Maruti Suzuki: భారతీయ ఆటోమొబైల్ మార్కెట్లో నంబర్ వన్ సెడాన్‌గా వెలుగొందుతున్న మారుతి సుజుకి డిజైర్ సరికొత్త చారిత్రాత్మక మైలురాయిని అందుకుంది. అక్టోబర్ 2026 నాటికి ఈ పాపులర్ కారు ప్రొడక్షన్ ఏకంగా 35 లక్షల యూనిట్ల మార్కును దాటేసింది. దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న కార్లలో ఒకరిగా నిలిచిన డిజైన్, సరికొత్త ఫీచర్లు, అద్భుతమైన మైలేజ్‌తో కస్టమర్ల మనసులను గెలుచుకుంటూ ముందుకు సాగుతోంది.

18 ఏళ్ల ప్రయాణం.. 35 లక్షల ప్రొడక్షన్ రికార్డు

జనవరి 2008లో మార్కెట్లోకి అడుగుపెట్టిన మారుతి డిజైన్ కేవలం 18 సంవత్సరాల 9 నెలల కాలంలోనే 35 లక్షల యూనిట్ల తయారీని పూర్తి చేసుకుంది. మారుతి నుంచి ఆల్టో, స్విఫ్ట్, వాగన్ఆర్ కార్ల సరసన ఈ రేర్ రికార్డు సాధించిన జాబితాలో డిజైన్ కూడా చేరింది. ముఖ్యంగా గమనించాల్సిన విషయం ఏంటంటే.. చివరి 5 లక్షల యూనిట్ల ప్రొడక్షన్ కేవలం 22 నెలల వ్యవధిలోనే పూర్తయింది. ఇది ఈ కారుపై దేశీయ మార్కెట్లో ఉన్న విపరీతమైన డిమాండ్‌ను స్పష్టంగా తెలియజేస్తోంది.

అమ్మకాల్లో దూసుకుపోతున్న డిజైన్

ఆర్థిక సంవత్సరం 2027 తొలి అర్ధభాగంలో అంటే ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ 2026 మధ్య కాలంలో డిజైన్ ఏకంగా 1,25,988 యూనిట్ల విక్రయాలను నమోదు చేసింది. గతేడాది ఇదే సమయంతో పోలిస్తే అమ్మకాల్లో దాదాపు 16.65 శాతం వృద్ధి నమోదైంది. అగ్రశ్రేణి డిజైన్‌తో కూడిన ఎల్‌ఈడీ హెడ్‌లైట్లు, సి-షేప్ టెయిల్ ల్యాంప్స్ దీనికి మరింత ఆకర్షణ తెచ్చాయి. హోండా అమేజ్, హ్యుందాయ్ ఆరా వంటి కార్లకు ఇది గట్టి పోటీ ఇస్తూ మార్కెట్లో తన ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తోంది.

35 కిమీ మైలేజ్.. అదిరిపోయే ఫీచర్లు

ఈ కారులో ఉన్న 1.2-లీటర్ కొత్త జెడ్-సిరీస్ పెట్రోల్ ఇంజిన్ అద్భుతమైన పనితీరు కనబరుస్తుంది. పెట్రోల్ వెర్షన్‌లో సుమారు 25 నుంచి 26 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుండగా, సీఎన్జీ మోడల్‌లో మాత్రం కిలోకు ఏకంగా 35 కిలోమీటర్ల మైలేజ్ లభిస్తుంది. కేబిన్ విషయానికి వస్తే, ఇందులో ఫస్ట్ టైమ్ ఎలక్ట్రిక్ సన్ రూఫ్, 9 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్, వైర్‌లెస్ ఛార్జింగ్, 360-డిగ్రీ కెమెరా వంటి అత్యాధునిక హంగులు ఉన్నాయి.

సేఫ్టీలో 5-స్టార్ రేటింగ్

కుటుంబ సమేతంగా సురక్షిత ప్రయాణం చేసేందుకు వీలుగా గ్లోబల్ ఎన్‌క్యాప్ క్రాష్ టెస్ట్‌లో ఈ కారు అద్భుతమైన 5-స్టార్ సేఫ్టీ రేటింగ్ సాధించింది. స్టాండర్డ్‌గా 6 ఎయిర్‌బ్యాగ్స్, ఏబీఎస్ విత్ ఈబీడీ, హిల్ హోల్డ్ అసిస్ట్ వంటి సేఫ్టీ ఫీచర్లు ఇందులో ఉన్నాయి. భారత మార్కెట్లో ఈ అద్భుతమైన సెడాన్ ఎక్స్ షోరూం ధర రూ.6.26 లక్షల నుంచి ప్రారంభమై టాప్ మోడల్‌కు రూ.9.54 లక్షల వరకు అందుబాటులో ఉంది.

Tags: