Tesla : ఎంట్రీ ముందు టీజర్ రిలీజ్ చేసిన టెస్లా.. లోగో అదుర్స్

లోగో అదుర్స్;

Update: 2025-07-14 10:24 GMT

Tesla : టెస్లా తన సోషల్ మీడియాలో మొదటి టీజర్‌ను విడుదల చేసింది. ఈ టీజర్ చాలా సింపుల్‌గా ఉంది.. టెస్లా లోగో, భారత్ అనే టెక్స్ట్‌ను చూడవచ్చు. అలాగే క్యాప్షన్‌లో Coming Soon అని రాసి ఉంది. ఈ బ్రాండ్ భారతదేశంలో తమ మొదటి డీలర్‌షిప్‌ను ఓపెన్ చేసేందుకు రెడీ అవుతుంది. ఇది ముంబైలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్ లో ఉండనుంది. మొదటి ఎక్స్‌పీరియన్స్ సెంటర్ జులై 15న ప్రారంభమవుతుంది.

ఎలక్ట్రిక్ కార్లు ప్రస్తుతం భారత మార్కెట్లో చాలా మోడల్స్ ఉన్నాయి. కానీ టెస్లా పట్ల ప్రజల్లో ఉన్న క్రేజ్ మాత్రం చాలా భిన్నంగా ఉంది. టెస్లా రెండవ ఎక్స్‌పీరియన్స్ సెంటర్ న్యూ ఢిల్లీలో ప్రారంభించబడుతుంది. బ్రాండ్‌కు ఇప్పటికే బెంగళూరులో ఆఫీసు ఉంది. అంతేకాకుండా, టెస్లా కర్ణాటక, గురుగ్రామ్ లో కూడా వేర్‌హౌస్‌ల కోసం వెతుకుతోంది.

వాహన తయారీ సంస్థ భారత రోడ్లపై తమ మోడల్ Y , మోడల్ 3 కార్లను టెస్టింగ్ చేస్తోంది. కంపెనీ భారతదేశంలో విక్రయించే టెస్లా కార్లు అమెరికా మార్కెట్‌లో ఉపయోగించే NCAS కు బదులుగా CCS2 ఛార్జింగ్ పోర్ట్‌ను ఉపయోగిస్తాయి. ఐదు మోడల్ Y కార్లు ముంబై పోర్ట్‌కు చేరుకున్నాయి. ఇవి టెస్లా షాంఘై ప్లాంట్ నుండి దిగుమతి చేసుకున్న రియర్ వీల్ డ్రైవ్ మోడల్స్. బ్రాండ్ భారత రోడ్లపై ఈ ఎలక్ట్రిక్ వాహనాలను టెస్టింగ్ చేస్తోంది.

https://x.com/Tesla_India/status/1943709271859806465?ref_src=twsrc^tfw|twcamp^tweetembed|twterm^1943709271859806465|twgr^7057aa1b2c2b5feba94bb3245405af9eed3295af|twcon^s1_&ref_url=https://www.tv9hindi.com/automobile/tesla-releases-first-teaser-ahead-of-india-launch-for-the-first-time-3386087.html

ప్రపంచవ్యాప్తంగా మోడల్ Y ఒకే కాన్ఫిగరేషన్‌లో వస్తుంది. ఇందులో ఆల్-వీల్ డ్రైవ్ సిస్టమ్ , లాంగ్ రేంజ్ బ్యాటరీ ఉంటాయి. ఇది EPA-అంచనా ప్రకారం 526 కిలోమీటర్ల రేంజ్, మాగ్జిమమ్ స్పీడ్ 200 కి.మీ/గం అందిస్తుంది. ఇది కేవలం 4.6 సెకన్లలో 0 నుండి 96 కి.మీ/గం వేగాన్ని అందుకోగలదు.

ఈ కారు ఫీచర్ల విషయానికి వస్తే, ఇందులో 15-స్పీకర్ ఆడియో సిస్టమ్, హ్యాండ్స్-ఫ్రీ టెయిల్‌గేట్, ఎనిమిది ఎక్సటర్నల్ కెమెరాలు ఉంటాయి. సేఫ్టీ ఫీచర్లలో ఆటోమేటిక్ ఎమర్జెన్సీ బ్రేకింగ్, ఫార్వర్డ్ కొల్లీజన్ అలర్ట్, బ్లైండ్ స్పాట్ మానిటరింగ్, లేన్ కీపింగ్ అసిస్ట్ వంటివి ఉన్నాయి. మోడల్ Y ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా అమ్ముడైన ఎలక్ట్రిక్ కారు. దీని ధర అమెరికాలో 44,990డాలర్లు.

Tags:    

Similar News