Top 5 Affordable Cars : 34 కిమీ మైలేజ్, అదిరే సేఫ్టీ ఫీచర్స్..రూ.5లక్షలలోపే టాప్ 5 కార్లు ఇవే

రూ.5లక్షలలోపే టాప్ 5 కార్లు ఇవే

Update: 2025-12-16 07:57 GMT

Top 5 Affordable Cars : భారతదేశంలో జీఎస్టీ తగ్గింపు తర్వాత ఇప్పుడు కార్లను కొనుగోలు చేయడం మరింత చౌకగా మారింది. మీ బడ్జెట్ రూ.5 లక్షల లోపు ఉండి మైలేజ్, ఫీచర్లు, సేఫ్టీ వంటి మూడింటిలోనూ మంచి పర్ఫామెన్స్ చూపించే కారు కోసం చూస్తున్నట్లయితే ఈ లిస్ట్ మీకు ఉపయోగపడుతుంది. ముఖ్యంగా ఈ కార్లు ధరలో చవకగా ఉండటమే కాకుండా వాటి క్వాలిటీ కూడా బాగుంటుంది.

మారుతి సుజుకి ఎస్-ప్రెస్సో : భారతదేశంలో అత్యంత సరసమైన మైక్రో ఎస్‌యూవీగా పిలువబడే ఈ కారు ప్రారంభ ధర రూ.3.49 లక్షలు. దీని 1.0-లీటర్ పెట్రోల్ ఇంజిన్ 66 PS పవర్‌ను ఉత్పత్తి చేస్తుంది. CNG వెర్షన్ లీటర్‌కు 33 కి.మీ వరకు మైలేజీని ఇస్తుంది.

మారుతి సుజుకి ఆల్టో K10 : అత్యంత ప్రజాదరణ పొందిన ఈ కారు ప్రారంభ ధర రూ.3.69 లక్షలు. కొత్త తరం మోడల్‌లో 1.0-లీటర్ K10B ఇంజిన్ (67 PS) ఉంది. దీని CNG మోడల్ 33.85 కి.మీ మైలేజ్ ఇస్తుంది.

రెనాల్ట్ క్విడ్ : ఎస్‌యూవీ లుక్‌తో కూడిన ఈ చిన్న కారు ధర రూ.4.29 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. దీని 1.0-లీటర్ ఇంజిన్ (68 PS), 184 మిమీ గ్రౌండ్ క్లియరెన్స్ యువతను ఆకర్షిస్తున్నాయి. మైలేజ్ సుమారు 22 కి.మీ/లీటర్ వరకు ఉంటుంది. ఇందులో 8-అంగుళాల టచ్‌స్క్రీన్, క్రూయిజ్ కంట్రోల్ వంటి ఫీచర్లు లభిస్తాయి.

మారుతి సుజుకి సెలెరియో : దీనిని మైలేజ్ క్వీన్ అని పిలుస్తారు. ప్రారంభ ధర రూ.4.69 లక్షలు. దీని 1.0-లీటర్ ఇంజిన్ (67 PS) CNG వెర్షన్ ఏకంగా 34 కి.మీ వరకు మైలేజీని ఇస్తుంది. ఇందులో క్లైమేట్ కంట్రోల్, డ్యూయల్ ఎయిర్‌బ్యాగ్స్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

టాటా టియాగో: బడ్జెట్ కార్లలో అత్యంత సురక్షితమైన కారుగా దీనిని పరిగణిస్తారు. ఈ కారు ప్రారంభ ధర రూ.4.57 లక్షలు. ఇందులో 1.2-లీటర్ రేవోట్రాన్ ఇంజిన్ (86 PS) ఉంది. దీని మైలేజ్ 23 నుంచి 26 కి.మీ/లీటర్ వరకు ఉంటుంది. అత్యంత ముఖ్యమైన విషయం ఏమిటంటే.. ఈ కారు 4-స్టార్ గ్లోబల్ NCAP సేఫ్టీ రేటింగ్‌ను కలిగి ఉంది. ఇది ఈ విభాగంలో మంచి సేఫ్టీని అందిస్తుంది. ఇందులో 7-అంగుళాల టచ్‌స్క్రీన్, హర్మాన్ సౌండ్ సిస్టమ్, ESP వంటి ఫీచర్లు ఉన్నాయి.

గమనిక: ADAS ఫీచర్ ఈ సెగ్మెంట్‌లో ప్రస్తుతం అందుబాటులో లేదు. అయితే, భవిష్యత్తులో ఈ కార్లకు భద్రతా ప్రమాణాలు పెరిగే అవకాశం ఉంది.

Tags:    

Similar News