Maruti Suzuki : భారత కార్ల దిగ్గజం మారుతి సుజుకి తమ అత్యంత పాపులర్ మిడ్-సైజ్ ఎస్‌యూవీ విక్టోరిస్ పై ఆగస్టు 2026 నెలలో భారీ డిస్కౌంట్లను ప్రకటించింది. ఈ ఆఫర్ కింద కొత్త కారు కొనుగోలు చేసే వినియోగదారులు గరిష్టంగా రూ. 1.35 లక్షల వరకు ఆదా చేసుకోవచ్చు. ఇందులో క్యాష్ డిస్కౌంట్లతో పాటు పలు ఇతర ప్రయోజనాలు కూడా ఉన్నాయి. ఈ ఎస్‌యూవీ సేల్స్ విభాగంలో నంబర్-1 గా కొనసాగుతోంది. ఒక్క జులై నెలలోనే 11,000 కంటే ఎక్కువ మంది కస్టమర్లు దీనిని కొనుగోలు చేయడం విశేషం.

ధాసు ఫీచర్లు, ఇంటీరియర్ లుక్స్

మారుతి విక్టోరిస్ ఎస్‌యూవీ ముందు భాగంలో కొత్త తరం బోల్డ్ క్రోమ్ గ్రిల్, స్లీక్ ఎల్ఈడి హెడ్‌లైట్‌లు ఉన్నాయి. మస్క్యులర్ బంపర్, ఆకర్షణీయమైన అల్లాయ్ వీల్స్ దీనికి రోడ్డుపై గంభీరమైన లుక్‌ని ఇస్తాయి. ఇంటీరియర్ విషయానికి వస్తే డ్యూయల్-టోన్ డాష్‌బోర్డ్‌తో పాటు 10.25-అంగుళాల పెద్ద టచ్‌స్క్రీన్ ఇన్‌ఫోటైన్‌మెంట్ సిస్టమ్ అందుబాటులో ఉంది. ప్రయాణికుల సౌకర్యార్థం పనోరమిక్ సన్‌రూఫ్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు వంటి మోడర్న్ ఫీచర్లను అందించారు.

అద్భుతమైన 28.65 కిమీ మైలేజ్, ఇంజిన్ ఆప్షన్లు

మైలేజ్ విషయంలో మారుతి విక్టోరిస్ తన సెగ్మెంట్‌లోనే సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది. ఈ ఎస్‌యూవీలో 1.5-లీటర్ మైల్డ్-హైబ్రిడ్, 1.5-లీటర్ స్ట్రాంగ్-హైబ్రిడ్, 1.5-లీటర్ సిఎన్‌జి ఇంజిన్ ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. సాధారణ పెట్రోల్ మోడల్ లీటరుకు 21.18 కిమీ మైలేజ్ ఇస్తుండగా, సిఎన్‌జి వేరియంట్ 27 కిమీ వరకు ఇస్తుంది. ఇక అడ్వాన్స్‌డ్ స్ట్రాంగ్ హైబ్రిడ్ వేరియంట్ ఏకంగా 28.65 కిమీ లీటరుకు బంపర్ మైలేజ్ ఇస్తుంది.

5-స్టార్ సేఫ్టీ, ధర వివరాలు

సురక్షితమైన ప్రయాణం కోసం భారత్ ఎన్‌క్యాప్ క్రాష్ టెస్ట్‌లో విక్టోరిస్ ఎస్‌యూవీకి 5-స్టార్ సేఫ్టీ రేటింగ్ లభించింది. అన్ని వేరియంట్లలో 6-ఎయిర్‌బ్యాగ్‌లు స్టాండర్డ్‌గా వస్తున్నాయి. వీటితో పాటు ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ (ESC), హిల్-హోల్డ్ అసిస్ట్, ABS విత్ EBD వంటి ఫీచర్లు ఉన్నాయి. టాప్ మోడళ్లలో లెవెల్-2 అడాస్ టెక్నాలజీ, 360-డిగ్రీ కెమెరాలు కూడా ఉన్నాయి. ఈ ఎస్‌యూవీ ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ. 10.50 లక్షల నుంచి ప్రారంభమై రూ. 19.99 లక్షల వరకు ఉంటుంది.

Tags: