Suzuki : రూ.7 వేల బెనిఫిట్, 10 ఏళ్ల వారంటీ.. సుజుకి టూ-వీలర్లపై ఆఫర్ల వర్షం

సుజుకి టూ-వీలర్లపై ఆఫర్ల వర్షం

Update: 2026-02-19 06:41 GMT

 Suzuki : సుజుకి మోటార్‌సైకిల్ ఇండియా తన కస్టమర్ల కోసం ఈ నెల అదిరిపోయే ఆఫర్లను ప్రకటించింది. మీరు కొత్త టూ-వీలర్ కొనాలని ప్లాన్ చేస్తుంటే ఇదే సరైన సమయం. సుజుకి తన వాహనాలపై ఏకంగా రూ.7,000 వరకు ఇన్సూరెన్స్ బెనిఫిట్స్ అందిస్తోంది. దీనికి తోడు, వాహనంపై నమ్మకాన్ని పెంచేలా 10 ఏళ్ల ఎక్స్‌టెండెడ్ వారంటీని కూడా ఇస్తోంది. ఇక డబ్బుల ఇబ్బంది లేకుండా ఉండేందుకు ఏకంగా 100% లోన్ సౌకర్యాన్ని కల్పిస్తోంది. ఈ ఆఫర్లకు సంబంధించిన పూర్తి వివరాలు, షరతుల కోసం మీ దగ్గర్లోని సుజుకి డీలర్‌షిప్‌ను సంప్రదించవచ్చు.

సేఫ్టీ విషయంలో రాజీపడకుండా సుజుకి తన పాపులర్ స్కూటర్ యాక్సెస్‎ను అప్‌డేట్ చేసింది. ఇప్పుడు ఈ స్కూటర్ ABS (యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్) ఫీచర్‌తో అందుబాటులోకి వచ్చింది. హఠాత్తుగా బ్రేకులు వేసినప్పుడు చక్రాలు లాక్ అవ్వకుండా ఈ సిస్టమ్ కాపాడుతుంది, తద్వారా ప్రమాదాల భయం తగ్గుతుంది. మైలేజీ, కంఫర్ట్, పర్ఫార్మెన్స్‌లో మార్పు లేకుండానే ఈ సేఫ్టీ ఫీచర్‌ను జతచేశారు. యాక్సెస్ రైడ్ కనెక్ట్ ABS ఎడిషన్ ధర రూ.92,328 (ఎక్స్-షోరూమ్) కాగా, హై-ఎండ్ TFT డిస్‌ప్లే ఉన్న వేరియంట్ ధర రూ.98,378 గా ఉంది. ఇది ఐదు ఆకర్షణీయమైన రంగుల్లో లభిస్తోంది.

సాంకేతికంగా ఈ స్కూటర్‌లో 124 cc సింగిల్ సిలిండర్ ఇంజిన్ ఉంది. ఇది 8.7 PS పవర్, 10 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇందులో 21.8 లీటర్ల అండర్-సీట్ స్టోరేజ్, ఎక్స్‌టర్నల్ ఫ్యూయల్ లిడ్, బ్లూటూత్ కనెక్టివిటీ, టర్న్-బై-టర్న్ నావిగేషన్ వంటి స్మార్ట్ ఫీచర్లు ఉన్నాయి. హోండా యాక్టివా, టీవీఎస్ జుపిటర్ వంటి మోడళ్లకు ఇది గట్టి పోటీనిస్తోంది. కేవలం 105 కిలోల బరువు ఉండటం వల్ల రద్దీగా ఉండే సిటీ రోడ్లపై దీనిని నడపడం చాలా సులభం.

ఇక సుజుకి కంపెనీ సేల్స్ పరంగా కూడా దూసుకుపోతోంది. జనవరి 2026లో కంపెనీ ఏకంగా 15% వృద్ధిని సాధించింది. మొత్తం 1,25,786 వాహనాలను విక్రయించి గత రికార్డులను తిరగరాసింది. దేశీయంగానే కాకుండా విదేశాలకు ఎగుమతి చేసే విషయంలోనూ 21% పెరుగుదల కనిపించింది. కస్టమర్ల ఆదరణ పెరగడం, కొత్త ఆఫర్లు తోడవడంతో ఈ నెలలో అమ్మకాలు ఇంకా పెరిగే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.

Tags:    

Similar News