Kia : మార్కెట్లోకి కియా కొత్త ఎలక్ట్రిక్, హైబ్రిడ్ కార్లు.. టీజర్ వదిలిన కంపెనీ.. ఫీచర్లు చూస్తే ఫిదా అవ్వాల్సిందే

ఫీచర్లు చూస్తే ఫిదా అవ్వాల్సిందే

Update: 2026-07-04 11:43 GMT

Kia : ప్రముఖ కార్ల తయారీ సంస్థ కియా ఇండియా వాహన ప్రియులకు అదిరిపోయే అప్‌డేట్ ఇచ్చింది. భారత ఆటోమొబైల్ మార్కెట్లో తన పట్టును మరింత బలోపేతం చేసుకునేందుకు సరికొత్త ప్లాన్‌తో ముందుకు వస్తోంది. ఇందులో భాగంగా కంపెనీ తన సోషల్ మీడియా ఖాతాల్లో ఒక ఆసక్తికరమైన టీజర్‌ను విడుదల చేసింది. ఈ వీడియోలో HEV (హైబ్రిడ్ ఎలక్ట్రిక్ వెహికల్), BEV (బ్యాటరీ ఎలక్ట్రిక్ వెహికల్) అనే పదాలను చూపిస్తూ.. భవిష్యత్తు మన తలుపు తడుడుతోందంటూ సరికొత్త కార్ల లాంచ్‌పై హింట్ ఇచ్చింది. కంపెనీ అధికారికంగా కార్ల పేర్లను ప్రకటించనప్పటికీ, ఇవి కియా సైరోస్ EV, కియా సొరెంటో మోడల్స్ అయి ఉంటాయని మార్కెట్ వర్గాల్లో గట్టి ప్రచారం జరుగుతోంది.

కియా సైరోస్ ఎలక్ట్రిక్

భారతీయ రోడ్లపై ఇప్పటికే టెస్టింగ్ జరుపుకుంటూ కనిపించిన కియా సైరోస్ EV.. మార్కెట్లోకి రాబోతున్న కియా నాలుగో ఎలక్ట్రిక్ కారు కానుంది. ఇదివరకు మార్కెట్లో ఉన్న EV6, EV9 మోడల్స్ సరసన ఇది చేరనుంది. సైరోస్ పెట్రోల్ కార్ల తరహాలోనే ఇది కూడా బాక్సీ డిజైన్, పొడవైన లుక్‌తో రానుంది. అయితే ఎలక్ట్రిక్ వెహికల్ కావడంతో దీనికి సరికొత్త అల్లాయ్ వీల్స్, ఆకర్షణీయమైన కలర్ ఆప్షన్లు ఇవ్వనున్నారు. ఈ కారులో ఏకంగా 30 ఇంచుల భారీ ట్రినిటీ డిస్ప్లే, పనోరమిక్ సన్‌రూఫ్, 360 డిగ్రీల కెమెరా, డ్యాష్‌క్యామ్ మరియు అడ్వాన్స్‌డ్ లెవెల్-2 అడాస్ వంటి టాప్ క్లాస్ సేఫ్టీ ఫీచర్లు ఉండే అవకాశం ఉంది.

కియా సొరెంటో హైబ్రిడ్

మరోవైపు హైబ్రిడ్ సెగ్మెంట్లో కియా కంపెనీ తన ఫ్లాగ్‌షిప్ మోడల్ సొరెంటోను ఇండియాలో దించేందుకు సిద్ధమవుతోంది. ఇది కియా సెల్టోస్ కారు కంటే పై కేటగిరీలో లగ్జరీ లుక్‌తో రానుంది. మూడు వరుసల సీటింగ్ ఆప్షన్‌తో రానున్న ఈ కారు పొడవు 4,815 మిమీ కాగా, వీల్‌బేస్ 2,815 మిమీగా ఉంటుంది. ఇది మార్కెట్లోకి వస్తే టయోటా ఫార్చ్యూనర్, స్కోడా కొడియాక్, జీప్ మెరిడియన్ వంటి గట్టి పోటీదారులకు గట్టి పోటీ ఇవ్వనుంది. ఇందులో 6-సీటర్ లేదా 7-సీటర్ ఆప్షన్లు ఉండొచ్చు.

సొరెంటో కారులో లభించే లగ్జరీ వసతులు

ఈ సరికొత్త లగ్జరీ హైబ్రిడ్ కారులో ప్రయాణికుల కంఫర్ట్ కోసం కంపెనీ భారీ ఫీచర్లను అందిస్తోంది. ఇందులో పెద్ద పనోరమిక్ సన్‌రూఫ్, ప్రీమియం బోస్ ఆడియో సిస్టమ్, వెంటిలేటెడ్ సీట్లు, మల్టీ-జోన్ క్లైమేట్ కంట్రోల్ వంటి సదుపాయాలు ఉంటాయి. ఇంజన్ పరంగా చూస్తే ఇది సెల్ఫ్-చార్జింగ్ హైబ్రిడ్ టెక్నాలజీతో రానుంది. అంటే కారు రన్ అవుతున్నప్పుడే బ్యాటరీ ఆటోమేటిక్‌గా చార్జ్ అవుతుంది. దీనివల్ల మైలేజ్ చాలా అద్భుతంగా వస్తుంది.

మార్కెట్లో ఎప్పుడు లాంచ్ కావచ్చు?

కియా ఇండియా పండగ సీజన్‌ను టార్గెట్ చేస్తూ ఈ సరికొత్త కార్లను భారత మార్కెట్లోకి విడుదల చేసే అవకాశం ఉందని ఆటోమొబైల్ రంగానికి చెందిన నిపుణులు అంచనా వేస్తున్నారు. పర్యావరణహితమైన ఎలక్ట్రిక్, అదిరిపోయే మైలేజ్ ఇచ్చే హైబ్రిడ్ మోడల్స్ ఒకేసారి రాబోతుండడంతో కార్ల లవర్స్ ఈ మోడల్స్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Tags:    

Similar News