Maruti Dzire : తక్కువ బడ్జెట్లో పెద్ద కారు... ఇప్పుడు రూ.50వేలకే ఇంటికి తీసుకెళ్లొచ్చు
ఇప్పుడు రూ.50వేలకే ఇంటికి తీసుకెళ్లొచ్చు;
Maruti Dzire : భారత మార్కెట్లో మారుతి సుజుకి అత్యధికంగా కార్లు అమ్ముతున్న కంపెనీలలో ఒకటి. ఈ రోజుల్లో కూడా ప్రతి రెండవ ఇంట్లో మారుతి కారు కనిపించడం కామన్. తక్కువ బడ్జెట్లో స్టైలిష్, పవర్ఫుల్ కారును కొనుగోలు చేయాలని కలలు కంటున్నట్లయితే మారుతి సుజుకి డిజైర్ అద్భుతమైన ఆప్షన్. ప్రత్యేకించి ప్రస్తుతం కేవలం రూ.50,000 డౌన్ పేమెంట్ తో ఈ కారును ఇంటికి తీసుకెళ్లవచ్చు. అది ఎలాగో ఈ వార్తలో తెలుసుకుందాం.
మారుతి డిజైర్ భారత మార్కెట్లో ఎంతో ప్రజాదరణ పొందిన సెడాన్. ఇది దాని ధర, అద్భుతమైన మైలేజ్, అదిరిపోయే ఫీచర్లకు ప్రసిద్ధి చెందింది. ముఖ్యంగా బడ్జెట్లో ఒక అద్భుతమైన కారును కోరుకునే కుటుంబాల కోసం ఈ కారును రూపొందించారు. మారుతి డిజైర్‌లో 1.2 లీటర్ పెట్రోల్ ఇంజిన్ ఉంది. ఇది దాదాపు 89 bhp పవర్‌ను, 111.7 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇందులో మ్యాన్యువల్, ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ ఆప్షన్లు కూడా అందుబాటులో ఉన్నాయి. మైలేజ్ విషయానికి వస్తే, ఈ కారు పెట్రోల్ వేరియంట్లో దాదాపు 22-24 కి.మీ. లీటర్‌కు మైలేజ్ ఇస్తుంది.
ఒకేసారి కారు పూర్తి ధరను చెల్లించలేకపోతే ఫైనాన్స్ లో కూడా తీసుకొవచ్చు. ఈ రోజుల్లో చాలా బ్యాంకులు, ఎన్బిఎఫ్సి (NBFC) కంపెనీలు తక్కువ డౌన్ పేమెంట్, సులభ EMI ఆప్షన్లతో కార్ లోన్ ప్లాన్లను అందిస్తున్నాయి. ఉదాహరణకు, మారుతి డిజైర్ బేస్ మోడల్ LXiని కొనుగోలు చేయాలనుకుంటే దీని ఆన్-రోడ్ ధర సుమారు రూ.7,73,806 లక్షలు ఉంటుంది. కేవలం రూ.50,000 డౌన్ పేమెంట్ చెల్లించి ఈ కారును మీ పేరు మీద నమోదు చేసుకోవచ్చు. మిగిలిన మొత్తాన్ని బ్యాంక్ నుండి లోన్‌గా తీసుకోవచ్చు.
రూ.7,23,806 లక్షల లోన్ తీసుకుంటే.. వడ్డీ రేటు సంవత్సరానికి 9శాతం అయితే, 5 సంవత్సరాల కాలానికి ప్రతినెల EMI సుమారు రూ.15,025 ఉండవచ్చు. వడ్డీని కలిపిన తర్వాత లోన్ మొత్తం దాదాపు రూ.9,01,500 అవుతుంది. ఈ EMIలో కారు ధర, వడ్డీ, ప్రాసెసింగ్ ఫీజులు మొదలైనవి ఉంటాయి. మీరు EMI కాలపరిమితిని 3 నుండి 7 సంవత్సరాల వరకు ఎంచుకోవచ్చు. దీనివల్ల మీ నెలవారీ వాయిదా తక్కువ లేదా ఎక్కువగా ఉండవచ్చు.
డిజైర్‌లో ఉన్న 1.2 లీటర్ K-సిరీస్ డ్యూయల్ జెట్, డ్యూయల్ VVT ఇంజిన్ కేవలం పవర్‌నే కాకుండా, అద్భుతమైన ఫ్యూయెల్ కెపాసిటీని కూడా అందిస్తుంది. సిటీ డ్రైవింగ్‌లోనూ, హైవేలపై కూడా ఈ కారు చాలా మైలేజీని ఇస్తుంది. తద్వారా ఇంధన ఖర్చులు గణనీయంగా తగ్గుతాయి. ఇది తక్కువ బడ్జెట్లో కారును కొనుగోలు చేయాలనుకునే వారికి మరింత లాభదాయకం. సేఫ్టీ విషయంలో కూడా చాలా పటిష్టంగా ఉంది. ఇటీవల, డిజైర్‌కు భారత్ NCAP (BNCAP) నుండి 5-స్టార్ సేఫ్టీ రేటింగ్ లభించింది. ఇది ఈ సెగ్మెంట్లో డిజైర్‌ను అత్యంత సురక్షితమైన కార్లలో ఒకటిగా నిలిపింది. అన్ని వేరియంట్లలోనూ సేఫ్టీ కోసం 6 ఎయిర్‌బ్యాగ్‌లు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్ (ESP), హిల్ హోల్డ్ అసిస్ట్, ISOFIX చైల్డ్ సీట్ మౌంట్స్, టైర్ ప్రెషర్ మానిటరింగ్ సిస్టమ్ (TPMS), 360-డిగ్రీ కెమెరా వంటి ఫీచర్లు స్టాండర్డ్‌గా అందించబడ్డాయి.