Festive Offers: సెడాన్ లవర్లకు దివాళీ బంపర్ ఆఫర్.. 5 పాపులర్ కార్లపై ఏకంగా రూ.1.25 లక్షల తగ్గింపు
ఏకంగా రూ.1.25 లక్షల తగ్గింపు
Festive Offers: పండుగ వేళ కొత్త కారు కొనుగోలు చేయాలనుకునే సెడాన్ లవర్లకు ఇదే సరైన సమయం. దీపావళి సీజన్ ముగుస్తున్న తరుణంలో కార్ల తయారీ సంస్థలు తమ సేల్స్ పెంచుకోవడానికి భారీ డిస్కౌంట్ ఆఫర్లను ప్రటించాయి. మార్కెట్లో అత్యంత ప్రాచుర్యం పొందిన 5 ప్రముఖ సెడాన్ మోడళ్లపై కంపెనీలు ఏకంగా రూ.1.25 లక్షల వరకు లబ్ధి చేకూరుస్తున్నాయి. హోండా సిటీ, హోండా అమేజ్, హ్యుందాయ్ వెర్నా, హ్యుందాయ్ ఆరా, ఫోక్స్‌వ్యాగన్ వర్టస్ వంటి పాపులర్ కార్లపై లభిస్తున్న ఆఫర్ల వివరాలు కింద చూడవచ్చు.
1. హోండా సిటీ
హోండా సిటీ పెట్రోల్ వేరియంట్‌పై అత్యధికంగా రూ.1.25 లక్షల వరకు బెనిఫిట్స్ లభిస్తున్నాయి. మన దేశంలోని మాస్ మార్కెట్ సెడాన్లలో ఇదే అతిపెద్ద ఆఫర్ అని చెప్పవచ్చు. ఇందులో రూ.60,000 వరకు క్యాష్ డిస్కౌంట్, రూ.50,000 వరకు ఎక్స్ఛేంజ్ బోనస్ ఉన్నాయి. వీటితో పాటు పాత హోండా కస్టమర్లకు రూ.6,000 అదనపు ఎక్స్ఛేంజ్ ఆఫర్, రూ.4,000 లాయల్టీ బోనస్, రూ.5,000 కార్పొరేట్ బెనిఫిట్ ఇస్తున్నారు. అన్ని వేరియంట్లతో పాటు రూ.19,000 విలువైన డాష్‌క్యామ్ ఉచితంగా ఇస్తూ, ఎక్స్టెండెడ్ వారంటీపై రూ.16,900 తగ్గింపు అందిస్తున్నారు. ప్రస్తుతం హోండా సిటీ ఎక్స్ షోరూమ్ ధర రూ.12.08 లక్షల నుంచి రూ.17.44 లక్షల మధ్య ఉంది.
2. హ్యుందాయ్ వెర్నా
ప్రీమియమ్ లుక్‌తో ఉండే హ్యుందాయ్ వెర్నా కారుపై కంపెనీ రూ.80,000 వరకు డిస్కౌంట్ ఇస్తోంది. దీనిలో రూ.40,000 వరకు క్యాష్ డిస్కౌంట్, రూ.10,000 కార్పొరేట్ బోనస్, రూ.25,000 స్క్రాపేజ్ బోనస్ లేదా రూ.20,000 వరకు ఎక్స్ఛేంజ్ బోనస్ లభిస్తాయి. ఆల్టో K10, స్విఫ్ట్, డిజైన్, బాలెనో, ఐ20, టియాగో వంటి కార్లను ఎక్స్ఛేంజ్ చేస్తే ఈ బోనస్ ఏకంగా రూ.30,000 వరకు పెరుగుతుంది. వెర్నా అన్ని వేరియంట్లకూ ఈ ఆఫర్లు వర్తిస్తాయి. ప్రస్తుతం ఈ కారు ఎక్స్ షోరూమ్ ధర రూ.10.99 లక్షల నుంచి రూ.18.31 లక్షల వరకు ఉంది.
3. ఫోక్స్‌వ్యాగన్ వర్టస్
డ్రైవింగ్ అనుభూతికి పేరుగాంచిన ఫోక్స్‌వ్యాగన్ వర్టస్ మోడల్‌పై కంపెనీ మొత్తం రూ.80,000 వరకు బెనిఫిట్స్ ఇస్తోంది. ఇందులో రూ.50,000 వరకు క్యాష్ డిస్కౌంట్, రూ.30,000 వరకు ఎక్స్ఛేంజ్ బోనస్ లభిస్తాయి. సెగ్మెంట్లోనే అత్యంత సేఫెస్ట్, పవర్ఫుల్ సెడాన్లలో ఒకటిగా నిలిచిన ఫోక్స్‌వ్యాగన్ వర్టస్ ఎక్స్ షోరూమ్ ధర రూ.10.71 లక్షల నుంచి రూ.19.20 లక్షల మధ్య అందుబాటులో ఉంది.
4. హోండా అమేజ్
కాంప్యాక్ట్ సెడాన్ విభాగానికి చెందిన హోండా అమేజ్ కొనుగోలుపై రూ.43,000 వరకు ప్రయోజనాలు అందుతున్నాయి. ఇందులో రూ.15,000 వరకు క్యాష్ డిస్కౌంట్, రూ.21,000 ఎక్స్ఛేంజ్ బోనస్, రూ.4,000 లాయల్టీ బెనిఫిట్స్, రూ.3,000 కార్పొరేట్ బోనస్ ఉన్నాయి. సిటీ కారు తరహాలోనే అమేజ్‌పై కూడా రూ.16,900 విలువైన ఎక్స్టెండెడ్ వారంటీ డిస్కౌంట్‌ను కంపెనీ అందిస్తోంది. అమేజ్ ఎక్స్ షోరూమ్ ధరలు రూ.7.65 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు ఉన్నాయి.
5. హ్యుందాయ్ ఆరా
హ్యుందాయ్ ఆరా సీఎన్జీ వేరియంట్‌పై రూ.30,000, పెట్రోల్ వేరియంట్‌పై రూ.15,000 చొప్పున డైరెక్ట్ క్యాష్ డిస్కౌంట్ లభిస్తోంది. దీనికి తోడుగా అన్ని వేరియంట్లపై రూ.5,000 స్క్రాపేజ్ బోనస్, రూ.5,000 రూరల్ ఆఫర్ కూడా పొందే వెసులుబాటు కల్పించారు. మిడిల్ క్లాస్ ఫ్యామిలీలకు బడ్జెట్ ఫ్రెండ్లీగా ఉండే ఈ కారు ప్రారంభ ఎక్స్ షోరూమ్ ధర రూ.5.98 లక్షలుగా ఉంది.