Upcoming SUVs: అక్టోబర్‌లో ఎస్‌యూవీల ధమాకా.. మార్కెట్‌లోకి రాబోతున్న 4 కొత్త దిగ్గజ కార్లు
4 కొత్త దిగ్గజ కార్లు
Upcoming SUVs: భారత ఆటోమొబైల్ రంగానికి ఈ అక్టోబర్ నెల ఎంతో కీలకంగా మారనుంది. పండుగల సీజన్ ప్రారంభం కావడంతో ప్రముఖ కార్ల తయారీ సంస్థలు తమ కొత్త ఎస్‌యూవీలను, అప్‌డేటెడ్ మోడళ్లను మార్కెట్‌లోకి దింపడానికి వేగంగా అడుగులు వేస్తున్నాయి. మీరు కొత్త ఎస్‌యూవీ కొనుగోలు చేయడానికి ప్లాన్ చేస్తుంటే ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన నాలుగు సరికొత్త కార్ల వివరాలు, వాటి ఫీచర్లు ఇప్పుడు చూద్దాం.
హోండా ఎలివేట్ ఫేస్‌లిఫ్ట్
హోండా కంపెనీ నుంచి ఎలివేట్ ఫేస్‌లిఫ్ట్ మోడల్ అక్టోబర్ 6, 2026న విడుదల కానుంది. దీనికోసం రూ. 21,000 చెల్లించి అడ్వాన్స్ బుకింగ్ చేసుకునే సదుపాయం కల్పించారు. కొత్త డిజైన్ గ్రిల్, హారిజాంటల్ ఎల్ఈడీ డిఆర్‌ఎల్‌లతో పాటు వెనుక భాగంలో కనెక్టెడ్ ఎల్ఈడీ లైట్ బార్ అమర్చారు. కేబిన్ లోపల 360-డిగ్రీ కెమెరా, వెంటిలేటెడ్ సీట్లు, పనోరమిక్ సన్‌రూఫ్ లభించనున్నాయి. ఇంజిన్ పరంగా 1.5-లీటర్ i-VTEC పెట్రోల్ ఇంజిన్‌ను కొనసాగిస్తూ 6-స్పీడ్ మాన్యువల్, 7-స్పీడ్ సీవీటీ గేర్‌బాక్స్ ఆప్షన్లు ఇస్తున్నారు.
రెనాల్ట్ డస్టర్ హైబ్రిడ్
రెనాల్ట్ డస్టర్ మోడల్‌లో స్ట్రాంగ్ హైబ్రిడ్ వెర్షన్ అక్టోబర్ 17న మార్కెట్‌లోకి రాబోతోంది. ఇందులో 1.8-లీటర్ పెట్రోల్ ఇంజిన్‌తో పాటు రెండు ఎలక్ట్రిక్ మోటార్లు కలిగిన ఇ-టెక్ హైబ్రిడ్ సిస్టమ్‌ను అందించారు. ఇది మొత్తం 160bhp పవర్, 172Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. సిటీ డ్రైవింగ్‌లో దాదాపు 80 శాతం ప్రయాణాన్ని ఇవి మోడ్‌లోనే పూర్తి చేయవచ్చని కంపెనీ తెలుపుతోంది. గ్రాండ్ విటారా, అర్బన్ క్రూజర్ హైరైడర్ వంటి కార్లకు ఇది గట్టి పోటీ ఇవ్వనుంది.
మహీంద్రా కొత్త ఎస్‌యూవీ
ప్రముఖ ద్విచక్ర, నలుగు చక్రాల వాహన తయారీ సంస్థ మహీంద్రా అక్టోబర్ 15న ఒక కొత్త ఎస్‌యూవీని పరిచయం చేసే ఆలోచనలో ఉంది. అధికారిక ప్రకటన రానప్పటికీ, ఇది XUV 3XO CNG వెర్షన్ అయి ఉండవచ్చని సమాచారం. కంపెనీ నుంచి రాబోతున్న మొదటి ఫ్యాక్టరీ-ఫిట్టెడ్ సిఎన్‌జి ప్యాసింజర్ కార్ ఇదే అవుతుంది. ఇది లాంచ్ అయితే టాటా నెక్సాన్ సిఎన్‌జి, మారుతి బ్రెజ్యా సిఎన్‌జి మోడళ్లతో నేరుగా తలాపడనుంది.
హ్యుందాయ్ బేయాన్
హ్యుందాయ్ సంస్థ తమ కొత్త ఎస్‌యూవీ బేయాన్ కొనుగోలు కోసం రూ. 11,000లకు బుకింగ్స్ ప్రారంభించింది. అక్టోబర్ 12న గ్లోబల్ ప్రిమియర్ జరగనుండగా, 4.2 మీటర్ల పొడవు ఉండే ఈ కారును వెన్యూ, క్రెటా మోడళ్ల మధ్య స్థానంలో తీసుకువస్తున్నారు. ఇందులో 1.5-లీటర్ పెట్రోల్ ఇంజిన్, AI వాయిస్ అసిస్టెంట్, పనోరమిక్ సన్‌రూఫ్, 360-డిగ్రీ కెమెరా వంటి మోడ్రన్ ఫీచర్లు ఉన్నాయి. త్వరలోనే దీని సీఎన్జీ వెర్షన్ కూడా అందుబాటులోకి రానుంది.