Hyundai Creta : క్రెటా లవర్లకు పండగే పండగ.. కొత్త ఏడాదిలో భారీగా తగ్గిన ధరలు
కొత్త ఏడాదిలో భారీగా తగ్గిన ధరలు
Hyundai Creta : హ్యుందాయ్ క్రెటా కొనాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే మీకు ఇది ఒక అదిరిపోయే శుభవార్త. ఇండియన్ రోడ్లపై తిరుగులేని రారాజుగా వెలుగొందుతున్న క్రెటాపై హ్యుందాయ్ సంస్థ జనవరి 2026 నెలకు గానూ భారీ డిస్కౌంట్లను ప్రకటించింది. ఎస్‌యూవీ సెగ్మెంట్‌లో మోస్ట్ వాంటెడ్ కారుగా ఉన్న క్రెటాపై ఇలాంటి ఆఫర్లు రావడం నిజంగా గొప్ప అవకాశం. మీరు ఎంచుకునే వేరియంట్‌ను బట్టి ఈ ఆదా ఉంటుంది. ముఖ్యంగా పెట్రోల్ మరియు ఎన్-లైన్ వెర్షన్ల మీద ఆఫర్లు ఎక్కువగా ఉన్నాయి.
ఏ వేరియంట్‌పై ఎంత తగ్గుతుంది?
హ్యుందాయ్ ప్రకటించిన ఈ ఆఫర్లలో ముఖ్యంగా ఎక్స్ఛేంజ్ బోనస్, కార్పొరేట్ బెనిఫిట్స్ ఉన్నాయి. మీరు క్రెటా పెట్రోల్ మోడల్ లేదా స్పోర్టియర్ లుక్ ఉన్న N Line వేరియంట్‌ను ఎంచుకుంటే ఏకంగా రూ.40,000 వరకు ప్రయోజనం పొందవచ్చు.
మైలేజ్ ప్రియులు ఎక్కువగా ఇష్టపడే డీజిల్ మోడళ్లపై సుమారు రూ.30,000 వరకు తగ్గింపు లభిస్తోంది. ఈ ఆఫర్లు జనవరి నెలాఖరు వరకు మాత్రమే అందుబాటులో ఉంటాయి. పూర్తి వివరాల కోసం మీ దగ్గరలోని హ్యుందాయ్ డీలర్‌షిప్‌ను సంప్రదిస్తే ఏ వేరియంట్‌పై ఎంత తగ్గింపు ఉందో స్పష్టంగా తెలుస్తుంది.
హ్యుందాయ్ క్రెటా కేవలం లుక్ పరంగానే కాదు, లోపల ఉండే లగ్జరీ ఫీచర్లతో కూడా కస్టమర్లను ఆకట్టుకుంటుంది. దీని క్యాబిన్‌లో 10.25-ఇంచుల భారీ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, అదే సైజులో ఉండే డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి. ఇక ఆకాశాన్ని చూస్తూ ప్రయాణించడానికి వాయిస్ కమాండ్‌తో పనిచేసే పనోరమిక్ సన్‌రూఫ్ ఇందులో ఉంది. ప్రయాణం బోర్ కొట్టకుండా అద్భుతమైన మ్యూజిక్ సిస్టమ్, కంఫర్ట్ సీట్లు ఈ ఎస్‌యూవీ ప్రత్యేకత.
ఈ రోజుల్లో కారు కొనేవారు భద్రతకు పెద్దపీట వేస్తున్నారు. క్రెటా ఈ విషయంలో కస్టమర్లను నిరాశ పరచదు. ఇందులో ఏకంగా 70కి పైగా సేఫ్టీ ఫీచర్లు ఉన్నాయి. 6 ఎయిర్‌బ్యాగ్‌లు, 360-డిగ్రీ కెమెరాతో పాటు అత్యంత అధునాతనమైన లెవల్-2 ADAS టెక్నాలజీని కూడా హ్యుందాయ్ అందించింది. దీనివల్ల ప్రమాదాల ముప్పు గణనీయంగా తగ్గుతుంది. సేఫ్టీ,టెక్నాలజీ కలయికలో క్రెటా బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు.
భారత మార్కెట్లో హ్యుందాయ్ క్రెటా ప్రారంభ ధర రూ.10.79 లక్షల నుంచి ప్రారంభమై టాప్ ఎండ్ వేరియంట్ రూ.20.05 లక్షల (ఎక్స్‌షోరూమ్) వరకు ఉంది. ఈ కారు నేరుగా కియా సెల్టోస్, మారుతి గ్రాండ్ విటారా, టయోటా హైరైడర్, హోండా ఎలివేట్, కొత్తగా వచ్చిన టాటా సియెర్రా వంటి కార్లతో పోటీ పడుతోంది.