Maruti Suzuki : కార్ల అమ్మకాల్లో మళ్లీ నెం.1 స్థానం మారుతి సుజుకీదే.. మిగతా కంపెనీల పరిస్థితి ?

మిగతా కంపెనీల పరిస్థితి ?

Update: 2025-09-09 10:32 GMT

Maruti Suzuki : భారతీయ మార్కెట్‌లో మారుతి సుజుకీ కార్లకు ఉన్న ఆదరణ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈసారి కూడా అది నిజమని నిరూపిస్తూ మారుతి సుజుకీ గత నెల (ఆగస్టు 2025)లో అత్యధిక కార్లను విక్రయించి మొదటి స్థానంలో నిలిచింది. మారుతి సుజుకీ మొత్తం 1,27,905 యూనిట్ల కార్లను విక్రయించింది. ఇది గత సంవత్సరం కంటే 0.62 శాతం ఎక్కువ.

టాప్ 5 కార్ల కంపెనీల అమ్మకాలు

గత నెల కార్ల అమ్మకాలలో మొదటి మూడు స్థానాల్లో స్వల్ప మార్పులు వచ్చాయి. మారుతి తర్వాత మహీంద్రా 43,632 యూనిట్ల అమ్మకాలతో రెండో స్థానంలో నిలిచింది. ఇది గత ఏడాది కంటే 7.55 శాతం ఎక్కువ. హ్యుందాయ్ 42,226 యూనిట్ల అమ్మకాలతో మూడో స్థానానికి పడిపోయింది. ఇది గత సంవత్సరం కంటే 2.79 శాతం తక్కువ. టాటా మోటార్స్ 38,286 యూనిట్ల అమ్మకాలతో నాలుగో స్థానంలో ఉంది. ఇది గత ఏడాది కంటే 3.96 శాతం తక్కువ. టయోటా 24,954 యూనిట్ల అమ్మకాలతో ఐదో స్థానంలో నిలిచింది. గత ఏడాది కంటే 5.82 శాతం వృద్ధి సాధించింది.

ఇతర కంపెనీల అమ్మకాల నివేదిక

గత నెలలో కియా అమ్మకాలు 18,212 యూనిట్లు. ఇది గత ఏడాది కంటే 5.66 శాతం తక్కువ. స్కోడా ఫోక్స్‌వ్యాగన్ అమ్మకాలు బాగా పెరిగాయి. 8,111 యూనిట్ల అమ్మకాలతో 29.16 శాతం వృద్ధిని నమోదు చేసింది. అలాగే ఎంజీ మోటార్స్ అమ్మకాలు ఏకంగా 38.86 శాతం పెరిగి 5,717 యూనిట్లకు చేరుకున్నాయి. హోండా అమ్మకాలు 4,041 యూనిట్లు, ఇది గత ఏడాది కంటే 18.59 శాతం తక్కువ. రెనాల్ట్ అమ్మకాలు 2,593 యూనిట్లు, ఇది 14.39 శాతం తక్కువ.

లగ్జరీ కార్ల అమ్మకాలు

మెర్సిడెస్ అమ్మకాలు 1,305 యూనిట్లు, ఇది 1.66 శాతం తక్కువ. బీఎండబ్ల్యూ 1,273 యూనిట్లను విక్రయించింది, ఇది 25.05 శాతం ఎక్కువ.

చివరి స్థానాల్లో ఉన్న కంపెనీలు

ఫోర్స్ కంపెనీ 680 యూనిట్లను విక్రయించింది. గతేడాది అమ్మకాలతో పోలిస్తే ఇది 8.97 శాతం తక్కువ. బీవైడీ 450 యూనిట్ల అమ్మకాలతో 98.24 శాతం వృద్ధి సాధించింది. జాగ్వార్ ల్యాండ్ రోవర్ 442 యూనిట్ల అమ్మింది. సిట్రోయెన్ కేవలం 409 యూనిట్లను మాత్రమే అమ్మి, 0.49 శాతం తక్కువతో చివరి స్థానంలో నిలిచింది.

మొత్తంగా, భారతీయ కార్ల మార్కెట్‌లో మారుతి సుజుకీ తన ఆధిపత్యాన్ని నిలుపుకుంది. హ్యుందాయ్, టాటా అమ్మకాలు కొంత తగ్గినప్పటికీ, మహీంద్రా, కొన్ని ఇతర కంపెనీలు మంచి వృద్ధిని సాధించాయి.

Tags:    

Similar News