకున్న వెర్నా, ఇప్పుడు మరింత టెక్నాలజీతో అప్‌డేట్ అవుతోంది. కొత్త వెన్యూ తరహాలోనే ఇందులో డ్యూయల్ స్క్రీన్ సెటప్ (ఇన్ఫోటైన్‌మెంట్, ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ కలిపి) ఉండబోతోంది. కొత్త స్టీరింగ్ వీల్,ప్రీమియం డ్యూయల్ టోన్ క్యాబిన్ దీనికి ప్రత్యేక ఆకర్షణ. 1.5 లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ (115 bhp), 1.5 లీటర్ టర్బో పెట్రోల్ (160 bhp) ఇంజిన్ ఆప్షన్లు ఉంటాయి. ఇది 2026 మార్చి లేదా ఏప్రిల్ నాటికి విడుదలయ్యే అవకాశం ఉంది. ధర సుమారు రూ.11 లక్షల నుంచి ప్రారంభం కావచ్చు.

3. సరికొత్త కాంపాక్ట్ క్రాస్ఓవర్

హ్యుందాయ్ నుంచి రాబోతున్న అత్యంత ఆసక్తికరమైన కారు ఇది. గ్లోబల్ మార్కెట్లో ఉన్న బేయాన్ మోడల్ ఆధారంగా దీనిని తయారు చేస్తున్నారు. ఈ కారు నేరుగా మారుతి సుజుకి ఫ్రాంక్స్,టయోటా టైజర్లకు పోటీగా రానుంది. ఇది ఎక్స్‌టర్, వెన్యూ కార్ల మధ్య స్థానాన్ని భర్తీ చేస్తుంది. ఇందులో సరికొత్త 1.2 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ పరిచయం కానుంది. ఇది భవిష్యత్తులో హైబ్రిడ్ టెక్నాలజీకి కూడా అనుకూలంగా ఉంటుంది. దీనిని 2026 అక్టోబర్ నాటికి మార్కెట్లోకి తెచ్చే అవకాశం ఉంది. ధర రూ.7 లక్షల నుంచి రూ.15 లక్షల మధ్య ఉండవచ్చని అంచనా.

Tags:    

Similar News