Maruti : మార్కెట్లో బీభత్సం ఖాయం.. ఏకంగా లీటరుకు 35కిమీ మైలేజీతో మారుతి కొత్త కారు వచ్చేస్తోంది

ఏకంగా లీటరుకు 35కిమీ మైలేజీతో మారుతి కొత్త కారు వచ్చేస్తోంది

Update: 2025-10-11 06:29 GMT

Maruti : మారుతి సుజుకి భారత మార్కెట్‌లో తన అమ్ములరాజైన ఫ్రాంక్స్ కారుకు త్వరలో హైబ్రిడ్ వెర్షన్‌ను తీసుకురావడానికి సిద్ధమవుతోంది. వచ్చే ఏడాది, అంటే 2026 నాటికి ఈ మారుతి ఫ్రాంక్స్ హైబ్రిడ్ లాంచ్ అయ్యే అవకాశం ఉంది. ప్రత్యేకించి లీటరుకు 30-35 కి.మీ వరకు మైలేజ్ అందించే కెపాసిటీతో వస్తున్న ఈ హైబ్రిడ్ మోడల్, సాధారణ పెట్రోల్ మోడల్ కంటే ఎక్కువ ధరకే లభించే అవకాశం ఉంది.

మారుతి సుజుకి నుంచి రాబోతున్న ఫ్రాంక్స్ హైబ్రిడ్ మోడల్‌ను ఇటీవల టెస్టింగ్ సమయంలో గుర్తించారు. ఈ కొత్త హైబ్రిడ్ వెర్షన్ ప్రస్తుత పెట్రోల్ మోడల్ కంటే కొంత ఎక్కువ ధరకే లభించవచ్చు. ఫ్రాంక్స్ హైబ్రిడ్ ధర పెట్రోల్ వేరియంట్ కంటే సుమారు రూ. 2 లక్షల నుండి 2.5 లక్షల వరకు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది.

ప్రస్తుతం ఫ్రాంక్స్ ఎక్స్-షోరూమ్ ధర రూ. 7.59 లక్షల నుండి రూ. 12.95 లక్షల మధ్య ఉంది. కాబట్టి, హైబ్రిడ్ వేరియంట్ ధర సుమారు రూ. 8 లక్షల నుండి రూ. 15 లక్షల ఎక్స్-షోరూమ్ మధ్య ఉండవచ్చు. ఈ ధర పరిధిలో ఈ ఎస్‌యూవీ మధ్యతరగతి వినియోగదారులకు బడ్జెట్-ఫ్రెండ్లీ హైబ్రిడ్ ఆప్షన్ కాగలదు. ఈ కొత్త మోడల్‌ను 2026లో జరగబోయే ఇండియా మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పోలో ఆవిష్కరించే అవకాశం ఉంది.

ఈ కారులో మారుతి కొత్త 1.2-లీటర్ Z12E త్రీ-సిలిండర్ పెట్రోల్ ఇంజన్‌ను స్ట్రాంగ్ హైబ్రిడ్ సిస్టమ్‌తో కలిపి ఇవ్వనున్నారు. ఇది సిరీస్ హైబ్రిడ్ సెటప్. ఇందులో పెట్రోల్ ఇంజన్ ప్రధానంగా బ్యాటరీని ఛార్జ్ చేయడానికి పని చేస్తుంది. ఎలక్ట్రిక్ మోటార్ మాత్రమే వీల్స్ కు ఎనర్జీని అందిస్తుంది. ఈ లేటెస్ట్ టెక్నాలజీ సహాయంతో ఫ్రాంక్స్ హైబ్రిడ్ మైలేజ్ లీటరుకు 30-35 కి.మీ వరకు పెరిగే అవకాశం ఉంది. ఇది ప్రస్తుత పెట్రోల్ వెర్షన్ (20.01–22.89 కి.మీ/లీటర్), CNG వేరియంట్ (28.51 కి.మీ/కేజీ) కంటే చాలా మెరుగైనది.

ఫ్రాంక్స్ హైబ్రిడ్ మోడల్‌లో మారుతి సుజుకి అనేక ప్రీమియం ఫీచర్లను అందించే అవకాశం ఉంది. ఇందులో 9-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, హెడ్-అప్ డిస్‌ప్లే, 360-డిగ్రీ కెమెరా, వైర్‌లెస్ ఛార్జింగ్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, సన్‌రూఫ్ వంటి ఫీచర్లు లభించవచ్చు. సేఫ్టీకి ప్రాధాన్యత ఇస్తూ టాప్ మోడల్‌లో లెవెల్-1 ADAS ఫీచర్ కూడా ఉండే అవకాశం ఉంది. ప్రస్తుత మోడల్‌లోని 6 ఎయిర్‌బ్యాగ్‌లు, ABS తో పాటు EBD, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్, హిల్ హోల్డ్ అసిస్ట్, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ వంటి భద్రతా ఫీచర్లు కొనసాగుతాయి.

Tags:    

Similar News