Skoda : సింగిల్ ఛార్జ్‌తో 425 కి.మీ ప్రయాణం..స్కోడా నుంచి కొత్త ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ

స్కోడా నుంచి కొత్త ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ

Update: 2026-02-13 08:46 GMT

Skoda : ఆటోమొబైల్ దిగ్గజం స్కోడా తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి సరికొత్త ఆయుధాన్ని సిద్ధం చేసింది. అదే స్కోడా ఎపిక్. ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ మార్కెట్లో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకోవడానికి సిద్ధమవుతున్న ఈ కారు, ఒక్కసారి ఛార్జ్ చేస్తే ఏకంగా 425 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుంది. 4.1 మీటర్ల పొడవుతో రూపొందిన ఈ కాంపాక్ట్ ఎలక్ట్రిక్ కారు, అటు సిటీ డ్రైవింగ్‌కు, ఇటు వీకెండ్ ట్రిప్స్‌కు పక్కాగా సరిపోతుంది. స్కోడా ఇపిక్ కారును మ్యూనిచ్ మోటార్ షోలో ప్రదర్శించారు. ఇది స్కోడా సరికొత్త మోడరన్ సాలిడ్ డిజైన్ ఫిలాసఫీతో రూపొందింది.

దీనిలోని పవర్ఫుల్ బ్యాటరీ ప్యాక్ ఒక్కసారి ఛార్జ్ చేస్తే 425 కిలోమీటర్ల రేంజ్ అందిస్తుంది. ఈ కారు పొడవు 4.1 మీటర్లు. ఇది ఫోక్స్‌వ్యాగన్ గ్రూప్ MEB ఎంట్రీ ఆర్కిటెక్చర్ ప్లాట్‌ఫామ్‌పై ఆధారపడి ఉంటుంది. కేవలం సిటీ డ్రైవింగ్ కోసమే కాకుండా, ఐదుగురు కూర్చునే విధంగా విశాలమైన క్యాబిన్, 475 లీటర్ల భారీ బూట్ స్పేస్‌ను కలిగి ఉంది. లోపల వైర్‌లెస్ ఛార్జింగ్, ఫిజికల్ బటన్లతో కూడిన మినిమలిస్ట్ ఇంటీరియర్, అడ్వాన్స్‌డ్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఉన్నాయి.

భారత్ లో స్కోడా అమ్మకాలు ప్రస్తుతం జోరుగా సాగుతున్నాయి. జనవరి 2026లో కంపెనీ మొత్తం 5,739 యూనిట్లను విక్రయించి, గత ఏడాదితో పోలిస్తే 39% వృద్ధిని నమోదు చేసింది. స్కోడా కైలక్ 3,220 యూనిట్లతో ఇది కంపెనీలో నంబర్ వన్ మోడల్‌గా నిలిచింది. స్లావియా 1,946 యూనిట్ల అమ్మకాలతో సెడాన్ సెగ్మెంట్‌లో దుమ్ము రేపుతోంది. కుషాక్ 434 యూనిట్లు అమ్ముడయ్యాయి. ఇటీవలే దాని ఫేస్‌లిఫ్ట్ బుకింగ్స్ కూడా ప్రారంభమయ్యాయి. కోడియాక్ 139 యూనిట్ల అమ్మకాలు జరిగాయి

స్కోడా ఎపిక్ 2026 మధ్య నాటికి ప్రపంచవ్యాప్తంగా విక్రయానికి రానుంది. దీని ధరను తన పెట్రోల్ మోడల్ కామిక్ కు సమానంగా ఉంచాలని కంపెనీ భావిస్తోంది. దీనివల్ల ఎలక్ట్రిక్ కారు కొనాలనుకునే సామాన్యులకు ఇది ఒక గొప్ప వరంగా మారుతుంది.

Tags:    

Similar News