Hyundai : హ్యుందాయ్ అదిరిపోయే ఆఫర్.. రూ.6లక్షల కారుపై రూ.60వేల డిస్కౌంట్

రూ.6లక్షల కారుపై రూ.60వేల డిస్కౌంట్

Update: 2025-09-10 11:56 GMT

Hyundai : పండుగ సీజన్‌ను దృష్టిలో ఉంచుకుని, వాహన తయారీ సంస్థలు కొత్త కొత్త ఆఫర్లను ప్రకటిస్తున్నాయి. ఇందులో భాగంగా హ్యుందాయ్ మోటార్ ఇండియా సెప్టెంబర్ 2025 కోసం తన కార్లపై భారీ ఆఫర్లను ప్రకటించింది. ఈసారి వినియోగదారులకు పండుగ డిస్కౌంట్లే కాకుండా జీఎస్టీ 2.0 అమలు తర్వాత పన్ను తగ్గింపు ప్రయోజనం కూడా లభిస్తుంది. ముఖ్యంగా, కంపెనీ ఎంట్రీ-లెవల్ హ్యాచ్‌బ్యాక్ కారు గ్రాండ్ ఐ10 నియోస్ పై అత్యధిక ఆఫర్ లభిస్తోంది.

మీడియా నివేదికల ప్రకారం.. హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్ మోడల్‌పై మొత్తం రూ.60,000 వరకు డిస్కౌంట్ అందిస్తోంది. ఈ ఆఫర్‌లో రూ.25,000 క్యాష్‌బ్యాక్, రూ.30,000 స్క్రాపేజ్ బోనస్, రూ.5,000 ప్రైడ్ ఆఫ్ ఇండియా ఆఫర్ ఉన్నాయి. ఈ కారు ఎక్స్-షోరూమ్ ప్రారంభ ధర రూ.5,98,300 కాబట్టి, ఈ డిస్కౌంట్లతో కారు ధర మరింత తగ్గి, కస్టమర్లకు మరింత అందుబాటులోకి వచ్చింది.

కంపెనీ ప్రకారం, ఈరా పెట్రోల్ వేరియంట్‌పై మొత్తం రూ.40,000 ప్రయోజనం లభిస్తుండగా, ఎంటీ, ఏఎంటీ (నాన్-సీఎన్‌జీ) ట్రిమ్స్, సీఎన్‌జీ వేరియంట్‌లపై మొత్తం రూ.60,000 వరకు ప్రయోజనం లభిస్తుంది. వీటితో పాటు సెప్టెంబర్ 22 నుంచి అమలులోకి వచ్చే జీఎస్టీ తగ్గింపు వల్ల కూడా కారు ధర మరింత తగ్గే అవకాశం ఉంది.

హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్‌లో 1.2 లీటర్ కప్పా పెట్రోల్ ఇంజిన్ ఉంది. ఇది 83 పీఎస్ పవర్, 113.8 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 5-స్పీడ్ మాన్యువల్, స్మార్ట్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ ఆప్షన్లతో లభిస్తుంది. రంగుల విషయానికొస్తే, ఇది అనేక రకాల మోనోటోన్ షేడ్స్‌తో పాటు డ్యూయల్-టోన్ ఆప్షన్స్‌లో కూడా లభిస్తుంది.

ఫీచర్ల పరంగా నియోస్ చాలా అడ్వాన్సుడ్ గా ఉంటుంది. ఇందులో సెగ్మెంట్-ఫస్ట్ సైడ్, కర్టెన్ ఎయిర్‌బ్యాగ్‌లు, ఫుట్‌వెల్ లైటింగ్, టైప్-సి యూఎస్‌బీ ఛార్జర్, టైర్ ప్రెషర్ మానిటరింగ్ సిస్టమ్ వంటివి ఉన్నాయి. కొత్త డిజైన్‌లో ఎల్‌ఈడీ డీఆర్‌ఎల్‌లు, కనెక్టెడ్ టెయిల్ ల్యాంప్స్, గ్లాసీ బ్లాక్ గ్రిల్ ఉన్నాయి. కారు లోపల ఫ్రెష్ గ్రే అప్‌హోల్‌స్టరీ, 8-ఇంచుల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ, క్రూజ్ కంట్రోల్ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి. సేఫ్టీ కోసం ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, హిల్ అసిస్ట్, కూల్డ్ గ్లోవ్ బాక్స్ వంటివి ఉన్నాయి.

Tags:    

Similar News