Automatic Cars : ట్రాఫిక్ కష్టాలకు చెక్.. రూ. 10 లక్షల లోపే అదిరిపోయే 5 ఆటోమేటిక్ కార్లు ఇవే
రూ. 10 లక్షల లోపే అదిరిపోయే 5 ఆటోమేటిక్ కార్లు ఇవే
Automatic Cars : సిటీల్లో పెరిగిపోతున్న ట్రాఫిక్‌లో క్లచ్ నొక్కడం, గేర్లు మార్చడం అంటే పెద్ద తలనొప్పి. అందుకే ఇప్పుడు అందరూ ఆటోమేటిక్ కార్ల వైపు మొగ్గు చూపుతున్నారు. ముఖ్యంగా రూ.10 లక్షల బడ్జెట్‌లో అదిరిపోయే మైలేజీ, కంఫర్ట్ ఇచ్చే టాప్-5 ఆటోమేటిక్ కార్ల వివరాలు తెలుసుకుందాం.
1. టాటా టియాగో: సేఫ్టీలో రారాజు తక్కువ బడ్జెట్‌లో సురక్షితమైన ఆటోమేటిక్ కారు కావాలంటే టాటా టియాగో మొదటి ఆప్షన్. దీనికి గ్లోబల్ NCAP నుంచి 4-స్టార్ సేఫ్టీ రేటింగ్ ఉంది. ఇందులో పెట్రోల్ తో పాటు సిఎన్జీ వెర్షన్‌లో కూడా ఆటోమేటిక్ ఆప్షన్ ఉండటం విశేషం. దీని ధర రూ.6.31 లక్షల నుంచి రూ.8.10 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్య ఉంటుంది. మైలేజీతో పాటు సేఫ్టీ కోరుకునే వారికి ఇది పర్ఫెక్ట్ ఛాయిస్.
2. మారుతి సుజుకి స్విఫ్ట్: అందరి ఫేవరెట్ భారతదేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న హ్యాచ్‌బ్యాక్ మారుతి స్విఫ్ట్. కొత్త జనరేషన్ స్విఫ్ట్‌లో 1.2 లీటర్ ఇంజిన్ అద్భుతమైన మైలేజీని ఇస్తుంది. వైర్‌లెస్ ఛార్జింగ్, టచ్‌స్క్రీన్ వంటి ప్రీమియం ఫీచర్లు ఇందులో ఉన్నాయి. దీని ఆటోమేటిక్ వేరియంట్ల ధర రూ.7.04 లక్షల నుండి రూ.8.65 లక్షల వరకు ఉంటుంది. రీసేల్ వాల్యూ, తక్కువ మెయింటెనెన్స్ కోరుకునే వారికి స్విఫ్ట్ బెస్ట్ ఆప్షన్.
3. హ్యుందాయ్ i20: లగ్జరీ లుక్ స్టైలిష్ డిజైన్, ప్రీమియం ఫీచర్లు కావాలనుకునే వారు హ్యుందాయ్ i20 ను ఎంచుకోవచ్చు. ఇందులో డిజిటల్ క్లస్టర్, సన్‌రూఫ్ వంటి ఫీచర్లు కారుకు లగ్జరీ ఫీల్ ఇస్తాయి. దీని ఆటోమేటిక్ వేరియంట్ల ధర రూ.8.13 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. ఫ్యామిలీతో కలిసి సిటీలో లగ్జరీగా తిరగాలనుకునే వారికి ఈ కారు బాగా సెట్ అవుతుంది.
4. సిట్రోయెన్ C3X: డిఫరెంట్ స్టైల్ మీరు రెగ్యులర్ కార్ల కంటే కొంచెం భిన్నంగా ఉండే కారు కావాలనుకుంటే సిట్రోయెన్ C3X చూడవచ్చు. ఇందులో టర్బో పెట్రోల్ ఇంజిన్ ఉండటం వల్ల డ్రైవింగ్ చాలా స్పోర్టీగా ఉంటుంది. రూ.9.05 లక్షల ధరలో లభించే ఈ కారు, సిటీ రోడ్లపై చాలా ఫాస్ట్ గా, ఈజీగా దూసుకుపోతుంది. దీని సస్పెన్షన్ కంఫర్ట్ కూడా చాలా బాగుంటుంది.
5. మారుతి ఆల్టో K10: సామాన్యుడి సవారీ బడ్జెట్ లో తక్కువ, సిటీలో పార్కింగ్ సమస్యలు ఉండకూడదు అనుకుంటే మారుతి ఆల్టో K10 ను మించిన కారు లేదు. దీనిని ముద్దుగా లార్డ్ ఆల్టో అని కూడా పిలుస్తారు. ఇందులో కూడా ఆటోమేటిక్ ఆప్షన్ ఉంది. దీని ధర కేవలం రూ.4.95 లక్షల నుంచి రూ.5.45 లక్షల లోపే ఉంటుంది. మొదటిసారి కారు కొనేవారికి, ఇరుకైన గల్లీల్లో తిరగడానికి ఇది చాలా సౌకర్యవంతంగా ఉంటుంది.