Hyundai : మారుతి ఫ్రాంక్స్‌కు చెక్.. సరికొత్త బేయాన్ ఎస్‌యూవీతో హ్యుందాయ్ ఎటాక్

సరికొత్త బేయాన్ ఎస్‌యూవీతో హ్యుందాయ్ ఎటాక్

Update: 2026-02-28 03:40 GMT

Hyundai : హ్యుందాయ్ ఇండియా తన మార్కెట్ వాటాను పెంచుకోవడమే లక్ష్యంగా భారీ ప్లాన్‌తో సిద్ధమైంది. 2030 నాటికి పెట్రోల్, హైబ్రిడ్, ఎలక్ట్రిక్ విభాగాల్లో మొత్తం 7-8 కొత్త మోడళ్లను లాంచ్ చేయాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా 2026 సంవత్సరం హ్యుందాయ్ కి అత్యంత కీలకం కానుంది. వచ్చే ఏడాది మన దేశంలో పాపులర్ అయిన వెర్నా, ఎక్స్‌టర్ కార్ల ఫేస్‌లిఫ్ట్ వెర్షన్లతో పాటు, అంతర్జాతీయ మార్కెట్లో ఉన్న బేయాన్ ఆధారిత కొత్త సబ్‌కాంపాక్ట్ ఎస్‌యూవీని కూడా హ్యుందాయ్ పరిచయం చేయబోతోంది. టాటా పంచ్, మారుతి ఫ్రాంక్స్ వంటి కార్లకు గట్టి పోటీ ఇచ్చేలా హ్యుందాయ్ ఈ కొత్త మోడళ్లను తీర్చిదిద్దుతోంది.

రాబోయే కొత్త ఎక్స్‌టర్ ఫేస్‌లిఫ్ట్‌లో ప్రధానంగా ఎక్స్‌టీరియర్ మార్పులు కనిపిస్తాయి. రీడిజైన్ చేసిన ఫ్రంట్ గ్రిల్, కొత్త బంపర్లు, స్టైలిష్ అల్లాయ్ వీల్స్ ఈ కారుకు సరికొత్త రూపాన్ని ఇస్తాయి. హ్యుందాయ్ సిగ్నేచర్ అయిన H షేప్ ఎల్‌ఈడీ డీఆర్ఎల్స్, టెయిల్ ల్యాంప్స్ అలాగే కొనసాగుతాయి. ఇంజిన్ పరంగా మార్పులు ఉండకపోవచ్చు. ప్రస్తుతం ఉన్న 1.2 లీటర్ పెట్రోల్ ఇంజిన్ (83bhp) తోనే ఇది రానుంది. అయితే, సీఎన్‌జీ వేరియంట్‌లో ఈసారి ఏఎంటీ (AMT) గేర్ బాక్స్ ఆప్షన్ వచ్చే అవకాశం ఉందని సమాచారం.

హ్యుందాయ్ తన రాబోయే 2026 మోడళ్లలో నెక్స్ట్-జనరేషన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్‌ను పరిచయం చేయబోతోంది. ఇది ఆండ్రాయిడ్ ఆటోమోటివ్ ఓఎస్ (AAOS) ఆధారంగా పనిచేస్తుంది. దీనివల్ల ఫోన్ అవసరం లేకుండానే నేరుగా కారు స్క్రీన్‌పై థర్డ్ పార్టీ యాప్స్ వాడుకోవచ్చు. ఇందులో 12.9-అంగుళాల భారీ టచ్‌స్క్రీన్ , 9.9-అంగుళాల డిజిటల్ డ్రైవర్ డిస్ప్లే ఉన్న డ్యూయల్ స్క్రీన్ సెటప్ ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. మ్యాప్స్ అప్‌డేట్ కోసం ఓటీఏ సపోర్ట్ కూడా ఉంటుంది.

ప్రస్తుతం Bc4i అనే కోడ్ నేమ్‌తో తయారవుతున్న ఈ కొత్త ఎస్‌యూవీ, గ్లోబల్ మార్కెట్‌లోని బేయాన్ క్రాస్ఓవర్ ఆధారంగా వస్తోంది. భారత పన్ను నిబంధనలకు అనుగుణంగా దీని పొడవును 4 మీటర్ల లోపు తగ్గించనున్నారు. విశేషమేమిటంటే, ఇందులో హ్యుందాయ్ కొత్తగా అభివృద్ధి చేసిన 1.2 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్‌ను వాడబోతున్నారు. ఇది హైబ్రిడ్ టెక్నాలజీతో రానుండటం వల్ల మైలేజీ పరంగా అద్భుతంగా ఉంటుంది. వెన్యూ నుంచి 1.0 లీటర్ టర్బో ఇంజిన్‌ను కూడా తీసుకునే అవకాశం ఉంది. ఇది నేరుగా మారుతి ఫ్రాంక్స్‌కు సవాల్ విసరనుంది.

Tags:    

Similar News