Mahindra : ఓ వైపు జీఎస్టీ.. మరో వైపు పండుగ.. మహీంద్రా ధమాకా ఆఫర్

మహీంద్రా ధమాకా ఆఫర్

Update: 2025-09-25 11:54 GMT

Mahindra :పండుగల సీజన్‌ను దృష్టిలో ఉంచుకొని మహీంద్రా అండ్ మహీంద్రా తమ కస్టమర్‌ల కోసం ఓ అదిరిపోయే ఆఫర్‌ను ప్రకటించింది. ఇటీవల అమల్లోకి వచ్చిన GST 2.0 కారణంగా తగ్గిన ధరలతో పాటు, ఇప్పుడు అదనపు డిస్కౌంట్‌లను కూడా అందిస్తోంది. ఈ ఆఫర్ ద్వారా కస్టమర్‌లు తమకు నచ్చిన మహీంద్రా SUV పై ఏకంగా రూ. 2.56 లక్షల వరకు ఆదా చేసుకోవచ్చు. Everyone said GST, We said More అనే థీమ్‌తో లాంచ్ అయిన ఈ ఆఫర్, పట్టణ, గ్రామీణ మార్కెట్‌లలోని కస్టమర్లను ఆకట్టుకునేలా రూపొందించబడింది.

మహీంద్రా ప్రకటించిన ఈ ఆఫర్ ధరలను మరింత ఆకర్షణీయంగా మార్చడమే కాకుండా, కస్టమర్‌లకు ఉన్న కొన్ని సందేహాలను కూడా నివృత్తి చేస్తుంది. ముఖ్యంగా E20 ఫ్యూయల్ (ఇథనాల్ మిశ్రమ పెట్రోల్) తో నడిచే వాహనాల వారంటీ గురించి కొన్ని సందేహాలు ఉన్న నేపథ్యంలో, కంపెనీ ఈ వారంటీ పూర్తి చెల్లుబాటు అవుతుందని స్పష్టం చేసింది. కాబట్టి, కస్టమర్‌లు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. వారికి ఈ GST తగ్గింపు, అదనపు డిస్కౌంట్ రూపంలో డబుల్ బెనిఫిట్ లభిస్తుంది.

ఏ మోడల్‌పై ఎంత ఆదా చేసుకోవచ్చు?

బొలెరో నియో : ఈ మోడల్ కొత్త ఎక్స్-షోరూమ్ ధర రూ.8.79 లక్షల నుండి ప్రారంభమవుతుంది. దీనిపై కస్టమర్‌లకు GST తగ్గింపు కింద రూ.1.27 లక్షలు, అదనంగా రూ.1.29 లక్షల ప్రయోజనం లభిస్తుంది. మొత్తంగా రూ.2.56 లక్షల వరకు ఆదా చేసుకోవచ్చు.

XUV 3XO: ఈ మోడల్ కొత్త ఎక్స్-షోరూమ్ ధర రూ.7.28 లక్షలు. దీనిపై GST తగ్గింపు రూ.1.56 లక్షలు, అదనపు ప్రయోజనం రూ.90వేలు. మొత్తం మీద రూ.2.46 లక్షల లాభం పొందవచ్చు.

థార్ : థార్ ఎక్స్-షోరూమ్ ధర రూ.10.32 లక్షలు. దీనిపై GST తగ్గింపు రూ.1.35 లక్షలు, అలాగే అదనపు ప్రయోజనం రూ.20వేలు. మొత్తంగా రూ.1.55 లక్షల వరకు ఆదా చేసుకోవచ్చు.

స్కార్పియో క్లాసిక్ : స్కార్పియో క్లాసిక్ కొత్త ఎక్స్-షోరూమ్ ధర రూ.12.98 లక్షలు. దీనిపై GST తగ్గింపు రూ.1.01 లక్షలు, అదనంగా రూ.0.95 లక్షల ప్రయోజనం లభిస్తుంది. మొత్తం లాభం రూ.1.96 లక్షలు.

స్కార్పియో-ఎన్ : స్కార్పియో-ఎన్ కొత్త ఎక్స్-షోరూమ్ ధర రూ.13.20 లక్షలు. దీనిపై GST తగ్గింపు రూ.1.45 లక్షలు, అదనపు ప్రయోజనం రూ.0.70 లక్షలు. మొత్తంగా రూ.2.15 లక్షల వరకు ఆదా చేసుకోవచ్చు.

థార్ ROXX : థార్ ROXX ఎక్స్-షోరూమ్ ధర రూ.12.25 లక్షలు. దీనిపై GST తగ్గింపు రూ.1.33 లక్షలు, అదనపు ప్రయోజనం రూ.20వేలు. మొత్తం మీద రూ.1.53 లక్షల లాభం పొందవచ్చు.

XUV700: XUV700 కొత్త ఎక్స్-షోరూమ్ ధర రూ.13.19 లక్షలు. దీనిపై GST తగ్గింపు రూ.1.43 లక్షలు, అదనంగా రూ.81వేలు ప్రయోజనం లభిస్తుంది. మొత్తంగా రూ.2.24 లక్షల వరకు ఆదా చేసుకోవచ్చు.

Tags:    

Similar News