HF Deluxe Pro : హీరో కొత్త 100cc బైక్ లాంచ్.. తక్కువ ధరలో అదిరిపోయే ఫీచర్స్!

తక్కువ ధరలో అదిరిపోయే ఫీచర్స్!;

Update: 2025-07-23 05:46 GMT

HF Deluxe Pro : భారత మార్కెట్లో దిగ్గజ ఆటోమొబైల్ కంపెనీ హీరో మోటోకార్ప్ తన కొత్త మోడల్ హెచ్ఎఫ్ డీలక్స్ ప్రో మోటార్‌సైకిల్‌ను విడుదల చేసింది. ఈ కొత్త బైక్‌లో టెక్నాలజీ, స్టైల్ రెండింటినీ మిళితం చేశామని కంపెనీ ప్రకటించింది. ఈ బైక్‌ను రూ.73,500 (ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధరతో లాంచ్ చేశారు. హీరో HF డీలక్స్ ప్రోలో అడ్వాన్సుడ్ ఫీచర్లు చాలా ఉన్నాయి. ఇందులో i3s టెక్నాలజీ వాడారు. ఇది ఇంధనాన్ని ఆదా చేయడంలో సహాయపడుతుంది. ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద లేదా బండి ఆగినప్పుడు ఇంజిన్‌ను ఆటోమేటిక్‌గా ఆపివేస్తుంది. లో ఫ్రిక్షన్ ఇంజిన్, కొత్త గ్రాఫిక్స్, LED హెడ్‌లైట్, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, లో ఫ్యూయల్ ఇండికేటర్, 18 అంగుళాల వీల్స్, అడ్జస్టబుల్ రియర్ సస్పెన్షన్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

ఈ కొత్త మోటార్‌సైకిల్‌లో 97.2cc సామర్థ్యం గల సింగిల్ సిలిండర్ ఎయిర్-కూల్డ్ ఇంజిన్ ఉంది. ఇది 7.9 bhp పవర్, 8.05 న్యూటన్ మీటర్ల గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ బైక్ లాంచింగ్‌పై హీరో మోటోకార్ప్ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ (CBO) ఆశుతోష్ వర్మ మాట్లాడుతూ.. "హెచ్ఎఫ్ డీలక్స్ భారతదేశంలోని లక్షలాది మంది వినియోగదారులకు నమ్మకమైన భాగస్వామిగా నిలిచింది. ఇది దాని విశ్వసనీయత, ఇంధన సామర్థ్యానికి ప్రసిద్ధి చెందింది. కొత్త HF డీలక్స్ ప్రోతో, మేము ఈ నమ్మకాన్ని మరింత ముందుకు తీసుకెళ్తున్నాము. డిజైన్, అధునాతన ఫీచర్లు, మెరుగైన ఇంధన సామర్థ్యాన్ని అందిస్తున్నాం" అని అన్నారు.

హీరో ఈ బైక్‌ను ఎంట్రీ లెవెల్ బైక్ సెగ్మెంట్‌లో విడుదల చేసింది. ఈ విభాగంలో బజాజ్, టీవీఎస్, హోండా వంటి ఇతర ద్విచక్ర వాహన తయారీదారుల బైక్‌లతో ఇది నేరుగా పోటీపడుతుంది. ముఖ్యంగా 100cc విభాగంలో హెచ్ఎఫ్ డీలక్స్‌కు మంచి డిమాండ్ ఉంది. ఇది హీరో స్ప్లెండర్, హోండా షైన్ వంటి మోడళ్లకు పోటీనిస్తుంది.

Tags:    

Similar News