KTM RC 160 : కేటీఎం నుంచి నయా బుల్లెట్.. RC 160 వచ్చేసింది..యమహా పని ఇక గోవిందా

RC 160 వచ్చేసింది..యమహా పని ఇక గోవిందా

Update: 2026-01-09 13:20 GMT

KTM RC 160 :యంగ్ జనరేషన్ బైక్ రైడర్ల కలల బైక్ కేటీఎం మార్కెట్లోకి సరికొత్త అస్త్రాన్ని ప్రయోగించింది. బడ్జెట్ ధరలో సూపర్ స్పోర్ట్స్ బైక్ అనుభవాన్ని అందించేందుకు KTM RC 160ను భారత మార్కెట్లో లాంచ్ చేసింది. ఇప్పటికే మార్కెట్లో ఉన్న RC 125 స్థానాన్ని ఇది భర్తీ చేయనుంది. అదిరిపోయే లుక్స్, పవర్‌ఫుల్ ఇంజిన్ తో వచ్చిన ఈ బైక్ నేరుగా యమహా R15 కి గట్టి పోటీ ఇవ్వనుంది.

కొత్త KTM RC 160 చూడటానికి తన అన్న RC 200 లాగే చాలా అగ్రెసివ్‌గా కనిపిస్తుంది. ముందు భాగంలో అమర్చిన ఎల్‌ఈడీ హెడ్‌లైట్, డే-టైమ్ రన్నింగ్ లైట్లు బైక్ కు ప్రీమియం లుక్‌ను ఇస్తున్నాయి. విండ్‌షీల్డ్, స్ప్లిట్ సీట్ డిజైన్, ఫ్యూయల్ ట్యాంక్ ఆకృతి అన్నీ కూడా రేసింగ్ బైక్ ను తలపిస్తాయి. ఫెయిరింగ్ మీద ఉన్న కొత్త గ్రాఫిక్స్, రెడీ టు రేస్ స్టిక్కరింగ్ ఈ బైక్ కు ఒక ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చిపెట్టాయి.

ఈ బైక్ లో 164cc సింగిల్ సిలిండర్, లిక్విడ్ కూల్డ్ ఇంజిన్ ను అమర్చారు. ఇది 19 హార్స్ పవర్ పవర్‌ను, 15.5 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. తన సెగ్మెంట్ లోనే ఇది అత్యధిక పవర్ ఇచ్చే ఇంజిన్ అని కంపెనీ చెబుతోంది. 6-స్పీడ్ గేర్ బాక్స్‌తో వచ్చే ఈ బైక్ గంటకు గరిష్టంగా 118 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లగలదు. పవర్-టు-వెయిట్ రేషియో అద్భుతంగా ఉండటం వల్ల సిటీ ట్రాఫిక్ లోనూ, హైవే మీద కూడా రైడింగ్ చాలా స్మూత్‌గా ఉంటుంది.

టెక్నాలజీ పరంగా కేటీఎం ఎక్కడా రాజీ పడలేదు. ఇందులో స్మార్ట్ ఫోన్ కనెక్టివిటీ, నావిగేషన్ ఫీచర్లు ఉన్న LCD ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ ఇచ్చారు. భద్రత కోసం డ్యూయల్ ఛానల్ ABS (యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్)ను అందించారు. ముందు 320ఎంఎం, వెనుక 230ఎంఎం డిస్క్ బ్రేకులు ఉన్నాయి. అలాగే రైడర్ కు సౌకర్యంగా ఉండేందుకు అసిస్ట్, స్లిప్పర్ క్లచ్ వంటి అధునాతన ఫీచర్లను కూడా ఈ బడ్జెట్ బైక్ లో చేర్చడం విశేషం.

భారత మార్కెట్లో కేటీఎం RC 160 ఎక్స్-షోరూమ్ ధర రూ.1.85 లక్షలుగా నిర్ణయించారు. ఇది యమహా యమహా R15 (రూ.1.66 లక్షల నుంచి ప్రారంభం)కు ప్రధాన పోటీదారుగా ఉండబోతోంది. ఒకప్పుడు 125cc బైక్ కొనే ధరలోనే ఇప్పుడు మరింత పవర్ ఉన్న 160cc బైక్ రావడం బైక్ ప్రియులకు కలిసొచ్చే అంశం.

Tags:    

Similar News