Kawasaki : కేటీఎం, రాయల్ ఎన్‌ఫీల్డ్‌కు గట్టి పోటీ.. కవాసకీ వర్సెస్-X 300 విడుదల.. కొత్త కలర్ ఆప్షన్ అదుర్స్

కవాసకీ వర్సెస్-X 300 విడుదల.. కొత్త కలర్ ఆప్షన్ అదుర్స్

Update: 2025-10-30 14:16 GMT

Kawasaki : భారత మార్కెట్లో అడ్వెంచర్ బైక్ ప్రియుల కోసం కవాసకీ సంస్థ తమ 2026 వెర్షన్ వర్సెస్-X 300ను విడుదల చేసింది. ఈ అప్‌డేట్‌లో అత్యంత ముఖ్యమైన విషయం ఏమిటంటే.. కంపెనీ ఈ బైక్ ఎక్స్-షోరూమ్ ధరను అస్సలు పెంచలేదు. ధరను రూ. 3.49 లక్షల వద్ద స్థిరంగా ఉంచుతూ, ఈ మోటార్‌సైకిల్‌ను కొత్త కలర్ ఆప్షన్‌తో తీసుకొచ్చారు. భారతదేశంలో లభించే అత్యంత చౌకైన ట్విన్-సిలిండర్ అడ్వెంచర్ టూరర్ అయిన ఈ బైక్, కేటీఎం 390 అడ్వెంచర్, రాయల్ ఎన్‌ఫీల్డ్ 450 వంటి మోడళ్లతో పోటీ పడుతుంది.

కవాసకీ 2026 వర్సెస్-X 300 మోడల్‌ను భారత మార్కెట్‌లో ఎలాంటి ధర మార్పు లేకుండా విడుదల చేసి సాహసం చేసింది. ఈ మోటార్‌సైకిల్ ఎక్స్-షోరూమ్ ధర రూ. 3.49 లక్షల వద్ద స్థిరంగా కొనసాగుతుంది. ఈ కొత్త మోడల్‌లో ఉన్న ఏకైక మార్పు ఒక కొత్త కలర్ ఆప్షన్. ఇది రిఫ్రెష్డ్ గ్రాఫిక్స్‌తో కూడిన బ్లాక్, గ్రీన్ కలయికతో డ్యూయల్-టోన్ పెయింట్ స్కీమ్‌లో అందుబాటులో ఉంటుంది.

వర్సెస్-X 300 భారతదేశంలో లభించే అత్యంత చౌకైన ట్విన్-సిలిండర్ అడ్వెంచర్ టూరర్గా నిలిచింది. ఇది ముఖ్యంగా కేటీఎం 390 అడ్వెంచర్, కొత్త రాయల్ ఎన్‌ఫీల్డ్ 450 వంటి సింగిల్-సిలిండర్ మోడళ్లకు పోటీ ఇస్తుంది. కవాసకీ వర్సెస్-X 300 ఇంజిన్, మెకానికల్ సెటప్ పాత మోడల్ మాదిరిగానే పర్ఫామెన్స్ అందిస్తుంది.

ఇందులో 296సీసీ, ప్యారలల్-ట్విన్ ఇంజిన్ ఉంటుంది. ఈ ఇంజిన్ 38.8 బీహెచ్‌పీ పవర్, 26 ఎన్ఎమ్ టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. ఈ బైక్‌లో 6-స్పీడ్ గేర్‌బాక్స్ తో పాటు, అసిస్ట్, స్లిప్పర్ క్లచ్ కూడా అందించారు. ఈ బైక్ స్టీల్ ఫ్రేమ్‌పై నిర్మించారు. సస్పెన్షన్ కోసం ముందు భాగంలో టెలిస్కోపిక్ ఫోర్క్స్, వెనుక భాగంలో మోనోషాక్ సస్పెన్షన్ అందించారు.

బ్రేకింగ్ కోసం ముందు, వెనుక భాగాలలో సింగిల్ డిస్క్‌లు ఉపయోగించబడ్డాయి. సేఫ్టీ కోసం డ్యూయల్-ఛానల్ ఏబీఎస్ కూడా ఉంది. అయితే దీనిని ఆఫ్ చేసే అవకాశం లేదు. ఫీచర్లు, ఎలక్ట్రానిక్స్ విషయానికి వస్తే వర్సెస్-X 300 ఒక సింపుల్ మోటార్‌సైకిల్. ఇందులో మోడ్రన్ ఫీచర్లు లేనప్పటికీ, రైడింగ్ సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకున్నారు.

ఇందులో బ్లూటూత్ కనెక్టివిటీ, రైడ్ మోడ్‌లు లేదా ట్రాక్షన్ కంట్రోల్ వంటి అడ్వాన్సుడ్ టెక్నాలజీ ఫీచర్లు లేవు. ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ కూడా అవసరమైన సమాచారాన్ని మాత్రమే చూపించే సెమీ-డిజిటల్ యూనిట్గా ఉంది. ఈ బైక్ స్పెషాలిటీ దాని కంఫర్ట్. షాక్‌లను బాగా అబ్జార్బ్ చేసుకునే సస్పెన్షన్ సెటప్, పెద్ద సీటు, ఫుట్‌పెగ్‌లు, హ్యాండిల్‌బార్ పొజిషన్ అన్నీ కలిసి రైడర్‌కు నిటారుగా, సౌకర్యవంతమైన రైడింగ్ పొజిషన్‌ను అందిస్తాయి.

Tags:    

Similar News