Audi : ఆడి నుంచి సరికొత్త ఆర్ఎస్ 5 లాంచ్.. పెట్రోల్ లేకుండానే 84 కి.మీ ప్రయాణం

పెట్రోల్ లేకుండానే 84 కి.మీ ప్రయాణం

Update: 2026-05-07 08:17 GMT

Audi : జర్మనీకి చెందిన ప్రముఖ విలాసవంతమైన కార్ల తయారీ సంస్థ ఆడి, ప్రపంచవ్యాప్తంగా ఉన్న స్పీడ్ ప్రేమికుల కోసం సరికొత్త ఆడి RS 5 మోడల్‌ను యూకేలో లాంచ్ చేసింది. ఈ కారు కేవలం వేగానికి మాత్రమే కాదు, ఆధునిక హైబ్రిడ్ టెక్నాలజీకి కూడా మారుపేరుగా నిలుస్తోంది. కారులో పెట్రోల్ లేకపోయినా, కేవలం ఎలక్ట్రిక్ మోడ్‌లోనే ఇది 84 కిలోమీటర్ల దూరం ప్రయాణించగలగడం విశేషం. 16 ఏళ్ల సుదీర్ఘ ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా ఆడి ఈ పవర్‌ఫుల్ మోడల్‌ను మార్కెట్లోకి తెచ్చింది. కొత్త ఆడి RS 5 లో 2.9 లీటర్ల ట్విన్-టర్బో V6 పెట్రోల్ ఇంజిన్‌ను అమర్చారు. ఇది 503bhp పవర్‌ను ఉత్పత్తి చేస్తుంది. దీనికి తోడుగా ఉన్న ఎలక్ట్రిక్ మోటార్ మరో 174bhp శక్తిని ఇస్తుంది. వెరసి, ఈ కారు మొత్తం మీద 630bhp పవర్, 825Nm టార్క్‌ను విడుదల చేస్తుంది. దీనివల్ల కారు కేవలం 3.6 సెకన్లలోనే సున్నా నుంచి 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. దీని గరిష్ట వేగం గంటకు 250 కిలోమీటర్లుగా ఉంది. హైబ్రిడ్ టెక్నాలజీ వల్ల కేవలం ఎలక్ట్రిక్ మోడ్‌లోనే 84 కిలోమీటర్ల మైలేజీ రావడం ఇన్వెస్టర్లను, కస్టమర్లను ఆశ్చర్యపరుస్తోంది.

కారు లోపల అడుగుపెడితే ఒక లగ్జరీ ప్రపంచం కనిపిస్తుంది. వేడిని, చల్లదనాన్ని ఇచ్చే వెెంటిలేటెడ్ స్పోర్ట్స్ సీట్లు, మైక్రోఫైబర్, కార్బన్ ఫినిషింగ్‌తో కూడిన డాష్‌బోర్డ్ కారుకు అదిరిపోయే లుక్ ఇస్తున్నాయి. ఇందులో డ్రైవర్ కోసం 11.9 అంగుళాల డిజిటల్ డిస్‌ప్లే, మధ్యలో 14.5 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఉన్నాయి. ప్రయాణికుల కోసం కూడా ప్రత్యేకంగా 10.9 అంగుళాల డిస్‌ప్లే ఉండటం విశేషం. హెడ్-అప్ డిస్‌ప్లే ద్వారా డ్రైవర్ రోడ్డు వైపు చూస్తూనే కారు వేగాన్ని, రూట్ మ్యాప్‌ను గమనించవచ్చు.

ఆడి RS సిరీస్ లో ఉండే సిగ్నేచర్ హనీకోంబ్ గ్రిల్ ఈ మోడల్ కు ప్రత్యేక ఆకర్షణ. ముందు వైపు పెద్ద ఎయిర్ డ్యామ్‌లు, వెనుక వైపు ఓవల్ ఆకారంలో ఉండే ఎగ్జాస్ట్ పైపులు కారుకు ఎగ్రెసివ్ లుక్ ఇస్తున్నాయి. దీనిలో OLED టెయిల్ లైట్లు అమర్చారు, ఇవి వెనుక వచ్చే వాహనదారులకు ప్రమాద హెచ్చరికలను కూడా పంపుతాయి. యూకేలో ఇది మూడు వేరియంట్లలో లభ్యం కానుంది. 20, 21 అంగుళాల అలాయ్ వీల్స్ ఆప్షన్లతో పాటు, బ్లాక్ స్టైలింగ్ ప్యాకేజీ కూడా అందుబాటులో ఉంది.

భారత్‌లో లాంచ్ ఎప్పుడు?

ప్రస్తుతానికి ఆడి ఇండియా ఫోకస్ అంతా ఎస్‌యూవీ సెగ్మెంట్ పైనే ఉంది. ప్రస్తుతం మన దేశంలో ఆడి A4, A6 సెడాన్లు, RS సిరీస్ లో RS Q8 ఎస్‌యూవీ మాత్రమే అందుబాటులో ఉన్నాయి. అయితే గతంలో ఆడి RS 5 భారత్‌లో మంచి ఆదరణ పొందింది కాబట్టి, కంపెనీ తన పర్ఫార్మెన్స్ కార్ల విభాగంపై దృష్టి పెడితే త్వరలోనే ఈ సరికొత్త హైబ్రిడ్ మోడల్ భారత్‌లో లాంచ్ అయ్యే అవకాశం ఉంది.

Tags:    

Similar News