Car Sales : కార్ల అమ్మకాల్లో మరోసారి మారుతినే కింగ్.. సెకండ్ ప్లేసులో ఏ కంపెనీ ఉందంటే ?

సెకండ్ ప్లేసులో ఏ కంపెనీ ఉందంటే ?

Update: 2025-12-10 05:38 GMT

Car Sales : భారత మార్కెట్‌లో ప్రతి నెల కార్ల అమ్మకాలు అనూహ్యంగా పెరుగుతున్నాయి. అయితే కార్ల అమ్మకాల విషయంలో మారుతి సుజుకి చాలా కాలంగా అగ్రస్థానంలో కొనసాగుతోంది. నవంబర్ 2025 లో కూడా మారుతి సుజుకి అమ్మకాలు ఎంత భారీగా ఉన్నాయంటే, టాటా, మహీంద్రా, హ్యుందాయ్ ఈ మూడు అగ్రగామి కంపెనీలు కలిసి కూడా మారుతి అమ్మకాల స్థాయిని చేరుకోలేకపోయాయి. నవంబర్‌లో భారతదేశంలోని టాప్ 10 కార్ల తయారీ కంపెనీలు మొత్తం 4.10 లక్షల కార్లను విక్రయించగా, అందులో ఒక్క మారుతి సుజుకి మాత్రమే 1.7 లక్షల కార్లను విక్రయించింది. మిగిలిన టాటా, మహీంద్రా, హ్యుందాయ్ కంపెనీలు 50 వేల మార్కును దాటాయి.

మారుతి సుజుకి

మారుతి సుజుకి నవంబర్ 2025 లో 1,70,971 కార్లను విక్రయించింది. ఈ అమ్మకాలతో మారుతి ఈ నెలలో అత్యధిక కార్లు విక్రయించిన కంపెనీగా అగ్రస్థానంలో నిలిచింది. అయితే, అక్టోబర్ 2025 తో పోలిస్తే మారుతి అమ్మకాల్లో 3% క్షీణత కనిపించింది. అయినప్పటికీ మార్కెట్‌లో దాని ఆధిపత్యం కొనసాగుతోంది.

టాటా మోటార్స్

టాటా మోటార్స్ నవంబర్‌లో 57,436 కార్లను విక్రయించింది. అక్టోబర్‌లో జరిగిన అమ్మకాలతో పోలిస్తే, టాటాకు 6% నష్టం వాటిల్లింది. అయితే, గత సంవత్సరం నవంబర్ 2024 తో పోలిస్తే కంపెనీకి 22% లాభం రావడం గమనార్హం. గత సంవత్సరంతో పోలిస్తే వృద్ధిని నమోదు చేయడంలో టాటా ముందుంది.

మహీంద్రా

మహీంద్రా గత నెలలో 56,336 కార్లను విక్రయించింది. మహీంద్రాకు నవంబర్ అమ్మకాల్లో అక్టోబర్‌తో పోలిస్తే భారీ నష్టం ఎదురైంది. అక్టోబర్ 2025 లో 71,624 కార్లను విక్రయించిన మహీంద్రాకు, నవంబర్‌లో ఏకంగా 21.3% క్షీణత ఎదురైంది. అమ్మకాల సంఖ్యలో టాటా కంటే కొద్దిగా వెనుకబడి మూడో స్థానంలో నిలిచింది.

హ్యుందాయ్, టయోటా

హ్యుందాయ్ నవంబర్ 2025 అమ్మకాలలో నాల్గవ స్థానంలో నిలిచింది. హ్యుందాయ్ గత నెలలో 50,340 కార్లను విక్రయించింది. అక్టోబర్ తో పోలిస్తే ఈ సంఖ్య 6.4% తక్కువగా ఉంది. అయినప్పటికీ, గత సంవత్సరం నవంబర్ నెల అమ్మకాలతో పోలిస్తే కంపెనీకి 4.3% లాభం వచ్చింది. ఇక, టయోటా నవంబర్ నెల అమ్మకాలలో టాప్ 5 లో స్థానం సంపాదించుకుంది. టయోటా గత నెలలో 30,085 కార్లను విక్రయించగా, అక్టోబర్‌తో పోలిస్తే 25.3% తగ్గింది. అయితే, నవంబర్ 2024 తో పోలిస్తే టయోటాకు 19.5% లాభం దక్కింది.

Tags:    

Similar News