Nissan Gravite : కేవలం రూ.5.65లక్షలకే నిస్సాన్ 7 సీటర్.. లీటరుకు 19 కి.మీ మైలేజ్.. అదిరిపోయే ఫీచర్లు

లీటరుకు 19 కి.మీ మైలేజ్.. అదిరిపోయే ఫీచర్లు

Update: 2026-02-18 05:24 GMT

Nissan Gravite : కుటుంబంతో కలిసి ప్రయాణించే వారికి నిస్సాన్ సరికొత్త కానుకను అందించింది. అతి తక్కువ ధరలో 7 సీటర్ ఎమ్‌పీవీని కోరుకునే వారి కోసం నిస్సాన్ గ్రావిటే మార్కెట్లోకి వచ్చేసింది. ఫిబ్రవరి 17, 2026న అధికారికంగా విడుదలైన ఈ కారు, కేవలం రూ.5.65 లక్షల ప్రారంభ ధరతో ప్రస్తుతం భారత మార్కెట్లో అత్యంత చవకైన 7 సీటర్లలో ఒకటిగా నిలిచింది. రెనాల్ట్ ట్రైబర్ ఆధారంగా రూపొందినప్పటికీ, గ్రావిటే తనదైన స్టైలిష్ లుక్, రీడిజైన్ చేసిన గ్రిల్, అదిరిపోయే ఫీచర్లతో ప్రత్యేకంగా కనిపిస్తోంది.

నిస్సాన్ గ్రేవైట్ మొత్తం నాలుగు ప్రధాన ట్రిమ్స్‌లో (Visia, Acenta, N-Connecta, Tekna) అందుబాటులో ఉంది. వేరియంట్ వారీగా ధరలను పరిశీలిస్తే బేస్ మోడల్ Visia MT ధర రూ.5.65 లక్షలు కాగా, Acenta MT రూ.6.59 లక్షలు, N-Connecta MT రూ.7.20 లక్షలు, N-Connecta AMT (ఆటోమేటిక్) రూ.7.80 లక్షలుగా ఉన్నాయి. టాప్ ఎండ్ వేరియంట్లు అయిన Tekna MT రూ.7.91 లక్షలు, Tekna AMT రూ.8.49 లక్షలు కాగా, స్పెషల్ ఎడిషన్లయిన Tekna Launch Edition MT రూ.8.35 లక్షలు, Tekna Launch Edition AMT గరిష్టంగా రూ.8.93 లక్షల (ఎక్స్-షోరూమ్) ధర వద్ద లభిస్తున్నాయి.

ఫీచర్లు, సేఫ్టీ విషయానికి వస్తే.. చిన్న కారే అయినా నిస్సాన్ ఎక్కడా తగ్గలేదు. ఇందులో వైర్‌లెస్ ఆపిల్ కార్‌ప్లే, ఆండ్రాయిడ్ ఆటోను సపోర్ట్ చేసే 8-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, డ్రైవర్ కోసం 7-అంగుళాల డిజిటల్ డిస్ప్లే, వైర్‌లెస్ ఛార్జింగ్, క్రూయిజ్ కంట్రోల్, పుష్-బటన్ స్టార్ట్ వంటి ప్రీమియం ఫీచర్లు ఉన్నాయి. సేఫ్టీ కోసం 6 ఎయిర్‌బ్యాగ్‌లు (స్టాండర్డ్), ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ (ESC), ABS విత్ EBD, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ (TPMS), రియర్ పార్కింగ్ సెన్సార్లతో ఈ కారు పటిష్టంగా రూపొందించబడింది.

ఇంజిన్, మైలేజ్ విషయానికొస్తే, నిస్సాన్ గ్రేవైట్‌లో 1.0-లీటర్, 3-సిలిండర్ పెట్రోల్ ఇంజిన్ అమర్చారు, ఇది 72 PS పవర్, 96 Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. మైలేజ్ పరంగా చూస్తే, మాన్యువల్ వేరియంట్ లీటరుకు 19.3 కి.మీ, ఆటోమేటిక్ వేరియంట్ 19.6 కి.మీ వరకు మైలేజ్ ఇస్తుందని కంపెనీ ధృవీకరించింది. ఈ కారు కోసం బుకింగ్స్ ఇప్పటికే ప్రారంభమయ్యాయి, ఆసక్తి గల వారు రూ.11,000 చెల్లించి బుక్ చేసుకోవచ్చు. మార్చి 2026 నుంచి డెలివరీలు మొదలయ్యే అవకాశం ఉంది. మొదటి 5,000 కస్టమర్లకు ప్రత్యేక ఆఫర్లతో పాటు 5 ఏళ్ల వరకు ఉచిత సర్వీస్ వంటి ప్రయోజనాలను నిస్సాన్ అందిస్తోంది.

Tags:    

Similar News