Kia India : కార్ల అమ్మకాల్లో కియా సంచలనం..జూలైలో ఏకంగా 28,200 కార్లు అమ్మి సరికొత్త రికార్డు

28,200 కార్లు అమ్మి సరికొత్త రికార్డు

Update: 2026-08-05 05:10 GMT

Kia India : భారతీయ ఆటోమొబైల్ మార్కెట్లో ప్రముఖ కార్ల తయారీ సంస్థ కియా ఇండియా తమ సరికొత్త విక్రయాల రికార్డుతో సంచలనం సృష్టించింది. జూలై 2026 నెలలో కంపెనీ ఏకంగా 28,200 కార్లను విక్రయించింది. 2019లో భారత మార్కెట్లోకి ప్రవేశించినప్పటి నుంచి కియాకి జూలై నెలలో లభించిన అత్యధిక విక్రయాల సంఖ్య ఇదే కావడం విశేషం. గతేడాది జూలైలో నమోదైన 22,135 యూనిట్లతో పోలిస్తే ఇది ఏకంగా 27.4 శాతం భారీ వృద్ధిని సూచిస్తోంది. పెట్రోల్, డీజిల్ కార్లతో పాటు ఎలక్ట్రిక్ కార్లకు కూడా కస్టమర్ల నుంచి విశేష ఆదరణ లభిస్తోంది.

నెలవారీగానూ పెరిగిన సేల్స్ జోరు

వార్షిక ప్రాతిపదికన మాత్రమే కాకుండా నెలవారీగా చూసినా కియా మెరుగైన ఫలితాలను సాధించింది. జూన్ 2026లో కంపెనీ 24,552 యూనిట్లను అమ్మగా, జూలై నాటికి ఈ సంఖ్య 28,200కి పెరిగి సుమారు 14.86 శాతం వృద్ధిని సాధించింది. ఇక ఈ ఏడాది జనవరి నుంచి జూలై 2026 వరకు కంపెనీ మొత్తం 1,91,949 కార్లను విక్రయించింది. గతేడాది ఇదే వ్యవధిలో అమ్మిన 1,64,274 యూనిట్లతో పోలిస్తే ఇది 16.85 శాతం వార్షిక వృద్ధి.

ఎస్ఈల్యూవీ, ఎమ్‌పీవీ మోడళ్లదే హవా

కియా విక్రయాలు ఈ స్థాయిలో పుంజుకోవడానికి ప్రధాన కారణం కంపెనీకి చెందిన ఎస్‌యూవీ, ఎమ్‌పీవీ మోడళ్లకు మార్కెట్లో ఉన్న విపరీతమైన డిమాండే. కియా పాపులర్ ఎస్‌యూవీలు అయిన సెల్టోస్, సోనెట్ విక్రయాల్లో అగ్రస్థానంలో నిలిచాయి. వీటితో పాటు ఇటీవలే మార్కెట్లోకి వచ్చిన క్యారెన్స్ క్లావిస్, క్యారెన్స్ క్లావిస్ ఈవీ మోడళ్లు తమ విభాగాలలో కస్టమర్లను విశేషంగా ఆకట్టుకుని అమ్మకాలను పెంచడంలో తోడ్పడ్డాయి.

సైరోస్ ఈవీకి అదిరిపోయే రెస్పాన్స్

ఇటీవలే మార్కెట్లోకి విడుదలైన కియా సైరోస్ ఈవీ ఎలక్ట్రిక్ కారుకు ప్రారంభంలోనే బంపర్ బుకింగ్స్ లభించాయని కంపెనీ తెలిపింది. ఇది భారతదేశంలో కియా తయారు చేసిన రెండవ మేస్-మార్కెట్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ. ఒక్కసారి ఛార్జ్ చేస్తే ఏఆర్ఏఐ ప్రమాణాల ప్రకారం 500 కిలోమీటర్లకు పైగా మైలేజ్/రేంజ్ ఇవ్వడం, డీసీ ఫాస్ట్ ఛార్జింగ్, లెవెల్-2 ADAS వంటి హైటెక్ ఫీచర్లు ఉండటంతో ఎలక్ట్రిక్ కార్ లవర్స్ దీనిని కొనుగోలు చేసేందుకు పోటీ పడుతున్నారు.

ఫెస్టివ్ సీజన్ నాటికి కొత్త కార్ల లాంచ్

భారత మార్కెట్లో తమ పట్టును మరింత బలపరిచేందుకు కియా ఇండియా రాబోయే పండుగల సీజన్ కంటే ముందే సోరెంటో హైబ్రిడ్ లాంచ్ చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. దీంతో పాటు ప్రస్తుతం ఉన్న పాపులర్ కార్లలో కొత్త పవర్‌ట్రెయిన్ ఆప్షన్లను తీసుకురానుంది. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా 400 కంటే ఎక్కువ నగరాల్లో 900కు పైగా కస్టమర్ టచ్‌పాయింట్లతో సేవలందిస్తున్న కియా, తమ సేల్స్ అండ్ సర్వీస్ నెట్‌వర్క్‌ను మరింత విస్తరించడానికి కసరత్తు చేస్తోంది.

Tags:    

Similar News