Audi Q3: పవర్ఫుల్ ఇంజిన్ అలాగే అడ్వాన్స్డ్ ఫీచర్లు.. మార్కెట్లోకి కొత్త ఆడి క్యూ3 ఎంట్రీ
మార్కెట్లోకి కొత్త ఆడి క్యూ3 ఎంట్రీ
Audi Q3: ప్రముఖ జర్మన్ లగ్జరీ కార్ల తయారీ సంస్థ ఆడి భారతీయ మార్కెట్లోకి అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న తన కొత్త తరం ఎస్యూవీ ఆడి క్యూ3ను అధికారికంగా లాంచ్ చేసింది. భారత మార్కెట్లో దీని ప్రారంభ ఎక్స్ షోరూం ధర రూ.51.99 లక్షలుగా నిర్ణయించారు. సరిగ్గా 2012లో భారత్‌లో అడుగుపెట్టిన ఈ ప్రముఖ ఎస్యూవీ విజయవంతంగా 14 ఏళ్లు పూర్తి చేసుకుని, ఇప్పుడు మూడో తరానికి చెందిన సరికొత్త మోడల్‌తో మార్కెట్లోకి పునఃప్రవేశం చేసింది. మునుపటి మోడళ్లతో పోలిస్తే ఈ కొత్త కారులో డిజైన్, కేబిన్ స్పేస్ అలాగే ఇంజిన్ పనితీరులో ఎన్నో విప్లవాత్మక మార్పులు చేసారు.
ఆకట్టుకునే కొత్త డిజైన్
కొత్త ఆడి క్యూ3 ఎక్స్ టీరియర్ మునుపటి మోడల్ కంటే చాలా భిన్నంగా, అత్యంత ఆకర్షణీయంగా రూపుదిద్దుకుంది. ముందు భాగంలో సరికొత్త స్లిట్-ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్‌లు, ఆ పైన డైనమిక్ ఇండికేటర్లతో కూడిన ఎల్ఈడీ డీఆర్ఎల్లను అమర్చారు. దీనికింద సుమారు 25,600 వేర్వేరు పీక్ కంట్రోల్స్ కలిగిన డిజిటల్ మ్యాట్రిక్స్ ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్‌లు ఇచ్చారు. హనీకాంబ్ గ్రిల్ మధ్యలో 2డీ ఆడి లోగోతో పాటు లెవల్-2 ఏడీఏఎస్ కోసం ప్రత్యేక రాడార్ పొందుపరిచారు. సైడ్ ప్రొఫైల్‌లో 18 అంగుళాల అల్లాయ్ వీల్స్, క్రోమ్ లైనింగ్ అలాగే వెనుక భాగంలో స్ప్లిట్ ఎల్ఈడీ టెయిల్‌ల్యాంప్‌లు ఈ కారు లుక్‌ను మరింత పెంచుతాయి.
పెద్ద సైజు అలాగే లగ్జరీ కేబిన్
కొత్త ఆడి క్యూ3 మునుపటి కంటే పొడవుగా అలాగే వెడల్పుగా తయారైంది. దీని పొడవు 4,531 మిమీ, వెడల్పు 1,859 మిమీ, ఎత్తు 1,623 మిమీగా ఉండగా, వీల్‌బేస్ 2,681 మిమీగా ఉంది. పాత వెర్షన్‌తో పోలిస్తే కొలతలు పెరగడంతో లోపల ప్రయాణించేవారికి మరింత ఎక్కువ స్థలం లభిస్తుంది. లగేజ్ సర్దుకోవడానికి వీలుగా ఇందులో 488 లీటర్ల భారీ బూట్ స్పేస్ అందించారు. ఇంటీరియర్ విషయానికి వస్తే, కొత్త హెక్సాగोनల్ ఫోర్-స్పోక్ స్టీరింగ్ వీల్, డాష్‌బోర్డ్‌పై 11.9 అంగుళాల డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ అలాగే 12.8 అంగుళాల భారీ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ ప్రధాన ఆకర్షణగా నిలుస్తున్నాయి.
అత్యాధునిక సౌకర్యాలు, సేఫ్టీ ఫీచర్లు
డ్రైవింగ్ అనుభూతిని మరింత మెరుగుపరచడానికి ఇందులో అనేక ప్రీమియం ఫీచర్లు పొందుపరిచారు. పనోరమిక్ సన్‌రూఫ్, 12-స్పీకర్ సోనోస్ ఆడియో సిస్టమ్, హెడ్-అప్ డిస్ప్లే, త్రీ-జోన్ క్లైమెట్ కంట్రోల్ అలాగే 9 ఎయిర్‌బ్యాగులు ఇందులో అందుబాటులో ఉన్నాయి. వైర్లెస్ ఫోన్ ఛార్జర్, లెదర్ అప్హోల్స్ట్రీ, ప్రీమియం వుడ్ ట్రిమ్స్ కేబిన్‌కు రాయల్ లుక్ ఇస్తాయి. గేర్ సెలెక్టర్‌ను మార్చి స్టీరింగ్ కాలమ్‌కు అమర్చడం ద్వారా డ్రైవింగ్‌లో మరింత సౌలభ్యం లభిస్తుంది. వెనుక సీట్లలో ప్రయాణించేవారి కోసం యూఎస్బీ టైప్-సీ పోర్టులు అలాగే ఏసీ వెంట్లు ఇవ్వడం జరిగింది.
పవర్ ఫుల్ ఇంజిన్, అద్భుతమైన పర్ఫామెన్స్
ఈ లగ్జరీ ఎస్యూవీ హుడ్ కింద శక్తివంతమైన 2.0 లీటర్ ఫోర్-సిలిండర్ టర్బో పెట్రోల్ ఇంజిన్‌ను అమర్చారు. ఇది గరిష్టంగా 204 హెచ్‌పీ పవర్ అలాగే 320 ఎన్ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజిన్‌కు ఏడు-స్పీడ్ డ్యూయల్-క్లచ్ ఆటోమేటిక్ గేర్ బాక్స్ జత చేశారు. ప్యాడిల్ షిఫ్టర్స్ సదుపాయం కూడా ఉండటంతో పాటు పవర్ నాల్గు చక్రాలకు (AWD) సమానంగా అందుతుంది. పాత మోడల్‌తో పోలిస్తే దీని ఇంజిన్ పవర్ సుమారు 14 హెచ్‌పీ పెరగడంతో డ్రైవింగ్ మరింత ఉత్సాహంగా సాగుతుంది.