Up Coming SUV : మహీంద్రా XUV700, టాటా సఫారీకి పోటీ.. మార్కెట్లోకి వస్తున్న 7 సీటర్ ఎస్యూవీలు ఇవే

మార్కెట్లోకి వస్తున్న 7 సీటర్ ఎస్యూవీలు ఇవే

Update: 2025-10-06 05:14 GMT

Up Coming SUV : భారతీయ మార్కెట్‌లో ఎక్కువ స్పేస్, సీటింగ్ కెపాసిటీ ఉన్న ఫుల్-సైజ్ ఎస్‌యూవీలకు డిమాండ్ రోజురోజుకూ పెరుగుతోంది. ప్రస్తుతం ఈ సెగ్మెంట్‌లో మహీంద్రా XUV700, టాటా సఫారీ బాగా ప్రాచుర్యం పొందాయి. అయితే, రాబోయే 12 నుంచి 15 నెలల్లో ఈ రెంటికీ గట్టి పోటీ ఇచ్చేందుకు మూడు కొత్త 7-సీటర్ ఎస్‌యూవీలు మార్కెట్‌లోకి రాబోతున్నాయి. వాటిలో హోండా, రెనాల్ట్, నిస్సాన్ కంపెనీల కొత్త మోడల్స్ ఉన్నాయి.

హోండా 7 సీటర్ ఎస్‌యూవీ

హోండా నుంచి రాబోయే కొత్త 7 సీటర్ ఎస్‌యూవీని కంపెనీ కొత్త PF2 ప్లాట్‌ఫామ్‌పై తయారు చేయనున్నారు. ఈ ప్లాట్‌ఫామ్ పెట్రోల్, స్ట్రాంగ్-హైబ్రిడ్, ఎలక్ట్రిక్ ఆప్షన్‌లకు కూడా అనుకూలంగా ఉంటుంది. ఈ కొత్త మూడు వరుసల సీటింగ్ ఎస్యూవీ, ప్రస్తుతం హోండా ఎలివేట్ మోడల్ ను పెద్దదిగా చేసి 7 సీటర్ వెర్షన్‌గా తీసుకురావచ్చని రిపోర్టులు చెబుతున్నాయి. ఇది రాజస్థాన్‌లోని తపుకారా ప్లాంట్‌లో తయారవుతుంది. ఇందులో 1.5 లీటర్ 4 సిలిండర్ పెట్రోల్ ఇంజిన్ ఇవ్వవచ్చు. టాప్ వేరియంట్లలో అట్కిన్సన్ స్ట్రాంగ్ హైబ్రిడ్ టెక్నాలజీని కూడా వాడే అవకాశం ఉంది.

2. రెనాల్ట్ 7 సీటర్ ఎస్‌యూవీ

రెనాల్ట్ కంపెనీ తమ కొత్త 7 సీటర్ ఎస్‌యూవీని వచ్చే ఏడాది, అంటే 2026 చివరి నాటికి భారత మార్కెట్లో లాంచ్ చేసే అవకాశం ఉంది. ఈ కొత్త మోడల్, డస్టర్ ఎస్‌యూవీకి 7 సీటర్ వెర్షన్‌గా రావచ్చని భావిస్తున్నారు. డిజైన్ పరంగా దీనికి ఒక ప్రత్యేక గుర్తింపు ఉండేలా రెనో ప్లాన్ చేస్తోంది. పొడవు ఎక్కువగా ఉండటం వల్ల ఈ కారు కేబిన్‌లో ఎక్కువ స్పేస్ లభిస్తుందని అంచనా.

3. నిస్సాన్ 7 సీటర్ ఎస్‌యూవీ

నిస్సాన్ ఇండియా ఎండీ సౌరభ్ వత్స్.. ఇటీవల 2027 ప్రారంభంలో ఒక డి-సెగ్మెంట్ ప్రీమియం ఎస్‌యూవీని లాంచ్ చేయనున్నట్లు ధృవీకరించారు. నిస్సాన్ నుంచి రాబోయే ఈ త్రీ-రో, 7 సీటర్ ఎస్‌యూవీ, కొత్త మిడ్-సైజ్ ఎస్‌యూవీ ఆధారంగా రూపొందించబడుతుంది. ఇందులో 360-డిగ్రీ కెమెరా, లెవెల్ 2 ADAS, వెంటిలేటెడ్ సీట్లు, పెద్ద టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే, డ్యూయల్-పాన్ సన్‌రూఫ్ వంటి అద్భుతమైన ఫీచర్లు ఉండే అవకాశం ఉంది. పెట్రోల్ ఇంజిన్, హైబ్రిడ్ టెక్నాలజీతో పాటు, టాప్ వేరియంట్లలో 4x4 డ్రైవింగ్ సిస్టమ్ కూడా ఉండొచ్చు.

Tags:    

Similar News