Jeep : జీప్ కార్లపై డిస్కౌంట్ల జాతర..ఏకంగా 4 లక్షల వరకు తగ్గింపు

ఏకంగా 4 లక్షల వరకు తగ్గింపు

Update: 2026-02-10 08:45 GMT

Jeep : అమెరికన్ ఆఫ్-రోడింగ్ దిగ్గజం జీప్ ప్రస్తుతం ఇండియాలో గడ్డు కాలాన్ని ఎదుర్కొంటోంది. ఈ ఏడాది జనవరి నెలలో కంపెనీ కేవలం 228 కార్లను మాత్రమే విక్రయించగలిగింది. ఈ గతిని మార్చుకోవడానికి, స్టాక్‌ను క్లియర్ చేయడానికి జీప్ ఇప్పుడు భారీగా తగ్గింది. ఫిబ్రవరి 2026 నెలలో తన కార్లపై ఏకంగా రూ.4 లక్షల వరకు బంపర్ డిస్కౌంట్లను ప్రకటించింది. జీప్ కంపాస్, మెరిడియన్, గ్రాండ్ చెరోకీ వంటి ప్రీమియం ఎస్‌యూవీలను సొంతం చేసుకోవాలనుకునే వారికి ఇది ఒక అద్భుతమైన అవకాశం.

జీప్ గ్రాండ్ చెరోకీ

జీప్ లైనప్‌లో అత్యంత ఖరీదైన, విలాసవంతమైన గ్రాండ్ చెరోకీ పై ఈ నెలలో అత్యధికంగా రూ.4 లక్షల డిస్కౌంట్ లభిస్తోంది. కేవలం ధర తగ్గించడమే కాకుండా, కస్టమర్ల కోసం జీప్ వేవ్ ఎక్స్‌క్లూజివ్ ప్రోగ్రామ్‌ను కూడా అందిస్తోంది. ఇందులో 3 ఏళ్ల వారంటీ, ప్రయారిటీ సర్వీసింగ్ వంటి సదుపాయాలు ఉంటాయి. ఈ కారులో 272 హార్స్‌పవర్ ఇచ్చే 2.0-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజన్, ఆల్-వీల్ డ్రైవ్ సిస్టమ్ ఉండటం విశేషం. దీని ఎక్స్-షోరూమ్ ధర రూ.63 లక్షల నుంచి ప్రారంభమవుతుంది.

జీప్ మెరిడియన్

5-సీటర్, 7-సీటర్ ఆప్షన్లలో లభించే జీప్ మెరిడియన్ పై ఈ ఫిబ్రవరిలో రూ.3.25 లక్షల వరకు ఆదా చేసుకోవచ్చు. ఇందులో కన్స్యూమర్ ఆఫర్లు, కార్పొరేట్ డిస్కౌంట్లు కలిసి ఉన్నాయి. ఇది 170 హార్స్‌పవర్ ఇచ్చే 2.0-లీటర్ డీజిల్ ఇంజన్‌తో వస్తుంది. దీని టాప్ మోడల్స్‌లో అద్భుతమైన 4x4 సిస్టమ్, 9-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ లభిస్తాయి. దీని ప్రారంభ ధర రూ.23.33 లక్షలు (ఎక్స్-షోరూమ్).

జీప్ కంపాస్

జీప్ ఇండియాలో అత్యంత పాపులర్ అయిన కంపాస్ పై ఈ నెలలో రూ.2.75 లక్షల వరకు డిస్కౌంట్ ఇస్తున్నారు. మధ్యతరగతి విలాసవంతమైన కారు కావాలనుకునే వారికి ఇది సరైన సమయం. దీని ప్రారంభ ధర రూ.17.73 లక్షలు (ఎక్స్-షోరూమ్). పవర్‌ఫుల్ డీజిల్ ఇంజన్, అద్భుతమైన ఆఫ్-రోడింగ్ సామర్థ్యంతో కంపాస్ ఇప్పుడు మరింత అందుబాటులోకి వచ్చింది.

ఈ ఆఫర్లు అన్నీ ఫిబ్రవరి 28, 2026 వరకు మాత్రమే అందుబాటులో ఉంటాయి. డిస్కౌంట్ మొత్తం మీరు ఉండే నగరం, డీలర్ స్టాక్ ఆధారంగా మారవచ్చు. కాబట్టి కారు బుక్ చేసుకునే ముందు పూర్తి వివరాల కోసం మీ దగ్గరలోని జీప్ షోరూమ్‌ను సంప్రదించండి.

Tags:    

Similar News