Renault : రెనాల్ట్ కార్లపై డిస్కౌంట్ల పండగ..ఏకంగా రూ.73,500 వరకు తగ్గిన ధరలు

ఏకంగా రూ.73,500 వరకు తగ్గిన ధరలు

Update: 2026-02-10 08:44 GMT

Renault : ఫ్రెంచ్ కార్ల తయారీ సంస్థ రెనాల్ట్ భారతీయ కస్టమర్ల కోసం అదిరిపోయే ఫిబ్రవరి ఆఫర్లను ప్రకటించింది. ఈ నెలలో కొత్త కారు కొనాలని ప్లాన్ చేస్తున్న వారికి ఇది ఒక గోల్డెన్ ఛాన్స్ అని చెప్పాలి. క్విడ్, కైగర్,ట్రైబర్ వంటి పాపులర్ మోడల్స్‌పై ఏకంగా రూ.73,500 వరకు భారీ డిస్కౌంట్లను కంపెనీ అందిస్తోంది. క్యాష్ డిస్కౌంట్లు, ఎక్స్ఛేంజ్ బోనస్‌లు, స్పెషల్ బెనిఫిట్స్ రూపంలో ఈ ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి.

రెనాల్ట్ కైగర్

ఫిబ్రవరి 2026లో రెనాల్ట్ నుంచి అత్యధిక డిస్కౌంట్ పొందుతున్న కారు కైగర్. ముఖ్యంగా దీని టర్బో సీవీటీ వేరియంట్‌పై కస్టమర్లు భారీగా ఆదా చేసుకోవచ్చు. ఈ మోడల్‌పై రూ.48,500 వరకు క్యాష్ డిస్కౌంట్, రూ.15,000 ఎక్స్ఛేంజ్ బోనస్, రూ.10,000 లాయల్టీ బోనస్ లభిస్తున్నాయి. వెరసి మొత్తం మీద రూ.73,500 వరకు ప్రయోజనం చేకూరుతుంది. అయితే సాధారణ ఇంజన్ వేరియంట్లపై ఈ డిస్కౌంట్ కొంచెం తక్కువగా ఉంటుంది.

రెనాల్ట్ ట్రైబర్

భారతదేశంలో అత్యంత చౌకైన 7-సీటర్ కారుగా పేరుగాంచిన ట్రైబర్‌పై కూడా రెనాల్ట్ ఆకర్షణీయమైన ఆఫర్లు ఇస్తోంది. ఎంపిక చేసిన టెక్నో, ఎమోషన్ వేరియంట్లపై రూ.55,000 వరకు తగ్గింపు లభిస్తోంది. ఇందులో రూ.30,000 క్యాష్ డిస్కౌంట్, రూ.15,000 ఎక్స్ఛేంజ్ బోనస్, రూ.10,000 లాయల్టీ బెనిఫిట్స్ ఉన్నాయి. ఒకవేళ మీరు పాత కారును స్క్రాప్ చేయాలనుకుంటే, ఎక్స్ఛేంజ్ బోనస్‌కు బదులుగా రూ.25,000 స్క్రాపేజ్ ఇన్సెంటివ్ కూడా ఎంచుకోవచ్చు.

రెనాల్ట్ క్విడ్

రెనాల్ట్ క్విడ్ క్లైంబర్ వేరియంట్‌పై కంపెనీ రూ.45,000 వరకు ప్రయోజనాలను అందిస్తోంది. ఇందులో రూ.20,000 క్యాష్ డిస్కౌంట్, రూ.15,000 ఎక్స్ఛేంజ్, రూ.10,000 లాయల్టీ బోనస్ ఉన్నాయి. సీఎన్జీ లేని వేరియంట్లను కొనుగోలు చేసే వారికి అదనంగా 3 ఏళ్ల పాటు ఉచిత ఏఎంసీ ప్యాకేజీని కూడా రెనాల్ట్ అందిస్తుండటం విశేషం. బడ్జెట్ లో కారు కావాలనుకునే వారికి క్విడ్ ఇప్పుడు బెస్ట్ ఆప్షన్.

ఈ ఆఫర్లు అన్నీ ఫిబ్రవరి 28, 2026 వరకు మాత్రమే అందుబాటులో ఉంటాయి. ఎక్స్ఛేంజ్ బోనస్, స్క్రాపేజ్ ఇన్సెంటివ్‌లలో ఏదో ఒకటి మాత్రమే కస్టమర్ ఎంచుకోవాల్సి ఉంటుంది. అలాగే లాయల్టీ బోనస్ అనేది ఇప్పటికే రెనో కారు వాడుతున్న వారికి మాత్రమే వర్తిస్తుంది. షోరూమ్ లొకేషన్, స్టాక్ లభ్యతను బట్టి ఈ డిస్కౌంట్లలో మార్పులు ఉండవచ్చు. కాబట్టి కారు బుక్ చేసుకునే ముందు మీ దగ్గరలోని రెనాల్ట్ డీలర్‌ను కలిసి పూర్తి వివరాలు తెలుసుకోవాలని సూచిస్తున్నాం.

Tags:    

Similar News