Hybrid SUVs : ఎస్‌యూవీల్లో మైలేజీ విప్లవం.. హ్యాపీగా షికార్లు చేసేందుకు 4 కొత్త హైబ్రిడ్ ఎస్‌యూవీలు సిద్ధం

హ్యాపీగా షికార్లు చేసేందుకు 4 కొత్త హైబ్రిడ్ ఎస్‌యూవీలు సిద్ధం

Update: 2026-04-28 11:50 GMT

Hybrid SUVs : భారతదేశంలో కార్ల లవర్స్ అభిరుచి వేగంగా మారుతోంది. ఒకప్పుడు కేవలం మైలేజీ మాత్రమే చూసే జనం, ఇప్పుడు పవర్, ఫీచర్ల కోసం ఎస్‌యూవీల వైపు మొగ్గు చూపుతున్నారు. అయితే, పెట్రోల్ ధరలు మండుతుండటంతో ఎస్‌యూవీల్లో కూడా మైలేజీ వెతుక్కునే పరిస్థితి వచ్చింది. అందుకే ఇప్పుడు దిగ్గజ కార్ల కంపెనీలన్నీ తమ పాపులర్ మోడళ్లను హైబ్రిడ్ అవతారంలోకి మార్చేస్తున్నాయి. హ్యుందాయ్ క్రెటా నుండి రెనో డస్టర్ వరకు.. త్వరలోనే రాబోతున్న ఆ 4 అదిరిపోయే ఎస్‌యూవీల వివరాలేంటో చూద్దాం.

1. రెనాల్ట్ డస్టర్ హైబ్రిడ్

ఎస్‌యూవీ సెగ్మెంట్లో ఒకప్పుడు సంచలనం సృష్టించిన రెనాల్ట్ డస్టర్ మళ్ళీ కొత్త రూపుతో రాబోతోంది. 2026 దీపావళి నాటికి ఈ కారు హైబ్రిడ్ వెర్షన్ మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది. ఇందులో 1.8 లీటర్ 4-సిలిండర్ పెట్రోల్ ఇంజిన్ ఉంటుంది. దీనికి తోడు రెండు ఎలక్ట్రిక్ మోటార్లు, 1.4kWh బ్యాటరీ ప్యాక్ కూడా అమర్చనున్నారు. ఇది సుమారు 160bhp పవర్ ను ఉత్పత్తి చేస్తూనే అద్భుతమైన మైలేజీని ఇస్తుంది. డిజైన్ పరంగా పాత డస్టర్ లాగే ఉన్నా, Hybrid బ్యాడ్జింగ్ తో ప్రత్యేకంగా కనిపిస్తుంది.

2. హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్

భారతదేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న మిడ్-సైజ్ ఎస్‌యూవీలు క్రెటా, సెల్టోస్. ఇవి రెండూ 2027లో స్ట్రాంగ్ హైబ్రిడ్ టెక్నాలజీతో లాంచ్ కానున్నాయి. హ్యుందాయ్, కియా తమ కొత్త ఎస్‌యూవీల్లో 1.5 లీటర్ పెట్రోల్ ఇంజిన్‌ను ఎలక్ట్రిఫై చేయబోతున్నాయి. కొత్త క్రెటా (SX3) డిజైన్ మరింత పొడవుగా, బాక్సీగా ఉండి, అదిరిపోయే రోడ్ ప్రజెన్స్ ను కలిగి ఉంటుంది. లోపల సరికొత్త ఇంటీరియర్, హైటెక్ ఫీచర్లతో ఇవి కస్టమర్లను ఆకట్టుకోనున్నాయి.

3. హోండా ఎలివేట్ హైబ్రిడ్

హోండా ఎలివేట్ ఇప్పుడు పెట్రోల్ వెర్షన్ లో మాత్రమే అందుబాటులో ఉంది. అయితే, హోండా సిటీలో ఉన్న City e:HEV స్ట్రాంగ్ హైబ్రిడ్ సిస్టమ్ నే ఎలివేట్ లో కూడా తీసుకురావాలని కంపెనీ ప్లాన్ చేస్తోంది. ఇందులో 1.5 లీటర్ పెట్రోల్ ఇంజిన్ తో పాటు రెండు ఎలక్ట్రిక్ మోటార్లు ఉంటాయి. ఒకటి జనరేటర్ లాగా, మరొకటి డ్రైవింగ్ కోసం పనిచేస్తుంది. 2026 రెండో అర్థభాగంలో ఇది మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది. సాధారణ పెట్రోల్ వెర్షన్ కంటే దీని ధర రూ.2 నుంచి 2.5 లక్షలు ఎక్కువగా ఉండవచ్చు.

హైబ్రిడ్ ఎస్‌యూవీల వల్ల లాభాలేంటి?

హైబ్రిడ్ కార్లు పెట్రోల్, ఎలక్ట్రిక్ పవర్ రెండింటినీ వాడుకోవడం వల్ల సాధారణ కార్ల కంటే 30 నుంచి 40 శాతం ఎక్కువ మైలేజీని ఇస్తాయి. సిటీ ట్రాఫిక్ లో ఇవి ఎలక్ట్రిక్ మోటార్ పై నడుస్తూ పెట్రోల్ ఆదా చేస్తాయి. అలాగే, ఎలక్ట్రిక్ కార్ల లాగా వీటిని ఛార్జ్ చేయాల్సిన అవసరం లేదు, ఇంజిన్ నడుస్తున్నప్పుడే బ్యాటరీ ఆటోమేటిక్ గా ఛార్జ్ అవుతుంది. దీంతో రేంజ్ ఆందోళన లేకుండా సుదీర్ఘ ప్రయాణాలు చేయవచ్చు.

Tags:    

Similar News