Honda : కొత్త కారు కొనే వాళ్లకు గుడ్ న్యూస్.. హోండా పాపులర్ మోడల్ పై రూ.లక్ష తగ్గింపు
హోండా పాపులర్ మోడల్ పై రూ.లక్ష తగ్గింపు;
Honda : హోండా కార్స్ ఇండియా ఈ ఆగస్టు నెలలో పండుగ సందడిని ముందే తీసుకొచ్చింది. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా గెట్ ఫెస్ట్ గో పేరుతో తమ కార్లపై భారీ డిస్కౌంట్లను ప్రకటించింది. ఇందులో భాగంగా హోండా సిటీ సెడాన్ కారుపై రూ.లక్షకు పైగా తగ్గింపు అందిస్తోంది. ఈ నెలలో ఈ కారు కొనుగోలు చేసే వారికి రూ.1,07,300 వరకు లాభం చేకూరుతుంది. ఈ ఆఫర్ వివరాలు, కారు ఫీచర్లు, స్పెసిఫికేషన్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
హోండా సిటీ పెట్రోల్, హైబ్రిడ్ ఇంజిన్ ఆప్షన్లతో లభిస్తుంది. ఇందులో 1.5-లీటర్ పెట్రోల్ ఇంజిన్ ఉంది. ఇది 121bhp పవర్, 145Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజిన్ 6-స్పీడ్ మాన్యువల్, 7-స్టెప్ సీవీటీ గేర్‌బాక్స్‌తో జత చేయబడింది. మాన్యువల్ వేరియంట్ లీటర్‌కు 17.8 కి.మీ. మైలేజ్ ఇస్తుంది. సీవీటీ వేరియంట్ అయితే 18.4 కి.మీ. వరకు మైలేజ్ ఇస్తుంది. హైబ్రిడ్ మోడల్ అయితే ఏకంగా 26.5 కి.మీ. వరకు మైలేజ్ ఇస్తుందని కంపెనీ పేర్కొంది.
హోండా సిటీ SV, V, VX, ZX అనే వేరియంట్లలో అందుబాటులో ఉంది. దీని ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ.12.38 లక్షలు. హైబ్రిడ్ మోడల్ ప్రారంభ ధర రూ.19.90 లక్షలు. హోండా సిటీ కేవలం మైలేజ్, పర్ఫార్మెన్స్ లోనే కాదు, సేఫ్టీ విషయంలోనూ ముందంజలో ఉంది. ఇందులో 6 ఎయిర్‌బ్యాగ్‌లు, టైర్ ప్రెషర్ మానిటరింగ్ సిస్టమ్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, రియర్‌వ్యూ కెమెరా, ఏబీఎస్ విత్ ఈబీడీ వంటి అడ్వాన్సుడ్ సేఫ్టీ ఫీచర్లు ఉన్నాయి.
హోండా ADAS (అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్) సేఫ్టీ ఫీచర్లను కూడా అందిస్తోంది. వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ప్లేతో కూడిన 8-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, లెదర్ అప్‌హోల్‌స్టరీ, రెయిన్-సెన్సింగ్ వైపర్లు, వైర్‌లెస్ ఫోన్ ఛార్జర్, క్రూయిజ్ కంట్రోల్, సన్‌రూఫ్, యాంబియంట్ లైటింగ్ వంటి లగ్జరీ ఫీచర్లు కూడా ఇందులో ఉన్నాయి. భారత మార్కెట్లో హోండా సిటీ, స్కోడా స్లావియా, హ్యుందాయ్ వెర్నా, వోక్స్‌వ్యాగన్ వెర్టస్ వంటి మోడళ్లతో పోటీ పడుతుంది.