Trending News

Tata Nexon.ev 45 : ఒక్క ఛార్జ్‌తో 489 కిలోమీటర్ల ప్రయాణం..నెక్సాన్.ఈవీ 45 పవర్ అదిరిపోయింది

నెక్సాన్.ఈవీ 45 పవర్ అదిరిపోయింది

Update: 2026-01-24 12:41 GMT

Tata Nexon.ev 45 : టాటా మోటార్స్ తన అత్యంత ప్రజాదరణ పొందిన ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ నెక్షాన్.ఈవీ లైనప్‌ను మరింత కలర్‌ఫుల్‌గా మార్చేసింది. ముఖ్యంగా 45 kWh బ్యాటరీ ప్యాక్ ఉన్న మోడళ్ల కోసం ప్యూర్ గ్రే, ఓషన్ బ్లూ అనే రెండు కొత్త డ్యూయల్-టోన్ రంగులను పరిచయం చేసింది. రూ.12.49 లక్షల ప్రారంభ ధరతో లభించే ఈ కారు, ఇప్పుడు కొత్త హంగులతో మహీంద్రా XUV400 వంటి ప్రత్యర్థులకు గట్టి పోటీనిస్తోంది.

భారత ఎలక్ట్రిక్ వాహన రంగంలో అగ్రగామిగా ఉన్న టాటా మోటార్స్, తన నెక్సాన్.ఈవీ శ్రేణిని మరింత విస్తరించింది. తాజాగా విడుదల చేసిన ప్యూర్ గ్రే, ఓషన్ బ్లూ రంగులు నెక్సాన్.ఈవీ 45 లోని క్రియేటివ్, ఫియర్‌లెస్, ఎంపవర్డ్ వేరియంట్లలో అందుబాటులో ఉన్నాయి. ఇందులో ఫియర్‌లెస్, ఎంపవర్డ్ వేరియంట్లు బ్లాక్ రూఫ్‌తో వస్తుండగా, క్రియేటివ్ వేరియంట్ వైట్ రూఫ్‌తో మరింత స్టైలిష్‌గా కనిపిస్తోంది. గమనించదగ్గ విషయం ఏమిటంటే..ఈ కొత్త రంగులు కేవలం 45 kWh బ్యాటరీ మోడళ్లకే పరిమితం, 30 kWh మోడళ్లలో ఇవి దొరకవు.

రేంజ్, పెర్ఫార్మెన్స్

నెక్సాన్.ఈవీ 45 మోడల్ 46.08 kWh బ్యాటరీ ప్యాక్‌తో వస్తుంది. ఇది ఒక్కసారి ఛార్జ్ చేస్తే 489 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుందని కంపెనీ పేర్కొంది. 144 bhp పవర్, 215 Nm టార్క్‌ను ఉత్పత్తి చేసే ఈ కారు, కేవలం 8.9 సెకన్లలోనే 0 నుంచి 100 కిమీ వేగాన్ని అందుకుంటుంది. ఛార్జింగ్ విషయానికి వస్తే.. 60 kW DC ఫాస్ట్ ఛార్జర్ ద్వారా కేవలం 40 నిమిషాల్లోనే 10 నుంచి 80 శాతం ఛార్జింగ్ పూర్తి చేసుకోవచ్చు. అలాగే, ఈ కారు వెహికల్-టు-వెహికల్, వెహికల్-టు-లోడ్ ఫీచర్లను కూడా సపోర్ట్ చేస్తుంది.

ఫీచర్లు, వారంటీ

కారు లోపల 12.30 అంగుళాల భారీ టచ్‌స్క్రీన్, 10.25 అంగుళాల డిజిటల్ క్లస్టర్, 360-డిగ్రీ కెమెరా, వెంటిలేటెడ్ సీట్లు, సన్‌రూఫ్ వంటి ప్రీమియం సౌకర్యాలు ఉన్నాయి. వినియోగదారులకు భరోసా ఇచ్చేలా టాటా మోటార్స్ తన హై-వోల్టేజ్ బ్యాటరీపై లైఫ్‌టైమ్ వారంటీని (తొలి రిజిస్టర్డ్ ఓనర్‌కు 15 ఏళ్ల వరకు) ప్రకటిస్తూ సంచలనం సృష్టించింది. ఇది ఎలక్ట్రిక్ కార్ల కొనుగోలుదారులలో ఉన్న బ్యాటరీ భయాన్ని పోగొడుతోంది.

మార్కెట్ లో రికార్డులు: డిసెంబర్ 2025 నాటికి నెక్సాన్.ఈవీ భారత మార్కెట్లో 1,00,000 యూనిట్ల అమ్మకాల మైలురాయిని దాటిన తొలి ఎలక్ట్రిక్ కారుగా చరిత్ర సృష్టించింది. దేశంలోని ఈవీ మార్కెట్లో టాటా మోటార్స్ ప్రస్తుతం 66% వాటాతో తిరుగులేని నాయకుడిగా కొనసాగుతోంది. నెక్సాన్.ఈవీతో పాటు పంచ్.ఈవీ, టియాగో.ఈవీ, త్వరలో రానున్న హారియర్. ఈవీ మోడళ్లతో టాటా తన ఈవీ సామ్రాజ్యాన్ని మరింత బలోపేతం చేసుకుంటోంది.

Tags:    

Similar News