Mahindra BE 6 Formula E : మార్కెట్లో కొత్త సంచలనం..స్పోర్టీ లుక్‌తో మహీంద్రా BE 6 ఫార్ములా E ఎడిషన్

స్పోర్టీ లుక్‌తో మహీంద్రా BE 6 ఫార్ములా E ఎడిషన్

Update: 2025-11-27 10:22 GMT

Mahindra BE 6 Formula E : రేసింగ్ ప్రియులను, ఎలక్ట్రిక్ కార్ల అభిమానులను ఆకట్టుకునేందుకు మహీంద్రా సరికొత్త మోడల్‌ను తీసుకొచ్చింది. మహీంద్రా BE సిరీస్‌లోని BE 6 మోడల్‌కు చెందిన ఫార్ములా E ఎడిషన్‎ను భారత మార్కెట్లో లాంచ్ చేసింది. ఫార్ములా E రేసింగ్ స్ఫూర్తితో, కొన్ని కాస్మెటిక్ మార్పులు, అదనపు ఆకర్షణతో వచ్చిన ఈ న్యూ ఎడిషన్, స్టాండర్డ్ BE 6 కంటే మరింత స్టైలిష్‌గా కనిపిస్తోంది. మరి ఈ కొత్త ఎలక్ట్రిక్ కారు ధర ఎంత? దీని ప్రత్యేక ఫీచర్లు ఏంటి? బుకింగ్స్ ఎప్పుడు మొదలవుతాయో తెలుసుకుందాం.

మహీంద్రా తన BE 6 మోడల్‌కు సంబంధించి ఫార్ములా E ఎడిషన్‎ను తాజాగా లాంచ్ చేసింది. ఫార్ములా E రేసింగ్ టీమ్ నుంచి ప్రేరణ పొంది ఈ స్పెషల్ ఎడిషన్‌ను తీసుకొచ్చారు. ఈ కొత్త ఎడిషన్ స్టాండర్డ్ మోడల్ కంటే కాస్త భిన్నంగా, మరింత ఆకర్షణీయమైన లుక్‌లో ఉంది. ఈ ఫార్ములా E ఎడిషన్ రెండు వేరియంట్లలో అందుబాటులో ఉంటుంది. FE2 వేరియంట్ ఎక్స్-షోరూమ్ ధర రూ.23.69 లక్షలు. FE3 వేరియంట్ ఎక్స్-షోరూమ్ ధర రూ.24.49 లక్షలు. ఈ కొత్త ఎడిషన్ కార్ల బుకింగ్‌లు జనవరి 14, 2026 నుంచి మొదలవుతాయి. బుకింగ్‌లు ప్రారంభమైన నెల రోజుల తర్వాత, ఫిబ్రవరి 14, 2026 నుంచి డెలివరీలు ప్రారంభించాలని మహీంద్రా యోచిస్తోంది.

మహీంద్రా BE 6 ఫార్ములా E ఎడిషన్‌కు కొన్ని ప్రత్యేక కాస్మెటిక్ మార్పులు చేశారు. వీటిలో ముఖ్యమైనవి ముందు, వెనుక బంపర్‌లను మరింత అగ్రెసివ్‌గా (స్పోర్టీ లుక్‌లో) తీర్చిదిద్దారు. కొత్త గ్రాఫిక్స్, డెకాల్స్‌ను కూడా ఈ కారుకు జోడించారు. ఈ న్యూ ఎడిషన్ నాలుగు రంగులలో లభిస్తుంది. అవి ట్యాంగో రెడ్, స్టీల్త్ బ్లాక్, ఫైర్‌స్టార్మ్ ఆరెంజ్, ఎవరెస్ట్ వైట్. ఈ రంగులు స్టాండర్డ్ BE 6 మోడల్‌లో కూడా ఉన్నాయి.

ఈ కారు రూఫ్, బోనెట్‌పై మహీంద్రా ఫార్ములా E టీమ్ నుంచి ప్రేరణ పొందిన గ్రాఫిక్‌ను ఉపయోగించారు. ఇందులో 12-పట్టీల గ్రాఫిక్ ఉంది. ఈ టీమ్ ఎలక్ట్రిక్ రేసింగ్ ఛాంపియన్‌షిప్‌లో 12 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా దీన్ని జోడించారు. FE2 వేరియంట్‌లో స్టాండర్డ్ మోడల్ లాగే 19-అంగుళాల వీల్స్ ఉంటాయి. అయితే, FE3 వేరియంట్‌లో ప్రత్యేకంగా 20-అంగుళాల అలాయ్ వీల్స్‌ను అమర్చారు. స్పెషల్ ఎడిషన్ కాబట్టి, వెనుక భాగంలో Formula E బ్యాడ్జింగ్‌‎ను ఏర్పాటు చేశారు. అలాగే, LED లైట్ల డిజైన్‌లో కూడా కొద్దిగా మార్పులు చేశారు. మొత్తం మీద ఈ కొత్త ఎడిషన్ BE 6ను మరింత స్టైలిష్, స్పోర్టీ లుక్‌లో తీసుకొచ్చి, యువతను ఆకర్షించేందుకు మహీంద్రా ప్రయత్నించింది.

Tags:    

Similar News