Honda SP160 : టీవీఎస్ అపాచీకి గట్టిపోటీ.. జీఎస్టీ తగ్గింపుతో భారీగా తగ్గిన హోండా బైక్ ధర

జీఎస్టీ తగ్గింపుతో భారీగా తగ్గిన హోండా బైక్ ధర

Update: 2025-10-07 07:17 GMT

Honda SP160 : భారతీయ మార్కెట్లో 160సీసీ సెగ్మెంట్‌ బైక్‌లకు యువతలో, ఆఫీస్ రైడర్లలో ఎప్పుడూ మంచి క్రేజ్ ఉంటుంది. ఈ కేటగిరీలో హోండా SP160 స్టైలిష్ బైక్‌లలో ఒకటిగా ఉంది. ఇప్పుడు జీఎస్టీ తగ్గింపు 2025 (28% నుంచి 18%) కారణంగా ఈ బైక్ ధర మునుపటి కంటే మరింత తగ్గి, అందుబాటులోకి వచ్చింది. జీఎస్టీ రేటు తగ్గడంతో SP160 ధరలో ఏకంగా రూ.9,000 నుంచి రూ.10,635 వరకు తగ్గింపు వచ్చింది. ఈ నిర్ణయం వల్ల హోండా SP160 బైక్ మిడిల్ క్లాస్ కొనుగోలుదారుల బడ్జెట్‌లో సులభంగా సరిపోతుంది.

ధర తగ్గింపు తర్వాత హోండా SP160 ఇప్పుడు మరింత పోటీ ధరలకు లభిస్తోంది. కొత్త ధరల ప్రకారం, సింగిల్ డిస్క్ వేరియంట్ ఎక్స్-షోరూమ్ ధర రూ.1,12,907 కాగా, డబుల్ డిస్క్ వేరియంట్ ధర రూ.1,18,417 గా ఉంది. ఈ కొత్త ధరలతో ఈ బైక్ నేరుగా టీవీఎస్ అపాచీ ఆర్టీఆర్ 160, బజాజ్ పల్సర్ 160 వంటి పాపులర్ బైక్‌లకు గట్టి పోటీ ఇస్తోంది.

హోండా SP160 ను కంపెనీ పవర్, మైలేజ్ రెండింటినీ సమతుల్యం చేయడానికి రూపొందించింది. ఈ బైక్‌లో 162.71సీసీ సింగిల్-సిలిండర్ ఎయిర్-కూల్డ్ ఇంజన్ ఉంది. ఇది 13.27 bhp పవర్, 14.58 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 5-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో వస్తుంది. ఈ ఇంజిన్ BS6 ఫేజ్ 2 మరియు OBD2B కంప్లైంట్ తో పాటు E20 ఫ్యూయల్‌కు సిద్ధంగా ఉంది. హోండా సంస్థ ఈ SP160 దాదాపు లీటరుకు 50కిమీ మైలేజ్ ఇస్తుందని, దీని టాప్ స్పీడ్ గంటకు 110 కిమీ ఉంటుందని చెబుతోంది.

హోండా SP160 డిజైన్ స్పోర్టీ, క్లాసిక్ లుక్‌ల అద్భుతమైన కలయిక. బైక్‌లో లేటెస్ట్ ఫీచర్లను అందించారు. ఇందులో 4.2-అంగుళాల TFT డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ ఉంది. ఇది స్పీడ్, గేర్ పొజిషన్, సగటు మైలేజ్, ఫ్యూయల్ లెవెల్ వంటి అవసరమైన సమాచారాన్ని అందిస్తుంది. అదనంగా ఈ బైక్‌లో LED హెడ్‌లైట్, టెయిల్‌లైట్, సింగిల్-ఛానల్ ABS, USB-C ఛార్జింగ్ పోర్ట్, ఇంజన్ స్టాప్ స్విచ్, సైడ్-స్టాండ్ ఇంజన్ కట్-ఆఫ్ సిస్టమ్ వంటి సేఫ్టీ, సౌకర్యవంతమైన ఫీచర్లు ఉన్నాయి.

హోండా SP160 మార్కెట్లో TVS అపాచీ RTR 160, బజాజ్ పల్సర్ N160 వంటి బైక్‌లకు గట్టి పోటీని ఇస్తుంది. అపాచీ కొంచెం పవర్పుల్ ఉన్నప్పటికీ, హోండా SP160 మాత్రం దాని స్మూత్ పనితీరు, రిఫైన్డ్ ఇంజిన్ కారణంగా రైడర్ల మధ్య ఎక్కువ ప్రాచుర్యం పొందింది. పల్సర్‌తో పోలిస్తే, SP160 నిశ్శబ్దంగా ఉండి, మెరుగైన మైలేజీని ఇస్తుంది. GST తగ్గింపు తర్వాత ధర గణనీయంగా తగ్గడం, స్టైలిష్ లుక్, అధిక మైలేజ్, అడ్వాన్స్‌డ్ సేఫ్టీ ఫీచర్లు, స్మూత్ ఇంజిన్‌తో ఈ బైక్ నిస్సందేహంగా వాల్యూ ఫర్ మనీ కలిగిన ఆప్షన్ గా నిలిచింది.

Tags:    

Similar News