Kia : యాప్‌తో అన్నీ మీ కంట్రోల్‌లో.. త్వరలో కియా 11,000ఛార్జింగ్ పాయింట్స్
త్వరలో కియా 11,000ఛార్జింగ్ పాయింట్స్;
Kia : కియా ఈ నెల జూలై 15న తన కొత్త ఎలక్ట్రిక్ కారు కారెన్స్ క్లావిస్ ఈవీని విడుదల చేయబోతుంది. భారతదేశంలో కియా నుంచి భారీ సంఖ్యలో అమ్ముడయ్యే మొదటి ఎలక్ట్రిక్ వాహనం ఇదే కానుంది. లాంచ్‌కు ముందే, కియా భారతదేశంలో ఎలక్ట్రిక్ మొబిలిటీని ప్రోత్సహించడానికి ఈవీ ఎకోసిస్టమ్‌ను సిద్ధం చేసింది. దక్షిణ కొరియా కంపెనీ కియా చెబుతున్న దాని ప్రకారం ఈ మొత్తం సిస్టమ్ కస్టమర్లకు ఎలక్ట్రిక్ వాహనాలను స్వీకరించడాన్ని సులభతరం చేయడానికి రూపొందించబడింది. ఈ సిస్టమ్‌కు K-ఛార్జ్ ప్లాట్‌ఫామ్ అని పేరు పెట్టారు. దీనిని మైకియా యాప్‌తో అనుసంధానించారు. దీని ద్వారా వినియోగదారులు దేశవ్యాప్తంగా విస్తరించి ఉన్న 11,000కి పైగా ఛార్జింగ్ పాయింట్లను ఉపయోగించుకోగలుగుతారు. ఈ సౌకర్యం 18 ఛార్జింగ్ కంపెనీలతో భాగస్వామ్యం ద్వారా అందించబడుతుంది. ఇందులో నగరాలతో పాటు హైవే మార్గాలు కూడా ఉంటాయి.
కియా కొత్త ఈవీ రూట్ ప్లానర్ మైకియా యాప్, కంపెనీ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటుంది. దీని ద్వారా వినియోగదారులు ఛార్జింగ్ స్టేషన్‌లను కనుగొనవచ్చు, రియల్ టైమ్‌లో స్లాట్ లభ్యతను చూడవచ్చు. యాప్‌లోనే చెల్లింపులు కూడా చేయవచ్చు. ఇది ఛార్జింగ్ ప్రక్రియను మరింత సులభతరం చేస్తుంది. వేర్వేరు యాప్‌ల అవసరం ఉండదు. కియా ఈవీ సిస్టమ్ కేవలం ఛార్జింగ్‌కు మాత్రమే పరిమితం కాదు. దేశవ్యాప్తంగా కంపెనీకి చెందిన 250కి పైగా వర్క్‌షాప్‌లు ఇప్పుడు ఈవీ ప్రత్యేక టూల్స్, శిక్షణ పొందిన టెక్నీషియన్లతో సిద్ధంగా ఉన్నాయి. దీంతో పాటు 100కి పైగా కియా డీలర్‌షిప్‌లలో 60 kW నుండి 240 kW వరకు ఉండే DC ఫాస్ట్ ఛార్జర్‌లను ఏర్పాటు చేశారు. దీనివల్ల వాహనం సర్వీసింగ్ సమయంలో కూడా ఛార్జింగ్ సౌకర్యం లభిస్తుంది.
క్లావిస్ ఈవీతో పాటు, కియా ఇంట్లో ఛార్జింగ్ సౌకర్యాన్ని కూడా అందిస్తుంది. దీని కోసం 7.4kW, 11kW AC ఛార్జర్ ఆప్షన్లు లభిస్తాయి. దీని ద్వారా కస్టమర్‌లు తమ ఇంట్లోనే వాహనాన్ని సులభంగా ఛార్జ్ చేసుకోవచ్చు. కంపెనీ లక్ష్యం 2026 మధ్య నాటికి K-ఛార్జ్ నెట్‌వర్క్‌ను 20,000 ఛార్జింగ్ పాయింట్ల వరకు విస్తరించడం. వాహనం, ఛార్జింగ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, డిజిటల్ సౌకర్యం, కస్టమర్ సర్వీసు - ఈ అన్నింటినీ కలిపి భారతదేశంలో ఎలక్ట్రిక్ మొబిలిటీకి కొత్త ప్రమాణాలను నెలకొల్పాలని కియా ప్రణాళిక వేస్తోంది.